Walking Benefits for Diabetes : మధుమేహం రాకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో.. షుగర్ వచ్చిన తర్వాత దానిని కంట్రోల్ చేసుకోవడం అంతే ముఖ్యం. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు ఫుడ్ నుంచి లైఫ్‌స్టైల్ వరకు ఎన్నో మార్పులు చేయాలి. వాటిని ఫాలో అయితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. వీటిలో నడక కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. రోజుకు ఎంతసేపు నడిస్తే మధుమేహం ఉన్నవారికి మంచిదో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుందో చూసేద్దాం.
ఎన్ని నిముషాలు నడవాలంటే..
నడకతో మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. ఎంతసేపు నడిస్తే మంచిది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు కనీసం 30 నిమిషాలైనా నడవాలట. వారానికి 5 రోజులు నడవాలి. వారానికి 5 రోజులు.. రోజుకి 30 నిముషాలు అంటే 150 నిమిషాలు మీరు యాక్టివిటీ చేస్తారు. ఇలా వారంలో 150 నిమిషాలు యాక్టివ్‌గా ఉండడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుందని అమెరికన్ డయాబెటిస్ అసోషియేషన్ తెలిపింది. ఈ నడకవల్ల కలిగే లాభాలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ తెలుసుకుందాం.
నడకతో లాభాలు..
మధుమేహమున్నవారు నడకతో ఎన్నో లాభాలు పొందుతారు. నడక వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగవుతుంది. బరువు కంట్రోల్లో ఉండడంలో, తగ్గడంలో నడక హెల్ప్ చేస్తుంది. మధుమేహమున్నవారు బరువును కచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. నడక వల్ల రక్త ప్రసరణ పెరిగి గుండె సమస్యలను అదుపులో ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి.
నడిచేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహున్నవారు నడిచేప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచిది. నడక మంచిదే కానీ.. డయాబెటిస్ ఉన్నవారు తిన్న తర్వాత నడిస్తే చాలా మంచిది. తిన్న తర్వాత 10 నుంచి 15 నిముషాలు నడవండి. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోజుకు 7,000 నుంచి 10,000 స్టెప్ కౌంట్ ఉండేలా చూసుకోండి. రెగ్యులర్‌గా నడిస్తే మంచి ఫలితాలు చూస్తారు.
గాయాలు కాకుండా..
డయాబెటిస్ ఉన్నవారికి పాదాల్లో సెన్సేషన్ ఉంటుంది. కాబట్టి నడిచేప్పుడు సరైన షూ వేసుకుని నడిస్తే మంచిది. ఇది గాయాలు కాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే నడక చేస్తున్న సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. నడక వల్ల డీహైడ్రేషన్ వస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాబట్టి నడిచేముందు, తర్వాత కూడా శరీరానికి నీటిని అందించండి. అలాగే నడిచేప్పుడు ఏదైనా చిన్న హెల్తీ స్నాక్ తీసుకెళ్లండి. మీకు సడెన్‌గా చక్కెర రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది.
బిగినర్స్ అయితే..
మధుమేహంతో ఇబ్బంది పడుతూ వాకింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు మొదటి కొన్నివారాలు 10 నుంచి 15 నిముషాలు నడవండి. వారాలు పెరిగే కొద్ది టైమ్‌ని పెంచుకోండి. కుదిరితే చిన్న చిన్న బరువులు ఎత్తడం, వ్యాయామాలు చేయడం కూడా మీ రొటీన్లో భాగం చేసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుంటూ.. ఫుడ్ కంట్రోల్ చేస్తూ.. ఈ వాకింగ్ టిప్స్ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి.