చల్లని వాతావరణం.. ఓ పక్క వర్షం పడుతుంటే మరో పక్క వేడి వేడి పకోడీ లేదా సమోసా తింటుంటే సూపర్ గా ఉంటుంది. వర్షాకాలంలో చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ ఇది. క్రిస్పీ స్ట్రీట్ డిలైట్స్, స్పైసీ చట్నీ ప్లేట్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. స్పైసీ ఫుడ్ తినాలని మనసు తెగ లాగేస్తుంది. వడలు, మిర్చీ భజ్జీ, సమోసా, ఇండో చైనీస్ వంటకాలు, కరకరలాడే ఆహారాలకి ఈ సీజన్ లో మంచి డిమాండ్ ఉంటుంది. వాటి వాసన మనల్ని వాటి దగ్గరకి రప్పించేసుకుంటాయి. అయితే కేవలం వర్షాకాలంలో ఇలాంటి ఫుడ్ తినాలని ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అదొక ఎంజాయ్ మెంట్ అని మాత్రమే చాలా మంది అనుకుంటారు. కానీ వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ తినాలనే కోరిక కలగడానికి కారణం ఉంది. వర్షాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరం సంతోషాన్ని కలిగే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తిని పెంచే ఆహారాల కోసం మనసు ఆరాటపడుతుందని న్యూట్రీషనిస్ట్ చెప్తున్నారు.


డీప్ ఫ్రై ఫుడ్ తినాలనే కోరిక అందుకే..


మనకి సంతోషాన్ని కలిగించే హార్మోన్ సెరోటోనిన్ స్థాయిలు వర్షాకాలంలో తగ్గుముఖం పడతాయి. అందుకు కారణం సరైన సూర్యకాంతి శరీరానికి తగలకపోవడం. ఇది శరీరంలోని విటమిన్ డి ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ లోపాన్ని సర్దుబాటు చేసుకోవడం కోసం శరీరం కార్బోహైడ్రేట్లను కోరుకుంటుంది. కార్బోహైడ్రేట్ తో పాటు డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తింటే నోటికి క్రంచీగా రుచిగా అనిపిస్తాయి. ఇవి తింటే మనసుకి హాయి అనిపిస్తుంది. మసాలా ఫుడ్ తినాలని అనిపించడానికి వెనుక ఒక శాస్త్రం కూడా ఉందని అంటున్నారు.


మిరపకాయలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మనల్ని వేడిగా ఏదైనా తినమని అనిపించేలా నోటిలోని నరాలను మాయ చేస్తుంది. అవి తిన్నప్పుడు మెదడు మనకు చెమట పట్టేలా చేస్తుంది. ఆనందాన్ని కలిగించే డోపమైన్ ని రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది. డీప్ ఫైడ్ ఫుడ్ కేలరీలతో నిండి ఉంటుంది. ఈ ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల బరువు, కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది. మన రుచి మొగ్గలు సంతృప్తి పరుచుకుని సంతోషకరమైన హార్మోన్లను పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన మార్గాలు ఎంచుకోవాలి.


ఇవి తింటే ఆరోగ్యం, రుచికరం


⦿ వెన్నతో రోస్ట్ చేసిన మొక్క జొన్న కాబ్స్, వాటికి మసాలా, నిమ్మకాయ రసం జోడించుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.


⦿ స్ప్రౌట్స్ సలాడ్, వెజిటబుల్ సలాడ్ లేదా మొక్కజొన్న సలాడ్ లో వివిధ రకాల కూరగాయలు, మసాలాలు వేసుకుని చిరుతిండి తయారు చేసుకోవచ్చు.


⦿ ఆలూ చాట్, ఆలూ దహీ చాట్ లేదా కాల్చిన ఆలూ చాట్ ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక


⦿ తాజా కూరగాయలతో చేసిన శాండ్ విచ్ పకోడాలు


⦿ తరిగిన కూరగాయలతో వేయించిన్ పాపడ్, పుదీనా చట్నీ కాంబినేషన్ సూపర్


⦿ కూరగాయలు లేదా గిన్నె పాప్ కార్న్ తో కూడిన ముర్మురా భేల్ అనారోగ్యకరమైన చిప్స్ ప్యాకెట్ కోరికలు తీర్చేందుకు మంచి ప్రత్యామ్నాయం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Join Us on Telegram:https://t.me/abpdesamofficial


Also Read: కళ్ళు పొడిబారిపోతున్నాయా? ఈ ఆహారాలతో ఆ సమస్యకి చెక్ పెట్టొచ్చు