ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారు. మనిషి జీవితంలో ‘సంతోషం’ (హ్యాపీనెస్) విలువను తెలుసుకోవడం, దాని పట్ల అవగాహన కల్పించడం ఈ రోజు ఉద్దేశ్యం. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 12 జూలై 2012న ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మార్చి 20న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ గా ప్రకటించింది. 2013లో, ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాలు మొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ని జరుపుకున్నాయి.


2013 నుంచి, ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సంతోషం (హ్యాపీనెస్) ప్రాముఖ్యతను గుర్తించే మార్గంగా 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్' జరపాలని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలు, ప్రభుత్వ విధాన లక్ష్యాలలో వారి గుర్తింపు ప్రాముఖ్యత, స్థిరమైన అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సంతోషం (హ్యాపీనెస్), శ్రేయస్సును ప్రోత్సహించే ఆర్థిక వృద్ధికి మరింత సమగ్రమైన, సమానమైన, సమతుల్య విధానం అవసరాన్ని కూడా గుర్తించటానికి ఈ రోజును ఏర్పాటు చేసారు. 2015లో, యునైటెడ్ నేషన్స్ 17 స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ప్రారంభించింది. ఇది పేదరికాన్ని అంతం చేయడానికి, అసమానతలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది .


జూలై 2012లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 20ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ గా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్‌ను 'బి మైండ్‌ఫుల్, బి గ్రేట్‌ఫుల్, బి కైండ్' అనే థీమ్‌తో సెలబ్రేట్ చేయనున్నారు.


ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఎలా జరుపుకోవాలి?


1. ప్రకృతిలో నడవండి


పార్క్ లేదా ఏదైనా ఫారెస్ట్లో నడక కోసం వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచ సౌందర్యాన్ని మెచ్చుకుంటూ, ప్రశాంతతను పొందటానికి మీకు మీరు కొంత సమయం కేటాయించుకోండి .


2. ఉత్తేజపరిచే మ్యూజిక్ వినండి 


మీకు ఇష్టమైన అనుభూతిని కలిగించే పాటల ప్లే లిస్ట్ తయారుచేసుకొని ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా వాటిని వినండి. మీ ఉత్సాహాన్ని పెంచడానికి, కొంత ఆనందాన్ని పంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం.


3. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి


స్థానిక స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్ గా చేయండి లేదా చుట్టు పక్కన ఉన్న వృద్ధులకు సహాయం చేయండి. ఇతరుల కోసం ఏదైనా మంచి చేయడం.. ఆనందాన్ని పంచడంతో పాటు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో సహాయపడుతుంది.


4. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపండి


మీ కుటుంబాన్ని, స్నేహితులను ఒకచోట చేర్చుకోండి. కొంత క్వాలిటీ టైం కలిసి గడపండి. వారి ప్రసెన్స్ ని ఆస్వాదించండి, కబుర్లు పంచుకోండి. జీవితకాలం నిలిచిపోయే జ్ఞాపకాలను మూటగట్టుకోండి. 


5. సరదాగా ఏదైనా చేయండి


మీ ఫ్రెండ్స్ తో గేమ్ నైట్ లేదా మూవీ నైట్‌ని ప్లాన్ చేయండి, ఐస్ క్రీం కోసం బయటకు వెళ్లండి లేదా సరదాగా డే ట్రిప్ చేయండి.


Also Read : వేసవిలో మూత్రం రంగు పసుపుగా ఉంటుందా? ఇది ఆ సమస్యకు సంకేతమట