Valentines Day : ప్రేమ.. ఇవి రెండు అక్షరాలే అయినా వీటి గురించి చెప్పమంటే మాత్రం ప్రేమికుల దగ్గర అస్సలు మాటలుండవు. మాటల్లో చెప్పలేని అనుభూతి ప్రేమ అని ఓ క్యాప్షన్ ఇచ్చి నవ్వేస్తారు. అలాంటి ప్రేమను సెలబ్రేట్ చేసుకునేందుకు ఫిబ్రవరిలో ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు. అదే వాలెంటైన్స్ డే. ప్రేమికులు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం (Valentines Day 2024) జరుపుకుంటారు. తమ పార్టనర్స్​కి బహుమతులు, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్స్ ఇస్తూ తమ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటారు.


ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఈ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైపోతుంది. ఓ వారం ముందు నుంచే రకారకాల డేలను ప్రేమికులు జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే వీక్​లో రోజ్​ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్​ డే, వాలెంటైన్స్ డే ఉంటాయి. వాలెంటైన్స్ డే అంటే కేవలం గర్ల్​ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్​కే కాదు.. భార్య భర్తలు కూడా దీనిని చేసుకోవచ్చు. అసలు ఈ వాలెంటైన్స్ డేని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామో.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


చాలామంది వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ.. దాని చరిత్ర గురించి పెద్దగా పట్టించుకోరు. అవునులే మాకేందుకు అనుకుంటున్నారేమో.. దీని వెనుకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అయితే మతాలకు, కులాలకు అతీతంగా.. కేవలం ప్రేమను మాత్రమే సెలబ్రేట్ చేసుకునే పండుగ అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ వాలెంటైన్స్ డేను కేవలం పాశ్చాత్య దేశాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునేవి. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ప్రేమికుల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. 


వాలెంటైన్స్​డే కి సెయింట్ వాలెంటైన్ పేరు పెట్టారు. కానీ అతని పేరు పెట్టకముందే ఈ రోజుని సెలబ్రేట్ చేసుకునేవారు అంటున్నారు. వాలెంటైన్​ డే లుపెర్కాలియా అనే పురాతన పండుగ నుంచి వచ్చిందని చెప్తారు. ఇది క్రైస్తవ మతానికి చెందిన రోమన్ పెండుగ నుంచి వచ్చింది. ఆ రోజు విందులు, భాగస్వాములతో కలిసి ఎంజాయ్ చేయడం వంటివి చేస్తారు. ఇది రక్తం, త్యాగంతో నిండిన ఓ ముఖ్యమైన వేడుకగా భావించేవారు. అలా వాలెంటైన్​ను గౌరవించే రోజుగా ఫిబ్రవరి 14 పరిణామం చెందింది. అది క్రమంగా ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజుగా మారింది. 


18వ శతాబ్ధం నాటికి ప్రేమికుల రోజును.. స్నేహితులు, ప్రేమికుల మధ్య బంధాలకు గుర్తుగా చేసుకోవడం ప్రారంభించారు. 19వ శతాబ్ధంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం ప్రింటెడ్ వాలెంటైన్స్ డే కార్డ్​లతో ప్రారంభమైంది. ఇది వాలెంటైన్స్ డే పూర్తి కథనే మార్చేసి.. కొత్త ట్రెండ్​ని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ప్రేమికులు గిఫ్ట్​లు, మెసేజ్​లు, రింగ్స్ ఇచ్చుకుంటూ ఒకరిపట్ల మరొకరు ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. కొన్ని దేశాల్లో వాలెంటైన్స్​డేకి హాలీడే కూడా ఇస్తారు. మరి ఈ వాలెంటైన్స్​డేని మీరు ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు?


Also Read : వాలెంటైన్స్ డే విషెష్​ను ఇలా ప్రేమగా చెప్పండి.. వాట్సాప్​లో ఇలాంటి కోట్స్ పెట్టేయండి