HIV Early Signs : లైంగిక వ్యాధుల్లో కొన్ని తీవ్రమైన ఇబ్బందులు కలిగించే వ్యాధులు ఉంటాయి. అలాంటి వాటిలో హెచ్​ఐవీ ఒకటి. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ (HIV) అనేది ఒక వైరస్. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను నెమ్మదిగా బలహీనపరుస్తుంది. దీనివల్ల శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు సులభంగా గురవుతారు. అందుకే హెచ్​ఐవీని సకాలంలో గుర్తించడం, చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీనికి చికిత్స లేకుండా వదిలేస్తే అది AIDS (ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్)గా మారవచ్చు. ఇది ప్రాణాంతకం కావచ్చు.

గాజియాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో మెడిసిన్ అండ్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎ.పి. సింగ్ ప్రకారం.. "HIV ప్రారంభ లక్షణాలు మొదట్లో ఫ్లూలా కనిపిస్తాయి. అందుకే వాటిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. అసురక్షిత లైంగిక సంబంధం కలిగి ఉన్నా.. ఉపయోగించిన సూదిని ఉపయోగించినా లేదా మీరు ఏదో ఒక విధంగా HIV బారిన పడ్డారనిపిస్తే.. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ఆలస్యం చేయకుండా పరీక్ష చేయించుకుని చికిత్స తీసుకోవాలి" అని సూచించారు. 

HIV ప్రారంభ లక్షణాలు

HIV లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉండవచ్చు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన కొన్ని వారాల నుంచి చాలా సంవత్సరాల వరకు ఇవ కనిపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ సోకిన 2-4 వారాల తర్వాత కనిపించే కొన్ని ప్రారంభ లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి.

  • చలి, జ్వరం : HIV ప్రారంభ సంకేతాల్లో చలి జ్వరం ఒకటి. అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది ఫ్లూ లాంటి జ్వరం కావచ్చు. తరచూ వస్తుంది. 
  • అలసట, బలహీనత: తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ.. నిరంతరం చాలా అలసటగా అనిపించడం. శరీరంలో శక్తి లేకపోవడం.
  • వాపు లింఫ్ నోడ్స్: మెడ, చంకలు లేదా గజ్జల్లో గ్రంథులు (లింఫ్ నోడ్స్) వాపుగా అనిపించడం. ఈ గ్రంథులు శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాపు వచ్చేలా చేస్తాయి.
  • చర్మంపై దద్దుర్లు: శరీరంలో ఎరుపు, దురద కలిగించే దద్దుర్లు రావడం జరుగుతుంది. ఇవి సాధారణంగా ఛాతీ, వీపు లేదా ముఖంపై కనిపిస్తాయి.
  • గొంతు నొప్పి, నోటి పుండ్లు: ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా గొంతులో నిరంతరం నొప్పిగా ఉంటుంది. నోటిలో బాధాకరమైన పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి.
  • కీళ్ల నొప్పులు: శరీరంలో కండరాలు, కీళ్ల నొప్పులు వస్తాయి. అవి బిగుసుకుపోయి.. ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటాయి. 
  • రాత్రి చెమటలు: నిద్రపోయేటప్పుడు చాలా చెమటలు పడతాయి. గది చల్లగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.
  • వేగంగా బరువు తగ్గడం: ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా, వేగంగా బరువు తగ్గిపోతారు.

ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి?

ఈ లక్షణాలు మీకు కనిపిస్తే.. మీరు ఎప్పుడైనా, భయపడకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే HIV పరీక్ష చేయించుకోవాలి. మీకు వైరస్ సోకిందో లెదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్సను అంత త్వరగా ప్రారంభించవచ్చు. యాంటిరెట్రోవైరల్ థెరపీ (ART) వంటి మందులు వైరస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. దీనివల్ల వ్యక్తి సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీకు పరీక్షలో వైరస్ సోకిందని గుర్తిస్తే.. మీకు, ఇతరులకు రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. HIV అనేది వ్యాధి కాదు. ఇది సరైన చికిత్సతో కంట్రోల్ అవుతుంది. వైరస్. లక్షణాలు కనిపిస్తే భయపడకుండా, అవగాహన పెంచుకోవాలి. సరైన సమాచారం తెలుసుకోవాలి. ఏదైనా సందేహం ఉంటే, అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.