Weight Loss Meal Plan with Rice : అన్నం తింటే బరువు పెరిగిపోతామని చాలామంది దానిని తినడం మానేస్తారు. కానీ కొందరేమో అన్నం లేకుండా అస్సలు ఉండలేరు. అయితే మీకో విషయం తెలుసా? అన్నాన్ని తీసుకునే విధంగా తీసుకుంటే కూడా బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నాన్ని డైట్​లో తీసుకుంటూ బరువు తగ్గేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వారానికి సరిపడ డైట్​ని ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement


సోమవారం 


మీ ఉదయాన్ని వామ్ము నీరు లేదా సోంపు నీటితో ప్రారంభించండి. బ్రేక్​ఫాస్ట్​లో శనగలతో చేసిన సలాడ్ తినవచ్చు. భోజనానికి ముందు అరటిపండు తినాలి. మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూరగాయలు, సాంబార్, పెరుగు, సలాడ్ తినాలి. స్నాక్స్​ టైమ్​లో మజ్జిగ తాగాలి. డిన్నర్​కి ఉడికించిన చిలగడదుంపతో సలాడ్ చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. 


మంగళవారం


రెండో రోజు కూడా మీరు వామ్ము లేదా సోంపు నీటితో రోజును ప్రారంభించవచ్చు. బ్రేక్​ఫాస్ట్​గా కూరగాయలతో చేసిన ఉప్మా తినాలి. లంచ్​కి ముందు జామపండు తీసుకోవచ్చు. భోజన సమయంలో బీట్​రూట్​ పులావ్, కీరదోసతో చేసిన రైతాను తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్​గా స్ప్రౌట్స్ తినాలి. డిన్నర్​లో దోశను, చట్నీతో తీసుకోవాలి. నిద్రకు ముందు గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. 


బుధవారం


వామ్ము లేదా సోంపు నీటితో రోజును ప్రారంభించాలి. మిల్లెట్​ దోశను సాంబార్​తో, కరివేపాకులతో చేసిన చట్నీతో కలిపి బ్రేక్​ఫాస్ట్ ముగించాలి. లంచ్​కి ముందు స్నాక్స్ టైమ్​లో అరటిపండు తినొచ్చు. భోజనంలో రసం, అన్నం, ఏదైనా కూరగాయలతో చేసిన ఫ్రై తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్​గా బాదంలు తినొచ్చు. రాగిజావను డిన్నర్​గా తీసుకోవచ్చు. పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. 


గురువారం


సోంపు లేదా వామ్ము నీటిని తీసుకోవాలి. మొక్కజొన్నతో చేసిన సలాడ్​ని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవాలి. లంచ్​కి ముందు జామపండు తినొచ్చు. మధ్యాహ్నం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, ఉల్లిపాయ రైతా, పప్పు తినాలి. స్నాక్స్ టైమ్​లో బటర్​ మిల్క్​ తాగాలి. రాత్రి భోజనంలో ఉడికించిన కూరగాయలు, పప్పు కలిపి తీసుకోవాలి. నిద్రకు ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. 


శుక్రవారం


శుక్రవారం కూడా ఉదయాన్ని వామ్ము, సోంపు నీటితో ప్రారంభించాలి. బ్రేక్​ఫాస్ట్​గా ఓట్స్​తో చేసిన స్మూతిని తినొచ్చు. లంచ్​కి ముందు అరటిపండు తినాలి. భోజన సమయంలో అన్నం, సాంబార్, పెరుగు, సలాడ్​తో తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్​గా రాజ్మా తినొచ్చు. డిన్నర్​గా యాపిల్​ మిల్క్​ షేక్​ షుగర్​ లేకుండా తీసుకుని.. పడుకునే ముందు గోరువెచ్చని నీటిని తాగాలి. 


శనివారం 


వామ్ము లేదా సోంపు నీటితో రోజును ప్రారంభించాలి. మిల్లెట్స్​తో చేసిన జావను బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవాలి. లంచ్​కి ముందు జామపండు తీసుకోవచ్చు. లంచ్​కోసం జీరాతో చేసిన రైస్​, పప్పు, పెరుగుతో సలాడ్​ చేసుకుని తినొచ్చు. ఈవెనింగ్ స్నాక్​గా అవిసెగింజలతో చేసిన లడ్డూ తీసుకోవచ్చు. ఉడికించి వేయించిన కూరగాయలను డిన్నర్​కి తినొచ్చు. గోరువెచ్చని నీటితో రోజును ముగించాలి. 


ఆదివారం


వామ్ము లేదా సోంపు నీటితో రోజును ప్రారంభించండి. దోశలను పల్లీ చట్నీతో కలిపి బ్రేక్​ఫాస్ట్​గా తినొచ్చు. లంచ్​కి ముందు అరటిపండు, భోజనంలో వెజిటేబుల్ బిర్యానీ, రైతా తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్​కోసం స్ప్రౌట్స్, రాత్రి భోజనానికి మిల్లెట్ ఉప్మా తినొచ్చు. గోరువెచ్చని నీటితో ముగించాలి. 


మీరు అన్నం తిన్నా సరే.. మీ డైట్​ని ఇలా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రొటీన్​గా వామ్ము లేదా సోంపు వంటి హెర్బల్ డ్రింక్​తో రోజును ప్రారంభించాలి. అలాగే రోజూ గోరువెచ్చని నీటితో ముగించాలి. ఈ డైట్​ని ఫాలో అవుతూ.. తేలికపాటి వ్యాయమాలు చేస్తూ.. టైమ్​కి నిద్రపోతే బెస్ట్ బెనిఫిట్స్ పొందవచ్చు. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.