మనదేశం అనేక మత విశ్వాసాలకు నెలవు. ఆ విశ్వాసాలకు ఎంతో విలువ ఇచ్చే ప్రజలు ఇక్కడ ఉన్నారు. కొన్ని పనులు శుభకరమైనవని ఆ విశ్వాసాలు చెబుతుంటే, మరికొన్ని అశుభకరమైనవి చెబుతున్నాయి.మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటూ కొన్ని దేశాల్లో మూడు సంఖ్యను అశుభంగా భావిస్తారు. మూడు అనే సంఖ్య వ్యక్తిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని కూడా చెబుతారు. ముఖ్యంగా మూడు చపాతీలు పెట్టడంపై చాలా వాదనలు ఉన్నాయి. 


హిందూమతంలో, ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని పేరు మీద కర్మ చేస్తారు. దాని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ప్లేటులో మూడు రోటీలు పెడతారు. మూడు రోటీలతో కూడిన ప్లేటు మరణించిన వ్యక్తికి చెందినదిగా భావిస్తారు. అలాగే ఆ ప్లేటును వడ్డించే వ్యక్తి మాత్రమే చూడాలని, ఎవరూ చూడకూడదని కూడా చెబుతారు. అందుకే జీవించి ఉన్న వ్యక్తి ప్లేటులో మూడు రోటీలు వేసుకుని తినకూడదని చెబుతుంటారు పెద్దలు. ముఖ్యంగ ఉత్తర భారతదేశంలో ఈ నమ్మకం చాలా ఎక్కువ. 


శత్రుత్వానికి ప్రతీక
మూడు అంకెకు సంబంధించి మరో నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఎవరికైనా ఆహారాన్ని మూడు సంఖ్యలో వడ్డించినట్టయితే అంటే మూడు కాజాలు, మూడు జిలేబీలు, మూడు గుడ్లు... ఇలా మూడు వడ్డించినట్టయితే వారిలో శత్రుత్వ భావన పెరుగుతుందని,  వడ్డించిన వ్యక్తికి, తిన్న వ్యక్తికి మధ్య అభిప్రాయబేధాలు వస్తాయని, ఇది తగాదాలకు దారితీస్తుందని నమ్మకం. 


లాజికల్‌గా ఆలోచిస్తే...
పైన చెప్పనవన్నీ మత విశ్వాసాలు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపడేస్తారు. అది వారి వారి అభిప్రాయాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. లాజికల్ గా ఆలోచిస్తే మాత్రం ఒక వ్యక్తి  మూడు చపాతీలు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కప్పు అన్నం, కూర, పెరుగు, రెండు చపాతీలు తినడం పూర్తి భోజనంగా భావిస్తారు. మూడు సంఖ్య గురించి ఉన్న వాదనలు నమ్మాలా వద్దా అన్నది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం.



Also read: అనారోగ్యంగా ఉన్నప్పుడు జిమ్‌కు వెళ్తున్నారా? గుండె పోటు ప్రమాదం పొంచి ఉండొచ్చు


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.