Vitamin B12 Deficiency Is Rising in India : భారతదేశంలో చాలామందిలో విటమిన్ B12 లోపం పెరుగుతుంది. శరీరానికి ఈ విటమిన్ చాలా తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ.. ఇది చాలా అవసరం. విటమిన్ B12 రక్తం, మెదడు, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల అలసట, బలహీనత, చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు రావడం, మానసిక స్థితిసలో మార్పులు లేదా జ్ఞాపకశక్తి సమస్యలకు కారణం కావచ్చు. దీంతో ప్రాబ్లం ఏంటంటే.. నష్టం జరిగే వరకు గుర్తించలేము.
B12 లోపం ఎందుకు పెరుగుతోంది?
విటమిన్ B12 లోపం అన్ని వయసుల వారిని, లింగబేధం లేకుండా ప్రభావితం చేస్తుంది. డాక్టర్ నఖ్రా ప్రకారం ఈ లోపం కేవలం శాఖాహారులను మాత్రమే కాకుండా అందరిని ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. అధ్యయనాల ప్రకారం.. మాంసాహారులు కూడా B12 లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఎందుకంటే మీట్ ఎక్కువసేపు వేయించడం, వేడి చేయడం వల్ల ఆహారంలో విటమిన్ శాతం తగ్గుతుందట. దీనివల్ల B12 లోపం ఏర్పడుతుందని చెప్తున్నారు.
విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైనది. కనుక దాని లోపం మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ లోపం హోమోసిస్టీన్ స్థాయిలను పెంచి.. గుండె, నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
విటమిన్ B12 లోపం లక్షణాలు
విటమిన్ B12 లోపం సంకేతాలు నెమ్మదిగా కనిపిస్తాయి. అందుకే చాలా మంది వాటిని సాధారణ అలసట లేదా ఒత్తిడిగా భావిస్తారు. ఈ కింది లక్షణాలు విటమిన్ B12 లోపాన్ని సూచిస్తాయి.
- ఎల్లప్పుడూ అలసట లేదా బలహీనత
- రంగు వెలిసిన చర్మం
- మర్చిపోవడం
- చురుకుగా లేకపోవడం
- చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు
- సరిగ్గా నడవ లేకపోవడం
- కారణం లేకుండా అకస్మాత్తుగా కోపం లేదా బాధ
- గర్భధారణ సమయంలో సమస్యలు
- పిల్లలలో తక్కువ ఎదుగుదల లేదా ఏకాగ్రత సమస్యలు
ఈ సంకేతాలు ఏవైనా కనిపిస్తే విటమిన్ B12 పరీక్ష చేయించుకోండి.
చికిత్స సులభమే
ప్రాథమిక రక్త పరీక్ష విటమిన్ B12 స్థాయిలను గుర్తించగలదు. లోపం ఉన్నట్లు గుర్తిస్తే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. స్ప్రేలు లేదా ఇంజెక్షన్ల రూపంలో సప్లిమెంట్లను ఇవ్వవచ్చు. ఈ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత.. వాటిని నిర్వహించడానికి రోజువారీ మోతాదులు మాత్రమే అవసరం. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది. సురక్షితంగా తక్కువ ఖర్చుతో బయటపడొచ్చు.
విటమిన్ బి12 కోసం తీసుకోవాల్సిన ఆహారం
భారతదేశంలో అయోడిన్ లోపాన్ని తగ్గించడానికి ఉప్పుకు అయోడిన్ కలిపినట్లుగానే.. విటమిన్ B12తో నిండిన ఆహారాన్ని తీసుకుంటే B12 లోపం దూరం చేసుకోవచ్చు.
- గోధుమ పిండి (అట్టా)లో తరచుగా ఐరన్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది.
- అల్పాహార ధాన్యాలు, ఓట్స్ మంచి ఎంపిక.
- సోయా, బాదం, ఓట్ మిల్క్ వంటి మొక్కల ఆధారిత పాలు మంచివి.
- 1–2 టీస్పూన్లు పూర్తి ఈస్ట్ రోజువారీ B12 అవసరాన్ని తీరుస్తుంది.
వంట, జీర్ణక్రియ కొన్ని B12 ను నాశనం చేస్తాయి కాబట్టి.. మంచి పద్ధతిలో ఫుడ్ తీసుకోవడం లేదా 250–500 mcg సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.