No Nut November Health Benefits and Intresting Facts : సంవత్సరంలో ఏ నెల మారినా.. ఇన్​స్టాగ్రామ్​లో కొన్ని రకాల మీమ్స్ వైరల్ అవుతాయి. నెలలు గడిచిపోతున్నాయి కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఇన్ని నెలలు అయిపోయాయా అంటూ మీమ్స్ వేస్తారు. అయితే నవంబర్​లో మాత్రం NNN అనే ఛాలెంజ్​ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాని పూర్తి పేరు No Nut November. అసలు ఈ NNN అంటే ఏంటి? దీనివల్ల అబ్బాయిలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

NNN అర్థమిదే..

నో నట్ నవంబర్ ఛాలెంజ్ తీసుకున్న వాళ్లు నెలంతా హస్తప్రయోగానికి లేదా శృంగార చర్యలకు దూరంగా ఉండాలి. అందుకే దీని గురించి ఎక్కువ మీమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇది ఫన్నీ ఛాలెంజ్​గా మొదలైనా.. ఈ మధ్యకాలంలో దీనిని చాలా మంది సెల్ఫ్ కంట్రోల్ ఛాలెంజ్​గా తీసుకుంటున్నారు. మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

NNN వల్ల కలిగే లాభాలివే (Benefits of NNN) 

NNN ఫాలో అవ్వడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు పొందవచ్చని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల మగవారిలో సెల్ఫ్ డిసిప్లిన్, ఫోకస్, మెంటల్ స్ట్రెంత్ పెరుగుతుందని చెప్తున్నారు. అట్రాక్టివ్​గా ఉండే అంశాలను కంట్రోల్ చేసుకోవడం వల్ల మానసికంగా స్ట్రాంగ్ అవుతారట. దీనివల్ల ఫోకస్, కాన్ఫిడెన్స్ మెరుగవుతాయని చెప్తున్నారు. లైంగికపరమైన కోరికలు తగ్గి.. కెరీర్, ఫిట్​నెస్, గోల్స్​పై దృష్టి పెట్టగలుగుతారట. అందుకే దీనిని డీటాక్స్ ప్రక్రియగా చెప్తారు.

Continues below advertisement

NNN వల్ల శారీరక శక్తి కూడా మెరుగవుతుందట. శరీరంలో వీర్యం ఉండడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెరుగవుతాయని కొందరు భావిస్తారు. నెలరోజులు ఈ విషయాన్ని కంట్రోల్ చేయగలిగినవారు.. ఇతర విషయాల్లో కూడా అంతే డెడికేటెడ్​గా ఉండగలుగుతారని.. సైకాలజిస్టులు చెబుతున్నారు. రిలేషన్​షిప్స్ మెరుగవుతాయట. ఫిజికల్ రిలేషన్ కన్నా.. ఎమోషనల్ బాండింగ్, కమ్యూనికేషన్​ వాల్యూ తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 

NNN తర్వాత DDD 

అయితే దీనిని కొందరు ఫాలో అవుతారు. మరికొందరు ఫాలో అవ్వరు. మరికొందరు కొన్నిరోజుల్లోనే బ్రేక్ చేసేస్తారు. అయితే NNN ఫాలో అయితే.. డిసెంబర్​లో DDD అనే మరో ఫన్నీ బ్రేకింగ్ ఛాలెంజ్ వస్తుంది. ఈ NNN రూల్ ఫాలో అవ్వాలని లేదు. కానీ.. మీరు నిజంగా కొన్ని విషయాల నుంచి డిస్ట్రాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు దీనిని ఛాలెంజ్​గా తీసుకోవచ్చు. నిజంగానే ఇది మీపై మంచి ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.