Test to be Done to Detect Drugs : ప్రసుత్తం ఎక్కడ విన్నా.. డ్రగ్స్ టెస్ట్, బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) ఇవే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి పార్టీల్లో పాల్గొన్నవారికి డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తారు? ఈ టెస్ట్​ల కోసం ఏయే నమూనాలు తీసుకుంటారు? వివిధ కారణాలతో వివిధ వృత్తులలో కూడా ఈ డ్రగ్స్ టెస్ట్​లు చేస్తారని మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ టెస్ట్ ఎలా చేస్తారో.. ఎలా నిర్ధారిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 


డ్రగ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే..


వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ మందులను దుర్వినియోగం చేయడం నుంచి.. మాదక ద్రవ్యాలు మోతాదుకు మించి వినియోగిస్తున్నారనే సమాచారం అందితే.. ఈ డ్రగ్ టెస్ట్​లు నిర్వహిస్తారు. దానిలో భాగంగా.. బాధితులనుంచి.. మూత్రం, ఉమ్మి, వెంట్రుకలు లేదా చెమట వంటి వాటిని నమూనాలుగా సేకరిస్తారు. ఎంజాయ్ చేయడం కోసం, విశ్రాంతి కోసం, కొన్ని ఆలోచనలనుంచి బ్రేక్ కావాలని, కొన్ని పర్​ఫార్మెన్స్​లు బాగా చేయాలనే దురుద్దేశాలతో కొందరు కొకైన్, క్లబ్ డ్రగ్స్​ను చట్టవిరుద్ధంగా తీసుకుంటారు. వైద్యులు ఇచ్చే మందులను కూడా అవసరానికి మించి తీసుకుని.. వేరే ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. ఇలా చట్ట విరుద్ధంగా డ్రగ్స్​ను మోతాదుకు మించి తీసుకునేవారికి ఈ టెస్ట్​లు చేస్తారు. 


యూరిన్ టెస్ట్​దే అసలు పాత్ర


ఆల్కహాల్, కొకైన్, గంజాయి, స్టెరాయిడ్స్ వంటి మొదలైన మత్తు పదార్థాలు తీసుకోవడం చట్టరీత్యా విరుద్ధంగా చెప్తారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ లేదా డ్రగ్స్ తీసుకునే ప్రాంతాల్లో దొరికితే వారికి ముందుగా మూత్ర పరీక్ష(Urine Tests)లు చేస్తారు. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ కంటే.. డ్రగ్స్ ట్రేసస్ కోసం.. మూత్ర పరీక్షనే బెస్ట్​గా చెప్తారు.ఎందుకంటే ఇది నాన్వాసివ్, ఎన్ని రోజులు, ఎన్ని ఔషదాలను తీసుకున్నారో గుర్తించగలదు. అంటే డ్రగ్స్ ఎన్నో గంటలు, రోజుల ముందు తీసుకున్నా.. దానిలో డ్రగ్స్ సంకేతాలు కనుగొనవచ్చని చెప్తున్నారు నిపుణులు. 


బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయరంటే..


డ్రగ్స్ టెస్ట్​లో రక్త పరీక్షను రేర్​గా చేస్తారు. ఎందుకంటే ఇది హానికరం. పైగా ఉపయోగించిన తర్వాత కొన్ని గంటల వరకు మాత్రమే మందులను గుర్తిస్తుంది. హెయిర్ టెస్టింగ్ ఇప్పుడు అంతగా అందుబాటులో లేదు. కానీ కొన్ని డ్రగ్స్​ను 100 రోజులలో ఉపయోగిస్తే ఈ టెస్ట్​లో గుర్తించవచ్చు. 


డ్రగ్స్ టెస్ట్ ఫలితాలు ఇలా ఉంటాయి


ఈ డ్రగ్స్ టెస్ట్​ల్లో మీరు ఏ రకమైన డ్రగ్స్ తీసుకున్నారు. ఎంత మోతాదులో తీసుకున్నారు. ఎంతకాలంగా తీసుకున్నారు. డ్రగ్స్ మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి వంటి విషయాలన్నీ దీనిలో వచ్చేస్తాయి. డ్రగ్స్ స్క్రీన్, డ్రగ్ టెస్ట్, డ్రగ్ దుర్వినియోగ పరీక్ష, టాక్సికాలజీ స్క్రీన్, టాక్స్ స్క్రీన్, స్పోర్ట్స్ డోపింగ్ టెస్ట్​లు కూడా ఇవే ఫలితాలను ఇస్తాయి. 


ఏయే సందర్భాల్లో టెస్ట్​లు చేస్తారంటే..


కొన్నిరకాల జాబ్స్​కు వారు ఎలిజిబుల్​ లేదా తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేస్తారు. పనిలో ప్రమాదం జరిగితే.. డ్రగ్స్, ఆల్కహాల్ ప్రమేయం ఏమైనా ఉందో లేదో తెలుసుకోవడానికి నిర్వహిస్తారు. పైలెట్లు, వాహనాలు నడిపేవారు, బోటింగ్ దగ్గర చేసేవారు ఇలా వివిధ ఉద్యోగులకు ఈ టెస్ట్​లు చేస్తారు. అథ్లెట్లు కండరాల బలం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. వాటి పనితీరును మెరుగుపరిచేందుకు వీటిని వినియోగించడం చట్టరీత్యా నేరం. 


డ్రగ్స్ వాడుతూ పట్టుబడినా.. పార్టీలలో వినియోగించినా.. పలు రైడ్స్ చేసినప్పుడు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయంలో చట్టపరమైన సాక్ష్యం కోసం దీనిని చేస్తారు. ప్రమాద విచారణలో భాగంగా కూడా చేస్తారు. ఈ టెస్ట్ చేయడానికి ముందుగా హెచ్చరికలు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో నోటిసు లేకుండా కూడా టెస్ట్​లు చేస్తారు. ఏ ప్లేస్​లో అయినా టెస్ట్​కోసం సాంపిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. 


తప్పు ఫలితాలు కూడా వస్తాయట


డ్రగ్స్ టెస్ట్​లు ఖచ్చితమైనవి కావని.. కొన్నిసార్లు తప్పు ఫలితాలను ఇస్తాయని చెప్తున్నారు. కొన్నిసార్లు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నా.. ఫలితాల్లో అవి కనిపించకపోవచ్చని కూడా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో బాధితులు దొరికిపోకుండా ఉండేందుకు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా కరెక్ట్ ఫలితాలు రాకపోవచ్చు. 


Also Read : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా?  పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే