మద్యం సేవించే వాళ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని సర్వేలు చెబుతున్నాయి. రాత్రి మద్యం సేవించి వారిలో చాలా మందికి ఉదయం లేచాక హ్యాంగోవర్‌ పట్టి పీడిస్తుంది. మనిషి మనిషికి హ్యాంగోవర్ సమయంలో చూపించే  లక్షణాలు తేడాగా ఉంటాయి. డీహైడ్రేషన్, మైకం కమ్మినట్టు అవ్వడం, తలనొప్పి, అలసట, వికారం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. హ్యాంగోవర్‌ను వేగంగా వదిలించుకోవడానికి కొన్ని ఆహారాలు సహకరిస్తాయి. రాత్రి తాగిన మైకం ఉదయానికీ వదలకపోతే వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. హ్యాంగోవర్ వదిలి ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతారు.


టొమాటో జ్యూస్ 
ఉదయాన బ్రేక్ ఫాస్ట్ సమయంలో టోమాటో జ్యూస్ ని తాగండి. రాత్రి తీసుకున్న ఆల్కహాల్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దీనివల్ల హ్యాంగోవర్ అధికంగా అనిపిస్తుంది. టొమాటో రసంలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తాయి. 


ఓట్స్
వీటిలో కాల్షియం, విటమిన్ బి, మెగ్నిషియం వంటి పోషకాలు ఉంటాయి. హ్యాంగోవర్ గా అనిపించినప్పుడు ఓట్ మీల్ ను తింటే మంచిది. ఆల్కహాల్ వల్ల కలిగివన మైకాన్ని ఇది త్వరగా పోగొడుతుంది. 


అరటిపండ్లు
రాత్రి తాగిన మత్తు ఉదయానికీ దిగలేదనిపిస్తే రెండు అరటిపండ్లు చకచకా తినేయండి. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హ్యోంగోవర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తక్షణమే మీకు శక్తిని అందించి చురుకుదనాన్ని పెంచుతుంది. మీ చేతన స్థితిని తిరిగి తెస్తుంది. 


పాలకూర
ఆల్కహాల్ అధికంగా తాగడం వల్ల శరీరంలో ఫోలేట్ పోషకం తగ్గుతుంది. పాలకూర తిరిగి ఫోలేట్‌ను అందిస్తుంది. ఈ ఆకులో ఉండే విటమిన్ సి, ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. 


నట్స్
జీడిపప్పులు, బాదం, వాల్‌నట్స్, కిస్‌మిస్ వంటి నట్స్‌ను ఓ గుప్పెడు తినాలి. వాటిలో పోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆల్కహాల్ శోషణను నెమ్మించేలా చేస్తాయి. శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి భర్తీ చేస్తాయి. 


గుడ్లు
హ్యాంగోవర్‌గా అనిపించినప్పుడు రెండు ఉడకబెట్టిన గుడ్లు తినాలి. వీటిలో మద్యం ప్రభావాన్ని తగ్గించే అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మైకాన్ని తగ్గేలా చేస్తాయి. 


పుచ్చకాయ
వాటర్‌మిలన్ పండులో 90 శాతం నీరే. ఈ పండును తినడం వల్ల శరీరం రీఫ్రెష్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల శరీరం నిర్జలీకరణం అవుతుంది. ఆ ప్రభావాన్ని తగ్గించేది పుచ్చకాయే. ఇది హ్యాంగోవర్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.   


Also read: చవకగా దొరికే ఈ పండుతో సులువుగా బరువు తగ్గొచ్చు, రోజుకో రెండు ముక్కలు తినండి చాలు


Also read: పోషకాలతో నిండిన కొర్రల ఎగ్ ఫ్రైడ్ రైస్, మధుమేహులతో పాటూ ఎవరైనా తినొచ్చు