మహిళలు గర్భం దాల్చాలంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. అందులో గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. కానీ ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరికి గర్భాశయంలో కణితుల సమస్య వేధిస్తోంది. ఈ కణితులు గర్భం ధరించకుండా అడ్డుకోవడమే కాదు ఇంకా ఎన్నో సమస్యలకు కారణం అవుతోంది. నిజానికి గడ్డలు పెరగడం మొదలైన వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. వాటి పరిమాణం పెరిగాకే లక్షణాలు బయటపడుతుంటాయి. పీరియడ్స్ సమయంలో అధిక రుతుస్రావం కావడం, పొత్తి కడుపులోనొప్పి రావడం, పీరియడ్స్ క్రమం తప్పడం వంటివి జరుగుతాయి. లైంగిక చర్యను కూడా ఆస్వాదించలేరు. విపరీతంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొందరిలో నడుము నొప్పి కూడా వస్తుంది. అయితే కణితులు వల్ల కలిగే అతి పెద్ద సమస్య అబార్షన్ కావడం. కొందరు కణితులున్నా కూడా గర్భం ధరిస్తారు. కానీ గర్భం నిలబడదు. కొందరిలో అసలే గర్భం దాల్చడమే చాలా కష్టమైపోతుంది. 


ఇవి ఎందుకు ఏర్పడతాయి?
దీనికి సరైన కారణం ఇప్పటికీ తెలియదు. వంశపారంపర్యంగా ఇవి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ కారణంగా కూడా ఇవి ఏర్పడతాని చెబుతున్నారు వైద్యులు. ఊబకాయం ఉన్న వారిలోను గడ్డలు త్వరగా ఏర్పడతాయి. కాబట్టి ఇవి ఎవరిలో, ఎందుకు వస్తాయో చెప్పడం కష్టం కాబట్టి, ముందస్తుగా అడ్డుకోవడం కూడా కష్టమే. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా వీటిని కొంతవరకు నిరోధించవచ్చు. ఎక్కువగా  ఈ గడ్డలు గర్బం ధరించని వారిలో కనిపిస్తుంటాయి.


ఎంత పరిమాణంలో ఉంటాయి?
వీటి సైజు మనిషి మనిషికి మారిపోతుంది. వేరు శెనగ గింజల పరిమాణం నుంచి పుచ్చ కాయ సైజు వరకు పెరగవచ్చు. కణితిని చిన్న పరిమాణంలో గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య పెరగదు. గర్భాశయంలో ఈ కణితులు ఎక్కడ ఏర్పడ్డాయన్న అంశం పై కూడా చికిత్స, తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా ఇవి గర్భాశయ గోడల మధ్య కనిపిస్తుంటాయి. 


చికిత్స ఎలా?
గడ్డల సైజుని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. చిన్నగా ఉంటే మందుల ద్వారా వాటి పరిమాణాన్ని తగ్గిస్తారు. పెద్దగా ఉంటే మాత్రం తొలగిస్తారు. హార్మోన్లను నియంత్రించే మందులను సూచించడం చికిత్స సాగుతుంది. కొందరిలో కణితిని తొలగిస్తారు.అధిక రక్త స్రావం జరిగే వారిలో మాత్రం గర్భాశయాన్నే తొలగిస్తారు. 


Also read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది


Also read: హలీమ్ హైదరాబాద్ చేరింది ఆ దేశ సైనికుల వల్లే, దాని అసలు పేరు ఇదే