WHO Prequalifies new Dengue Vaccine : దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో డెంగ్యూ జ్వరం ఒకటి. ఇది ప్రాణాంతకమైనదనే చెప్పవచ్చు. ఎందుకంటే డెంగ్యూ వైరస్ రెండోసారి సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అది ప్రాణాలను హరిస్తుంది. అధిక జ్వరం, దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పుల వంటి లక్షణాలు డెంగ్యూలో ఎక్కువగా కనిపిస్తాయి. తీవ్రమైన కేసుల్లో రక్తస్రావం, షాక్‌కు దారితీస్తాయి. ఈ లక్షణాలు ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఈ డెంగ్యూ సమస్యను అరికట్టేందుకు పరిశోధకులు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ స్టడీలు ప్రస్తుతం ఆశించిన ఫలితాలనే ఇస్తున్నాయి.
ప్రీక్వాలిఫై చేసిన WHO
డెంగ్యూ అనేది దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. మనుషుల నుంచి వ్యాప్తి చెందదు. కాబట్టి దోమల నివారణలు చేయాలి. అయితే ఇదే కాకుండా డెంగ్యూ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు పరిశోధకులు. తాజాగా ఈ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రీక్వాలిఫై చేసింది. డెంగ్యూ వ్యాక్సిన్లకు ప్రీక్వాలిఫికేషన్ అనేది ముఖ్యమైన దశ. తాజాగా TAK-003 వ్యాక్సిన్‌ను.. WHO ప్రిక్వాలిఫై చేసింది. WHO నుంచి ప్రీక్వాలిఫై అయిన రెండో డెంగ్యూ వ్యాక్సిన్ ఇది. ఈ వ్యాక్సిన్ డెంగ్యూకి కారణమయ్యే వైరస్‌ను బలహీనపరుస్తుంది.
పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చా?
డెంగ్యూ ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి, ప్రసార తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 6 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు TAK-003ని ఉపయోగించవచ్చని WHO సిఫార్సు చేసింది. వ్యాక్సిన్‌ను 2 డోస్‌లుగా ఇవ్వాలని.. మొదటి వ్యాక్సిన్‌కు, రెండో వ్యాక్సిన్‌కు 3 నెలల విరామంతో నిర్వహించాలని కూడా తెలిపింది. తాజాగా TAK-003 ప్రిక్వాలిఫై అయింది. కాబట్టి ఇది ఇప్పుడు UNICEF, PAHOతో సహా UN ఏజెన్సీల సేకరణకు అర్హత పొందిందని WHO రెగ్యూలేషన్, ప్రీక్వాలిఫికేషన్ డైరక్టర్ డాక్టర్ రోజెరియో గాస్పర్ తెలిపారు.
మరో వ్యాక్సిన్ ఏంటి అంటే..
ఇప్పటివరకు రెండు డెంగ్యూ వ్యాక్సిన్లు ప్రీక్లాలిఫికేషన్కు అర్హత సాధించాయి. అయితే మరిన్ని వ్యాక్సిన్లు డెవలెప్ చేసేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. అప్పుడే డెంగ్యూ టీకాలు అవసరమైన అన్ని వర్గాలకు సమృద్ధిగా అందించగలుగుతారు. TAK-003 కాకుండా CYD-TDV అనే వ్యాక్సిన్ ముందే WHO నుంచి ప్రీక్వాలిఫై అయింది. దీనిని సనోఫి పాశ్చర్ అభివృద్ధి చేసింది.
వ్యాప్తిని అరికట్టే చర్యలు ఇవే
ప్రపంచవ్యాప్తంగా ఏటా 100 నుంచి 400 మిలియన్లకు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని తాజా అధ్యయనం తెలిపింది. మరణాలు కూడా అధిక మొత్తంలోనే జరుగుతున్నాయని వెల్లడించింది. అందుకే డెంగ్యూ సంబంధిత దేశాల్లో వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు కూడా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ డెంగ్యూ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై అవగాహన కలిపిస్తున్నారు.
Also Read : లేట్ నైట్ పడుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అర్థరాత్రి దాటాక నిద్రపోతే అర్థాయుష్షు తప్పదట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.