బుల్లెట్ ప్రూఫ్ కాఫీ.. సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా దీన్ని తాగుతారు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువట దీనికి. కాఫీ, గ్రాస్ పీడెడ్ బట్టర్, మీడియం చైన్ ట్రైగ్లిజరాయిడ్ (MCT) నూనె లేదా కొబ్బరి నూనె కలిపి చేసే వేచ్చని పానియం. దీనిని బుల్లెట్ ప్రూఫ్ డైట్ రూపొందించిన డేవాస్ప్రే ప్రాచూర్యంలోకి తెచ్చారు. శిల్పాశెట్టి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి చాలా మంది సెలెబ్రిటీలు వారి బ్యాలెన్స్డ్ డైట్ లో భాగంగా ఈ కాఫీ తీసుకుంటున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకున్నపుడు రోజంతా శక్తి స్థిరంగా కొనసాగుతుంది. మానసిక స్పష్టత కూడా కల్పిస్తుంది. ఈ కాఫీతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.


ఎనర్జిటిక్‌గా ఉండొచ్చు


బల్లెట్ ప్రూఫ్ కాఫీలో వెన్న, నూనే, కెఫిన్ కలయిక ఆరోగ్యకరమైంది. ఇది శరీరంలో శక్తిని స్థిరంగా విడుదల చేస్తుంది. తక్కువు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారానికి అనువుగా ఉంటుంది. ఇది ఏకాగ్రత పెంచుతుంది. శరీరంలో అదనపు కొవ్వును సైతం కరిగిస్తుంది.


తృప్తిగా ఉంటుంది


ఆరోగ్యవంతమైన కొవ్వులతో కలిసిన కాఫీ శక్తి వంతమైన పానీయంగా చెప్పుకోవచ్చు. దీనిలోని MCT ఆయిల్ వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది.


కొవ్వు కరిగిస్తుంది


బుల్లెట్ ప్రూఫ్ కాఫీలోని కొబ్బరి నూనె జీవక్రియల రేటును పెంచుతుంది. శరీరంలో కొవ్వుల ఆక్సికరణ పెరుగుతుందనే నమ్మకం. నిలువ ఉన్న కొవ్వులను కూడా ఇది కరిగిస్తుందట. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ శరీరం నుంచి అదనపు కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.


రక్తంలో షుగర్ నియంత్రణ


బుల్లెట్ ప్రూఫ్ కాఫీలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండడం వల్ల కాఫీ శోషణ నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల రక్తంలో అకస్మాత్తుగా షుగర్ స్థాయి పెరగకుండా ఉంటుంది. ఈ కాఫీతో షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. అంతేకాదు ఇన్సులిన్ సెన్సిటివిటి కూడా పెరుగుతుందట. మంచి ఫలితం ఉండాలంటే కాఫీ తయారీలో రిఫైండ్ షుగర్స్ చేర్చకుండా జాగ్రత్త పడడం మంచిది.


కెఫిన్


కెఫిన్ ఆరోగ్యవంతమైన జీవనశైలి లో భాగం. ఈ సమ్మేళనం జీవక్రీయలను వేగవంతం చేస్తుంది. ఇది శరీరంలో కొవ్వు ను వేగంగా కరిగిస్తుంది. స్థిరంగా శక్తి విడుదల కావడానికి, ఏకాగ్రత మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.


కొన్ని ప్రతికూల ఫలితాలు


బల్లెట్ ప్రూఫ్ కాఫీ అధిక క్యాలరీలు కలిగిన పానీయం. కార్బోహైడ్రేట్లు కలిగిన బ్రేక్ ఫాస్ట్ కి ప్రత్యామ్నాయం. ఇందులో పోషకాలు తక్కువ. సంతృప్త కొవ్వులు ఎక్కువ. కనుక కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది రోటీన్ గా మార్చుకునేందుకు అనుకూలం కాదు. ఆహారంలో చేసుకునే కీలక మార్పులకు ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్య స్థితిగతులను అనుసరించి ఈ పానీయం మీకు అనుకూలమా కాదా తెలుసుకుని ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read : Figs for male: మగాళ్లూ, ఇది మీకు తెలుసా? ఆ విషయంలో ఛాంపియన్స్ కావాలంటే అంజీర్ తినాలట!