Excessive Hair Fall During Monsoon : వర్షాకాలం రాగానే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టు ఊడిపోవడం కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సాధారణంగా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం సహజమే. అయితే వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం, స్కాల్ప్​కు చెమట పట్టడం, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, సరైన హెయిర్ కేర్ పాటించకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువగా అనిపించవచ్చు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటాయంటున్నారు నిపుణులు. 

Continues below advertisement

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడటానికి కారణాలు

వర్షాకాలంలో గాలిలో తేమ (Humidity) అధికంగా ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్ ఎక్కువసేపు తడిగా ఉండి జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాగే జుట్టు చిక్కులు పడటం, విరిగిపోవడం కూడా పెరుగుతుంది. తేమ కారణంగా దుమ్ము, మురికి, ఆయిల్ తలపై పేరుకుని హెయిర్ ఫాలికల్స్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది జుట్టు రాలడానికి ఒక కారణం కావచ్చు.

Also Read : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి

Continues below advertisement

వర్షాకాలంలో తడి వాతావరణం వల్ల స్కాల్ప్​పై ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చుండ్రు, దురద, తల చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని మరింత పెంచుతాయి. తడిసిన తర్వాత తలను శుభ్రం చేయకపోతే తల చర్మంపై ప్రభావం చూపి జుట్టు బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్, విటమిన్ D వంటి పోషకాలు తగినంతగా అందకపోతే జుట్టు మూలాలు బలహీనపడి హెయిర్ ఫాల్ పెరగవచ్చు. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లు మారడం కూడా దీనికి కారణం కావచ్చు.

జుట్టు పూర్తిగా ఆరకముందే పోనీటైల్ లేదా గట్టిగా జడ వేయడం వల్ల ఒత్తిడి పెరిగి వెంట్రుకలు సులభంగా తెగిపోవచ్చు. మానసిక ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం కూడా జుట్టు రాలడాన్ని పెంచే ముఖ్యమైన కారణాల్లో ఒకటిగా చెప్తున్నారు. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు ఏంటో.. అవి ఎలా పని చేస్తాయో చూసేద్దాం. 

Also Read : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?

జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు చిట్కాలు

వారానికి 2 లేదా 3 సార్లు మైల్డ్ షాంపూతో తలను శుభ్రంగా కడగండి. వర్షంలో తడిస్తే ఇంటికి వచ్చిన వెంటనే శుభ్రమైన నీటితో తలను కడిగి ఆరబెట్టండి. తడి జుట్టును గట్టిగా కట్టకండి. పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే స్టైల్ చేసుకోండి. ప్రోటీన్, ఆకుకూరలు, గుడ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారం తీసుకోవాలి. హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి వాటి వినియోగాన్ని తగ్గించండి. అలాగే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించే యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..

దురద, చుండ్రు లేదా ఇన్‌ఫెక్షన్ ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదిస్తే మంచిది. అలాగే రోజుకు సాధారణం కంటే ఎక్కువగా జుట్టు ఊడిపోతుంటే.. తలపై ఖాళీ ప్రదేశాలు కనిపిస్తుంటే.. తీవ్రమైన చుండ్రు, దురద లేదా ఎర్రబడటం ఉంటే ఆలస్యం చేయకుండా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే వైద్యులు రక్త పరీక్షలు చేసి ఐరన్, విటమిన్ D, విటమిన్ B12 లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా అని పరిశీలించి తగిన చికిత్స సిఫార్సు చేస్తారు. 

Also Read : జుట్టు పెరుగుదలకు, జుట్టు సంరక్షణ కోసం ఫాలో అవ్వాల్సి ఇంటి చిట్కాల కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.