Creamy White Chicken Kadhai Recipe : చికెన్‌తో ఎప్పుడూ ఒకే రకమైన కూరలు చేస్తున్నారా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, క్రీమీగా ఉండే వైట్ చికెన్ కడాయి ట్రై చేయండి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్, చీజ్‌తో తయారు చేసుకునే ఈ వంటకం.. మసాలాల ఘాటుతో పాటు మీకు మంచి రుచిని అందిస్తుంది. మరి రెస్టారెంట్ స్టైల్‌లో ఈ వైట్ చికెన్ కడాయిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

వైట్ చికెన్ కడాయికి కావాల్సిన పదార్థాలు

చికెన్‌ - అరకేజీ 500 

నెయ్యి - 1 టేబుల్ స్పూన్

Continues below advertisement

జీలకర్ర - 1 టీస్పూన్

లవంగాలు - 5

యాలకులు - 4

ఉల్లిపాయలు - 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

Also Read : బయట క్రిస్పీగా.. లోపల జ్యూసీగా ఉండే హైదరాబాద్ చికెన్ 65.. రెసిపీ ఇదే

ఉప్పు - 1 రుచికి సరిపడా

ధనియాల పొడి - 1 టీస్పూన్

జీలకర్ర పొడి - 1 టీస్పూన్

మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్

పెరుగు - 1 కప్పు

ఫ్రెష్ క్రీమ్ - 3 టేబుల్ స్పూన్లు

మొజారెల్లా చీజ్ - 2 చీజ్ స్లైసులు

సన్నగా తరిగిన అల్లం - 5 గ్రాములు

పచ్చిమిర్చి - 1

కొత్తిమీర - గుప్పెడు

Also Read : సండే స్పెషల్ స్పైసీ, టేస్టీ చికెన్ రోస్ట్.. ఒక్కసారి ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, బ్యాచిలర్స్ కూడా ఈజాగా ట్రై చేసుకోవచ్చు

వైట్ చికెన్ కడాయి తయారీ విధానం

ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టి.. మీడియం మంట మీద ఉంచి.. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు వేసి సుమారు నిమిషం పాటు వేయించాలి. మసాలాల నుంచి మంచి సువాసన వచ్చే వరకు వేయిస్తే కూరకు రుచి పెరుగుతుంది. ఇప్పుడు రెండు ఉల్లిపాయలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను కడాయిలో వేసి సుమారు మూడు నిమిషాల పాటు వేయించాలి. ఉల్లిపాయ వాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది.

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు కడాయిలో అరకిలో చికెన్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. సుమారు ఐదు నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

Also Read : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే

చికెన్‌లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేయాలి. తర్వాత పెరుగు వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి. కడాయిపై మూత పెట్టి మంటను తగ్గించాలి. చిన్న మంటపై సుమారు 15 నిమిషాలు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. తర్వాత మూత తీసి కూరను బాగా కలపాలి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, మొజారెల్లా చీజ్ వేయాలి. 

చీజ్ స్లైసులు ఉపయోగిస్తున్నట్లయితే వాటిని చిన్న ముక్కలుగా చేసి వేయవచ్చు. మరో ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికిస్తూ కలపాలి. ఇలా చేస్తే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. ఒకటి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. వేడివేడి క్రీమీ వైట్ చికెన్ కడాయి సిద్ధం.

ఈ క్రీమీ చికెన్ కూరను రోటీ, నాన్, చపాతీ లేదా జీరా రైస్‌తో తింటే రుచిగా ఉంటుంది. కూరలో పెరుగు, క్రీమ్, చీజ్ ఉండటంతో గ్రేవీ చిక్కగా, మృదువుగా ఉంటుంది. రెగ్యులర్ చికెన్కి బ్రేక్ ఇవ్వాలనుకుంటే దీనిని హ్యాపీగా ట్రై చేయవచ్చు. 

Also Read : నేపాలీ స్టైల్ చికెన్ చుకౌనీ.. అరగంటలోపు టేస్టీగా, హెల్తీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే