ఆప్టికల్ ఇల్యూషన్లు సామాజిక మాధ్యమాల్లో చాలా వైరల్‌గా మారుతున్నాయి. అవి కాసేపు మనకు వినోదాన్ని పెంచుతాయి. మెదడుకు పని చెబుతాయి. మెదడు, కళ్ళ సమన్వయాన్ని సవాలు చేస్తాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరించడం వల్ల మెదడు పనితీరు కూడా చాలా మెరుగుపడుతుంది. ఇక్కడ అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఉంది.


ఈ ఫోటోలో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ చూడగానే ఏం గుర్తించారో చెప్పండి. కొంతమంది చేప అని చెబుతారు, మరికొందరు మేఘం అంటారు. మీ కంటికి ఏది మొదట కనిపించిందో చెబితే, దాన్నిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పవచ్చు. ఒకవేళ మీకు మేఘం మొదట కనబడితే... మీరు చాలా బలమైన వ్యక్తిత్వం గల మనుషులు. అయితే బయటకి బలంగా కనిపిస్తున్నా, మీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులు చిన్న చిన్న మాటల ద్వారానే మిమ్మల్ని త్వరగా బాధపెట్టేయగలరు. మీకు భావోద్వేగాలు ఎక్కువ అందుకే, ఆ భావోద్వేగాలకు భయపడి మీరు ఎవరితోనైనా దీర్ఘకాలిక అనుబంధాన్ని పెట్టుకోవడానికి అనుమానిస్తారు.


ఒకవేళ మీకు చేప మొదట కనిపించినట్లయితే... మీకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకునే వ్యక్తిత్వం కలవారు. ఉన్న అవకాశాల్ని వినియోగించుకొని మీకు కావలసిన దాన్ని సాధించుకుంటారు. మీకు కావాల్సిన దాన్ని సాధించడం కోసం మీరు హృదయపూర్వకంగా పని చేస్తారు. జీవితం చాలా చిన్నదని, దాన్ని ఉన్నంత మేరకు ఉపయోగించుకోవాలని అనుకుంటారు.


మీ కళ్ళు చేపలు, మేఘాలు రెండిటినీ గుర్తించినట్లయితే ఏం జరుగుతుందో అని అనుకోవచ్చు. ఒకేసారి రెండింటిని మెదడు, కళ్ళు గుర్తించలేవు. మొదట చేపగాని, మేఘంగానీ... ఏదో ఒకటి మీ మెదడుకు తెలుస్తుంది. 


ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఆసక్తి కలవారు ఆప్టికల్ ఇల్యూషన్లు అధికంగా ఉన్న ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీటిని పరిష్కరించవచ్చు. ఇలాంటివి పరిష్కరించడం వల్ల మెదడుకు కూడా మేతలా ఉంటుంది. మెదడు పదునుగా మారుతుంది. ఆలోచనలు వేగంగా మారుతాయి.


పిల్లలకు, పెద్దలకు కూడా ఈ పజిల్స్ ఎంతో నచ్చుతాయి. ఇవి కళ్లను మాయ చేస్తుంటాయి. పురాతన కాలం నుంచి వీటిని వినోద భరితంగా వినియోగిస్తున్నారు ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చిత్రకారులు ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని రకాల ఫోటోలు కూడా ఆప్టికల్ ఇల్యూషన్లుగా కనిపిస్తుంటాయి. ఇవి ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, రెడ్డిట్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీటి హవా ఎక్కువగానే ఉంటుంది.  కింద ఇచ్చిన ఇన్ స్టా ఖాతాలో ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో ఉన్నాయి. 



Also read: పీరియడ్స్ సమయంలో ఇబ్బంది లేకుండా ఉండాలంటే, ఇలాంటి ఆహారాలు తినండి


Also read: త్వరగా బరువు తగ్గేందుకు వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోపోతే కష్టాలు తప్పవు