Mothers Day in India 2024 Date and History : తల్లిని గౌరవించడానికి ప్రత్యేకమైన రోజంటూ లేదు. ఏ రోజైనా అమ్మని పూజించవచ్చు. అయితే వారిపట్ల తమ గౌరవాన్ని, ఇష్టాన్ని, ప్రేమను తెలిపేందుకు ప్రతి సంవత్సరం మదర్స్ డే జరుపుకుంటారు. ప్రత్యేకమైన రోజులకు ఓ తేది అంటూ ఉంటుంది. కానీ మదర్స్ డే ప్రత్యేకమైన రోజు అంటూ ఏమి ఉండదు. మరి దీనిని ఏ రోజు చేసుకుంటారు? ఎప్పటినుంచి మదర్స్ డేని నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఏదైనా చరిత్ర ఉందా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


2024లో మదర్స్ డే ఎప్పుడంటే


ప్రపంచవ్యాప్తంగా మేలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం మదర్స్ డేని మే 12వ తేదీన జరుపుకుంటున్నాము. 1908వ సంవత్సరంలో దీనిని మొదటిసారిగా అమెరికాలో నిర్వహించారు. యూఎస్​ఏకి చెందిన అన్నా జార్విస్ తన తల్లిని సేవను గౌరవించేందుకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని గురించి పెద్ద సంఖ్యలో పాపులారిటీ రావడంతో.. ప్రతి ఒక్కరూ అమ్మ కష్టాలను గుర్తించి.. వారిని గౌరవించే రోజుగా చేసుకోవానుకున్నారు. అనంతరం 1914లో ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ అధికారికంగా మే నెలలో రెండవ ఆదివారాన్ని మదర్స్​ డేగా ప్రకటించారు. తర్వాత కాలంలో ఇతర దేశాలు దీనిని స్వీకరించాయి. 


పర్లేదు ఓ రోజుని స్పెషల్​గా చేసుకోవచ్చు..


ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరున్నా.. లేకపోయినా అమ్మ ప్రధానపాత్ర పోషిస్తుంది. జీవితంలోని ప్రతి మజిలీలో ఆమె చూపించినా ప్రేమ కానీ.. ఆమె లేని లోటు కానీ కళ్లకు కనపడతుంది. అలాంటి అమ్మ ప్రేమను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి ఓ రోజు సరిపోదు. కానీ అన్ని రోజులు ప్రేమను చూపించడం అసాధ్యం. దానికి వివిధ కారణాలు ఉంటాయి. వివిధ సందర్భాల్లో అమ్మపై మన ఇష్టాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాము. కానీ.. మదర్స్ డే రోజు.. అమ్మకి మరిచిపోలేని రోజుగా మార్చేందుకు మదర్స్ డే హెల్ప్ అవుతుంది. ఆ సమయంలో అమ్మకు మీరు హృదయపూర్వకంగా విషెష్ చెప్పవచ్చు. గిఫ్ట్​లు ఇవ్వవచ్చు. అమ్మకి ప్రేమగా ఓ ముద్దు ఇచ్చి.. విషెష్ చెప్పినా ఆమె ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి కచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలనే రూల్ లేదు. 


ఇతరులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు..


ఓ కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లడంలో అమ్మ ముఖ్యపాత్ర పోషిస్తుంది. నవ మాసాలు మోసి.. పురిటినెప్పులు భరించి.. ఒకరికి జన్మనిస్తుంది. తాను తిన్నా.. తినకపోయినా పిల్లలు ఆకలి తీర్చాలని ఆరాటపడుతుంది. తెలియకుండానే ప్రతి ఒక్కరి జీవితాలపై వారి అమ్మ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఎవరి దగ్గరి నుంచి ఏమి ఆశించకుండా.. నిస్వార్థంగా తమ జీవితాన్ని త్యాగం చేసే అమ్మకంటూ ఓ స్పెషల్ డే ఇవ్వడంలో ఎలాంటి తప్పేమి లేదు. కొందరు అమ్మని రోజు ప్రేమిస్తాము. కేవలం మదర్స్ డే రోజు మాత్రమే అమ్మని చూసుకునే రకాలు కాదు అంటారు. కానీ రోజు అమ్మని స్పెషల్​గా ఫీల్​ అయ్యేలా చేయలేరుగా. మీరు ఎప్పుడైతే స్పెషల్​గా అమ్మపై ప్రేమను, అభిమానాన్ని చూపిస్తారో.. అదే మదర్స్ డే అనుకోవాలి. అంతే కానీ ఇతరులు చేసుకుంటే తప్పు అనుకోకూడదు. 



మదర్స్ డే ఎలా చేసుకోవచ్చంటే..


మదర్స్ డే రోజు మీ అమ్మగారికి తీరని కోరికలు.. లేదా ఆమె ఇష్టాలు తెలుసుకుని వారి విష్​లు తీర్చవచ్చు. లేదంటే అమ్మతో కలిసి డేట్​కి వెళ్లొచ్చు. అమ్మలకు పిల్లలు ఏమి తీసుకున్నా అది ఎక్కువ పెట్టేశారు అనుకుంటారు కాబట్టి మంచిగా వారినే షాపింగ్​కి తీసుకెళ్లి.. నచ్చినవి.. నచ్చినరేట్లలో కొని ఇవ్వొచ్చు. అమ్మలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావాలు చూపించారో వారికి లెటర్ రూపంలో రాసి ఇవ్వొచ్చు. ఆమె ఫ్రెండ్స్​ని మీట్ చేయొచ్చు. గ్రీటింగ్, ట్రిప్స్, గిఫ్ట్ వంటివి ప్లాన్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మదర్స్ డేకి మీరు కూడా మదర్స్ డేని సెలబ్రేట్ చేసి.. దానిని వారికి స్పెషల్​గా మార్చేయండి.  


Also Read : ఇదేందయ్యా ఇది.. గొంతు నొప్పితో కోమాలోకి వెళ్లిపోవడమేంటి? అసలు ఏమి జరిగింది