నకు #RRR గురించి తెలుసు. కానీ.. కొత్తగా #NNN ఎక్కడ నుంచి వచ్చిందనేగా మీ సందేహం? మీరు అనుకున్నట్లు ఇది సినిమా మాత్రం కాదు. ఇదో పురుషోద్యమం. చెప్పాలంటే ఇదో సరికొత్త దీక్ష. నవంబరు నెల మొదలైందంటే చాలు.. పురుషులంతా శృంగారానికి బైబై చెప్పేస్తారు. కనీసం స్వయంతృప్తి కూడా పొందకూడదు. చివరికి పోర్న్ చూసినా #NNN నిబంధనను అతిక్రమించినట్లే. ఇంతకీ ఏమిటీ NNN అనేగా మీ సందేహం? NNN అంటే నో నట్ నవంబర్ (No Nut November). 


ఛీ.. పాడు ఇదే కల్చర్ అని ముక్కున వేలు వేసుకోవద్దు. ఈ ట్రెండ్ ఇప్పుడు మొదలైనది కాదు. 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషుల్లో కొందరు NNN పేరుతో నవంబరు నెల మొత్తం నిగ్రహంగా ఉంటున్నారు. నవంబరు మొదలైందంటే చాలు.. వీరంతా బుద్ధిమంతులైపోతారు. అశ్లీలత పేరు వింటే చాలు చిర్రెత్తుకొస్తుంది. ఇప్పటి వరకు రెడిట్ సోషల్ మీడియా ద్వారా 90 వేల మంది No Nut November మీద అవగాహన కల్పిస్తున్నారు. 30 రోజులపాటు సంఘీభావం తెలుపుతూ.. మీమ్స్ పోస్ట్ చేస్తారు. నెల మొత్తం శృంగారం, స్వయంతృప్తికి దూరంగా ఉంటారు. 


ఎందుకు చేస్తారు?: సాధారణంగా పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది వాటిని నియంత్రించుకోలేరు. దానివల్ల పోర్న్ వీడియోలు చూడటం, స్వయంగా తృప్తి పొందడం, భాగస్వామితో కోరికలు తీర్చుకోవడంలో బిజీగా ఉంటారు. ఇలాంటి చర్యలకు కనీసం ఒక నెల విరామం తెలిపితే.. ఆరోగ్యానికే కాకుండా మనసుకు కూడా చాలామంచిదని నో నట్స్ నవంబర్ ఫాలోవర్ల భావన. ఈ సందర్భంగా ఈ నెలను ఛాలెంజ్‌గా తీసుకుంటారు. తాము ఎంత వరకు నిగ్రహంగా ఉండగలమనేది పరీక్షించుకుంటారు. సెక్స్ మీద మనసు మరలకుండా ఉండేందుకు ఇతర విషయాల మీద దృష్టిపెడతారు. దీనివల్ల మానసిక స్పష్టత ఏర్పడుతుంది. ఒక వేళ ఈ దీక్షను పాటించడంలో విఫలమైతే.. వారు తమ లైంగిక జీవితాన్ని కొనసాగించవచ్చు.  


NNN నిబంధనల ప్రకారం.. 30 రోజుల వరకు ఎలాంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. కనీసం పోర్న్ చూసిన విఫలమైనట్లే. కేవలం సెక్స్ కలలను కనేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. 2010 నుంచి కొంతమంది పురుషులు దీన్ని నిష్టగా పాటిస్తూ వస్తున్నారు. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల సింగిల్స్ సక్సెస్‌ఫుల్‌గా NNN పాటించారట. అయితే భాగస్వామితో ఇళ్లకే పరిమితమైన పురుషులు మాత్రం దీన్ని పాటించకలేపోయారట. లైంగిక కార్యకలాపాలకు దూరంగా ఉన్నవారిలో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందట. 


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


ఈ ఏడాది నుంచి NNN నిబంధనను కాస్త కఠినం చేశారట. ఈ ఏడాది NNNలో భాగస్వాములయ్యేవారు.. నిబంధనలు ఉల్లంఘిస్తే సముద్ర తీరాన్ని శుభ్రం చేసే పనుల్లో పాల్గొనే టీమ్‌కు కోసం రోజుకు ఒక డాలర్ చొప్పున విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ఉద్యమాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ప్రారంభించారనే వాదన నడుస్తోంది. ఎక్కువ రోజులు సెక్స్‌కు దూరంగా ఉండే పురుషులు, సెక్స్ అంటే ఇష్టం లేని వ్యక్తులు, స్త్రీ ద్వేషులు ఇలా ‘నో నట్స్ నవంబర్’ పేరుతో ఇతరులను పరీక్షించాలని చూస్తున్నారనే పలువురు అంటున్నారు. ఇతరులు నెల రోజులపాటు లైంగిక చర్యల్లో పాల్గోకుండా ఎంత నిగ్రహంగా ఉంటారో చూడాలనే కాన్సెప్ట్‌తోనే దీనికి తెరతీశారని అంటున్నారు. అయితే.. ‘నో నట్స్ నవంబర్‌’లో పాల్గొనేవారి కోసం డిసెంబరు నెలలో ‘డిస్ట్రాయ్ డిసెంబర్’లో పాల్గొనవచ్చని అంటున్నారు. ‘డిస్ట్రాయ్ డిసెంబర్’ అంటే ఏం చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో! అయితే, నవంబరు మొత్తం నిగ్రహంగా ఉంటూ తమని కోరికల నుంచి నియంత్రించుకొనే వ్యక్తులు.. డిసెంబరులో అవకాశం దొరికినా ఆ పని చేస్తారో లేదో అనేది మాత్రం డౌటే. 


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి