7-Day Diet Plan for Fatty Liver Patients : కాలేయ సమస్య ఏది వచ్చినా అది త్వరగా బయటపడదు. అలాంటివాటిలో ఫ్యాటీ లివర్ ఒకటి. ఇది వివిధ కారణాల వల్ల వస్తుంది. జీవనశైలిలో పలు మార్పులు ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తాయి. అయితే కాలేయంలో కొవ్వు ఎక్కువైతే లివర్ పనితీరు దెబ్బతింటుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా పలు సందర్బాల్లో క్యాన్సర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. 

కాలేయంలో కొవ్వు పేరుకుపోతే వైద్యులు సూచించే సలహాలు పాటిస్తూ డైట్​లో కొన్ని మార్పులు చేయాలి. దానివల్ల ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవుతుంది. ఫ్యాటీ లివర్​ను కంట్రోల్ చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వారంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో.. డైట్​ని ఎలా ప్లాన్ చేసుకోవాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. 

సోమవారం డైట్

బ్రేక్​ఫాస్ట్​ సమయంలో గుడ్డు ఉడికించి తీసుకోవచ్చు. దానితో పాటు మల్టీ గ్రైన్ బ్రెడ్​ని టోస్ట్ చేసి.. అవకాడోతో కలిపి తీసుకోవచ్చు. మధ్యాహ్నం చికెన్ గ్రిల్డ్ చేసి.. గ్రీన్ సలాడ్​తో కలిపి తీసుకోవచ్చు. డిన్నర్ సమయంలో గ్రిల్డ్ ఫిష్, బ్రౌన్ రైస్, స్పినాచ్ కలిపి తీసుకోవచ్చు. ఈ ప్లాన్ ఫాలో అయితే శరీరానికి 1400 నుంచి 1500 క్యాలరీలు అందుతాయి. వీటిలో 35 శాతం ప్రోటీన్ ఉంటుంది. 40 కార్బ్స్, 25 ఫ్యాట్స్ ఉంటాయి.

మంగళవారం డైట్

గ్రీక్​ యోగర్ట్​లో చియాసీడ్స్, బెర్రీలు వేసుకుని బ్రేక్​ఫాస్ట్​గా తినొచ్చు. పప్పులతో సూప్​ చేసుకోవచ్చు. టమోట, కీరదోస సలాడ్ చేసుకుని మధ్యాహ్నం భోజనంగా చూసుకోవచ్చు. టోఫు లేదా పనీర్​ను గ్రిల్డ్ చేసి తీసుకోవచ్చు. దానిలో వెజిటేబుల్స్ కూడా వేసుకుని డిన్నర్​గా తినవచ్చు. వీటిని ఫాలో అయితే 1400 నుంచి 1450 కేలరీలు అందుతాయి. దీనిలో ప్రొటీన్ 30 శాతం, కార్బ్స్​ 45 శాతం, ఫ్యాట్స్ 25 శాతం ఉంటాయి. 

బుధవారం డైట్

బ్రేక్​ఫాస్ట్​గా వెజిటెబుల్ ఆమ్లెట్ చేసుకోవచ్చు. లంచ్​కోసం గోధుమ పిండితో చేసిన చికెన్ ర్యాప్ తినొచ్చు. దీనిలో కూరగాయలు కలిపి లంచ్​ కోసం తీసుకోవచ్చు. బేక్డ్ ఫిష్​ని రోస్ట్ చేసిన కూరగాయలతో కలిపి డిన్నర్​గా తీసుకోవచ్చు. ఈ ప్లాన్​ నుంచి 1450 నుంచి 1550 కేలరీలు శరీరానికి అందుతాయి. దీనిలో 40 శాతం ప్రోటీన్, 35 శాతం కార్బ్స్, 25 శాతం హెల్తీ ఫ్యాట్స్ అందుతాయి. 

గురువారం డైట్

గ్రీన్ స్మూతీని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. పాలకూర, అరటిపండుతో కలిపి స్మూతీగా చేసుకుని తీసుకోవచ్చు. శనగలతో సలాడ్స్ చేసి మధ్యాహ్నం లంచ్​ కోసం తీసుకోవచ్చు. గ్రిల్డ్ కెబాబ్స్, పాలకూర, యోగర్ట్, లెట్యూస్​తో సలాడ్స్ చేసుకుని డిన్నర్ చేసుకోవచ్చు. ఈ డైట్​లో శరీరానికి 1350 నుంచి 1450 కేలరీలు శరీరానికి అందుతాయి. దీనిలో ప్రోటీన్ 30 శాతం, కార్బ్స్ 45 శాతం, ఫ్యాట్స్ 25 శాతం ఉంటాయి. 

శుక్రవారం డైట్ ప్లాన్

బ్రేక్​ఫాస్ట్​గా ఓట్స్, దాల్చిన చెక్క, అవిసె గింజలు కలిపి ఓట్స్ బౌల్​గా తీసుకోవచ్చు. క్వినోవా సలాడ్స్ గ్రిల్డ్ చేసిన కూరగాయలను లంచ్​కి తీసుకోవచ్చు. బేక్డ్ చేసిన చికెన్ గ్రీన్ బీన్స్​ని డిన్నర్​ రూపంలో తీసుకోవచ్చు. ఈ ఫుడ్స్ వల్ల 1450 కేలరీలు నుంచి 1500 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 35 శాతం, కార్బ్స్ 40 శాతం, 25 శాతం ఫ్యాట్స్ ఉంటాయి. 

శనివారం డైట్

ఎగ్​ని పాలకూరతో కలిపి స్క్రంబల్డ్ చేసుకుని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. గ్రిల్డ్ సాల్మన్, బీన్స్​ని లంచ్​కి తీసుకోవచ్చు. వెజిటెబుల్స్, క్వినోవా కలిపి డిన్నర్​ కోసం తీసుకోవచ్చు. ఈ ఫుడ్స్​తో 1400 నుంచి 1500 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 40 శాతం, కార్బ్స్ 35, ఫ్యాట్స్ 25 శాతం ఉంటాయి. 

ఆదివారం డైట్ 

కాటేజ్ చీజ్​తో కలిపి బెర్రీలను బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. గ్రిల్డ్ చికెన్​ను అవకాడోతో కలిపి సలాడ్స్ రూపంలో భోజనంగా తీసుకోవచ్చు. వెజిటెబుల్స్ ఫ్రై చేసుకుని క్వినోవాతో కలిపి డిన్నర్​గా తీసుకోవచ్చు. వీటిలో 1400 నుంచి 1450 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 35 శాతం, కార్బ్స్ 40 శాతం, ఫ్యాట్స్ 25 శాతం ఉంటాయి. 

మరిన్ని టిప్స్.. 

తీసుకునే ఆహారంలో ప్రోటీన్ పుష్కలంగా ఉండాలి. ఇది లివర్​ త్వరగా రికవరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బరువును కంట్రోల్ చేస్తుంది. హెల్తీ ఫ్యాట్స్​ని కూడా డైట్​లో తీసుకోవాలి. ఆలివ్ నూనె, నట్స్, చేపల రూపంలో హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవచ్చు. వెజిటేబుల్స్, పండ్లు నుంచి హెల్తీ కార్బ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. కేలరీలు 1500కు మించకుండా చూసుకోవాలి. షుగర్, సాఫ్ట్ డ్రింక్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. ఇవి పరిస్థితిని మరింత దిగజార్చుతాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.