X (ఎక్స్) అనగానే మనకు ఎలాన్ మస్క్ గుర్తుకొస్తాడు. కానీ, ఆ ఎక్స్‌కు.. ప్రపంచాన్ని భయపెట్టేందుకు సిద్ధమవుతోన్న అంతుచిక్కని వ్యాధి Disease X (డిసీజ్ ఎక్స్) ఎలాంటి సంబంధం లేదు. దీనిపై ఇప్పటికే స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జనవరి 15న వరల్డ్ ఎకనామక్ ఫోరమ్ చర్చించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనిపై త్వరలోనే ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేయనుంది. కోవిడ్-19 వైరస్ కంటే ఈ Disease X.. 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట.
Disease X లక్షణాలు
కోవిడ్ -19, ఎబోలా, జికా వంటి మరో పాండమిక్‌కు కారణమయ్యే సూక్ష్మజీవి Disease X. విస్తృత వ్యాప్తికి ఆస్కారం ఉన్న ఈ సూక్ష్మజీవికి 2018 సంవత్సరంలో Disease X అని 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. ఈ వ్యాధి ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్ని వ్యాధులను అనూహ్యమైందిగా ఉండొచ్చట. ఊహించని విధంగా కొత్త అంటువ్యాధి కారకాలను కలిగి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం సంసిద్ధం కావల్సిన అవసరం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎబోలా, మార్బర్గ్ తరహాలోనే క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనేది తీవ్రమైన వైరల్ హెమరేజిక్ డిసీజ్. ఇది తీవ్రమైన రక్తస్రావం కలిగిస్తుంది. దీని లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. జ్వరం, కండరాల నొప్పి, తల తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పి ఏర్పడతాయి. ఇవి కోవిడ్ లక్షణాలు కంటే దారుణంగా ఉంటాయి. త్వరగా ప్రాణాలు తీసే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.
Disease X ఎలా ఉండబోతోంది?
Disease X అనేది కోవిడ్ -19 కొత్త వేరియెంట్ కూడా కావచ్చని కొందరు మైక్ రోబయాలజిస్టుల అంచనా. మరికొందరు ఇది కోవిడ్‌తో సంబంధం లేకుండా మరో కొత్త రకమైన వైరస్ కావచ్చని కూడా భావిస్తున్నారు. పరిశోధనలో ఇప్పటికీ ఈ అనిశ్చితి కొనసాగుతోంది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రమాదంలో ఉందని, దాన్ని ఎదుర్కునేందుకు ప్రపంచం సిద్ధం కావాలని మాత్రమే సూచిస్తున్నారు.
స్పానిష్ ఫ్లూ తరహాలో ప్రాణాంతకం
1920 నాటి స్పానిష్ ఫ్లూ తరహాలోనే వినాశకరమైన మరో పాండమిక్ పొంచి ఉందని యూకే శాస్త్రవేత్తలు గత ఏడాది హెచ్చరించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 50 మిలియన్ల మందిని పొట్టన పెట్టుకోగలదని అంచనా వేస్తున్నారు. కోవిడ్ -19తో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాలు కేవలం 7 మిలియన్లు మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధి కారకాలు వ్యాపించి ఉన్నాయని, అయితే వీటికి సరిపడినంతగా పరిశోధనా వనరులు అందుబాటులో లేవని కూడా WHO చెబుతోంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడుతున్నారా? జాగ్రత్త, గుండె ఆగుద్ది