ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవాలంటే చాలా కష్టం. నోటికి అసలు రుచించవు. ఏదైనా వంటకానికి రుచి రావాలంటే ఖచ్చితంగా ఉప్పు పడాల్సిందే. అందుకే ఉప్పు లేని వంటకంలో ఎన్ని మసాలాలు వేసిన ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరూ అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇది ఖనిజాలను సమతుల్యం చేసి ఎలక్ట్రోలైట్స్ నిర్మించడంలో సహాయపడుతుంది. అయితే కొందరు ఉప్పుని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఉప్పు అంటే తెల్లగా ఉంటుందనే అనుకుంటారు చాలా మంది. కానీ పింక్ సాల్ట్ కూడా ఉంటుంది. ఇది తెలుపు రంగులో ఉండే ఉప్పు కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.


తెలుగు, గులాబీ రంగులో ఉండే ఉప్పు రెండింటిలోనూ సోడియం లవణాలు ఉంటాయి. ఈ రెండింటిని టేబుల్ సాల్ట్ అనే పిలుస్తారు. అయితే హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చే ఈ పింక్ సాల్ట్ లో అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, సోడియం, ఇనుము, మెగ్నీషియం, మాలిబ్డినం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. అందుకే ఈ గులాబీ రంగు ఉప్పు చాలా మంచిది. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న ఈ ఉప్పు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


పింక్ సాల్ట్ వల్ల ప్రయోజనాలు


❂ శ్వాస క్రియని మెరుగుపరుస్తుంది. ఊపిరితీత్తులని బలోపేతం చేస్తుంది.


❂ శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది.


❂ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.


❂ నిద్రలేమి సమస్య నుంచి బయట పడేస్తుంది.


❂ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.


❂ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహకరిస్తుంది.


హిమాలయాల నుంచి వచ్చే ఈ గులాబీ రంగు ఉప్పు తక్కువ శుద్ధి చెయ్యబడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉప్పు పింక్ కలర్ లో కనిపిస్తుంది.


తెలుపు రంగు ఉప్పు వల్ల లాభాలు


శరీరంలోకి చేరాక ఉప్పు సోడియం, క్లోరైడ్ అయాన్లుగా విడిపోతుంది. కండరాలను సంకోచించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తుంది. శరీరంలో నీరు, ఖనిజాల సరైన సమతుల్యతను కాపాడటానికి సోడియం అవసరం. ముఖ్యమైన విధుల కోసం ప్రతిరోజు మనకు 500Mg సోడియం అవసరం అని అంచనా. 


తెలుపు రంగు ఉప్పు అయోడైజ్ చేయబడింది. ఇది గోయిటర్, థైరాయిడ్‌కు కారణమయ్యే అయోడిన్ లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు టేబుల్ సాల్ట్ ప్రాసెస్ చేయడం వల్ల శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని చెప్తుంటారు. ఉప్పు కోసం సముద్రపు నీటిని సేకరించిన తర్వాత దాన్ని శుభ్రపరిచే, ప్రాసెస్ చేసే వివిధ ప్రక్రియల కారణంగా అది ఎన్నో పోషకాలను పోగొట్టుకుంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సిఫార్సు చేస్తారు.


బరువు తగ్గేందుకు రెండింటిలో ఏది మంచిది?


పింక్ సాల్ట్ సహాజమైనది, పోషకాలతో నిండి ఉంటుంది. పోషణను సమతుల్యం చేసేందుకు ఇది సహాయపడుతుంది. అయినా కూడా తెలుపు, గులాబీ రంగు ఉప్పు లవణాలు రెండు ఒకే మొత్తంలో సోడియం కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే పొట్ట ఉబ్బరం, శరీరంలో నీరు తగ్గిపోవడం వంటి సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గడం విషయానికి వస్తే రెండు రకాల ఉప్పులు పూర్తిగా వదిలెయ్యడమే మంచిది. వీటిలో ఏదైనా మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి


Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి