కరోనా వచ్చాక ఇంట్లోనే కేకులు చేసుకోవడం పెరిగిపోయింది. అప్పట్లో లాక్‌డౌన్ సమయంలో షాపులు మూసేయడంతో కేకులు తయారుచేయడం చాలా మంది నేర్చుకున్నారు. ఇప్పటికీ పుట్టినరోజులకు ఇంట్లో కేకు తయారుచేస్తున్నవారు ఎంతోమంది. కానీ కేకుపైన వేసే తెల్లటి క్రీమ్ ను మాత్రం బయట కొనుక్కునే డిజైన్లు వేస్తారు. కానీ ఆ తెల్లటి క్రీమ్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా మంది దీన్ని గుడ్లు కూడా వేసి తయారు చేస్తారు. అవి లేకుండా కూడా క్రీమ్‌ను తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలవెన్న - వంద గ్రాములుకార్న్ ఫ్లోర్ - ఒక టీస్పూనుకాచి చల్లార్చిన పాలు - మూడు స్పూన్లుపంచదార - అరకప్పువెనీలీ ఎసెన్స్ - ఒక స్పూను
తయారీ ఇలా...1. ఒక గిన్నెలో పంచదారను, కార్న్ ఫ్లోర్ వేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. 2. ఒక పెద్ద గిన్నెలో బటర్ వేయాలి. 3. బటర్‌ను బీటర్‌తో అయిదు నిమిషాల పాటూ గిలక్కొట్టుకోవాలి. 4. మిక్సీలో పొడి చేసుకున్న పంచదార మిశ్రమాన్ని కూడా వేసి బీటర్‌తో మళ్లీ గిలక్కొట్టాలి. 5. పంచదార పొడి వేశాక క్రీమ్ తయారవడం మొదలవుతుంది. 6. పాలను పోసి బీటర్ బీట్ చేస్తే క్రీమ్ ఏర్పడడం పెరుగుతుంది. 7. వెనీలా ఎసెన్స్ కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఈ క్రీమ్‌కు కాస్త ఫుడ్ కలర్ కలిపితే నచ్చిన రంగులో క్రీమ్ రెడీ అవుతుంది. కేకులపై రకరకాల డిజైన్లు వేసుకోవచ్చు. చాక్లెట్‌ను కరిగించి కూడా క్రీమ్ లా వాడుకోవచ్చు.
Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి
Also read: వీటిని ఫ్లూ లక్షణాలు అనుకుంటున్నారా, గుండెపోటుకు సంకేతాలు కూడా కావచ్చు