Women do not Urinate as Often as Men : బ్లాడర్ ఫుల్ అయితే మగ, ఆడ సంబంధం లేకుండా అందరూ టాయిలెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎలా పోల్చి చూసిన.. ఆడవారి కంటే మగవారే మూత్రవిసర్జన ఎక్కువ చేస్తారట. సాధారణంగా మూత్ర నిల్వ సామర్థ్యం.. అంటే బ్లాడర్ ఫుల్ అవ్వడానికి 300 మి.లీ నుంచి 600 మి.లీ వరకు ఉంటుంది. ఆ లెవెల్‌ని రీచ్ అయినప్పుడు వాష్‌రూమ్‌కి వెళ్లేందుకు కంగారు పడతారు. పైగా మూత్రవిసర్జనతో శరీరంలో టాక్సిన్స్ బయటకు వస్తాయి. టాయిలెట్‌ని ఎక్కువసేపు కంట్రోల్ చేసుకుంటే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ని తెలిసినా.. ఆడవారు ఎక్కువ మూత్రవిసర్జన చేయరు. ఎందుకంటే..
మహిళలు మూత్ర విసర్జన ఎక్కువ చేయరంటే అర్థం వారికి బ్లాడర్ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కాదు. వారు టాయిలెట్ యూజ్ చేసుకునేందుకు సరైన, అనువైన ప్రదేశం లేకపోవడమే. ఈ విషయంలో మగవారికి ఉండే బెనిఫిట్స్ అన్ని.. ఇన్ని కాదు. చాలా సులభంగా, వాష్ రూమ్స్ లేకపోయినా.. ఎక్కడపడితే అక్కడ యూరినేట్ చేయగలిగే ఫ్రీడమ్ మగవారికి ఉంది. కానీ మహిళల్లో అలా కాదు. అనువైన ప్రదేశం లేకుంటా వారు యూరిన్‌కు వెళ్లలేరు. కాబట్టి పురుషుల్లాగ మహిళలు ఎక్కువ టాయిలెట్స్‌కి వెళ్లలేరు.
యూరిన్ సమస్యలకు అదే కారణం..
కొందరు మహిళలు.. ఇంటి నుంచి బయటకు వెళ్తే.. గమ్యానికి చేరుకున్నాక.. లేదా తిరిగి ఇంటికి వచ్చేవరకు టాయిలెట్స్‌కి వెళ్లరు. ఎందుకంటే దారిలో వాష్ రూమ్ వినియోగించుకునే పరిస్థితి లేకపోవడం, వాష్ రూమ్స్ ఉన్నా.. అవి వినియోగించుకునేందుకు అనువుగా లేకపోవడం వల్ల వెళ్లలేరు. దీనివల్ల వారు బయటకు వెళ్లినప్పుడు నీటిని ఎక్కువగా తాగరు. దీనివల్ల డీహైడ్రేషన్‌కి కూడా గురవుతారు. ఇలా యూరిన్‌ని కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా యూరిన్ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి.
తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
సరైన వసతుల్లేని వాష్ రూమ్స్ వినియోగించుకోవడం వల్ల యూరిన్ సమస్యలు వస్తాయి అనుకుంటారు కానీ.. యూరిన్‌ని కంట్రోల్ చేసేకోవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు.. యూరిన్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అలా అని వసతుల్లేని ప్రదేశాలకు వెళ్తే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తే యోని నుంచి పొత్తికడుపులోకి నొప్పి వస్తుంది. ఈ పెయిన్ మీరు యూరిన్‌కి వెళ్లినప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు తరచూ వాష్‌రూమ్‌కి వెళ్లాలనే భ్రమని కలిగిస్తుంది. ఒకవేళ బ్లాడర్ నిండిందని వెళ్లినా.. యూరిన్ రాదు.
పీరియడ్స్ సమయంలో నరకమే..
మరికొందరు జర్నీలో వాష్‌రూమ్‌కి వెళ్లే సౌలభ్యం లేక.. అలాగే ఉండిపోతారు. దీనివల్ల కాళ్లలో నీరు చేరుకుంటుంది. కాళ్లు ఉబ్బిపోతాయి. ఇదే తీవ్రమైతే.. తలనొప్పి సమస్య వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. ఈ సమస్య పీరియడ్స్‌లో ఉన్నవారికైతే నరకమే. పీరియడ్స్ లేని సమయంలో కాస్త అనువుగా ఎక్కడ కనిపించినా వెళ్లొచ్చు కానీ.. బ్లీడింగ్ సమయంలో ఎటూ వెళ్లలేని స్థితి ఏర్పడుతుంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం పెరుగుతుంది.
ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా..
ఈ పరిస్థితులను గుర్తించుకుని ప్రభుత్వం వాష్ రూమ్స్ ఏర్పాటు చేసినా.. వాటి శుభ్రత ఏమేరకు ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే మహిళలు మాత్రం ఇలా యూరిన్‌ను కంట్రోల్ చేసుకుంటే అవి ఆరోగ్యంపై చాలా పెద్ద ఇంపాక్ట్‌ని చూపిస్తాయి. కాబట్టి వీలైనంత త్వరగా యూరిన్‌కి వెళ్లేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రస్తుతమే కాకుండా.. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు.
Also Read : డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్‌కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట