Ugadi Pachadi Recipe : ఉగాది 2025 వచ్చేసింది. ఈ సమయంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెప్తారు. ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉగాది పచ్చడిని ఇచ్చి, పుచ్చుకుని వేడుకలా జరుపుకుంటారు. అలాగే నైవేద్యంగా కూడా పెడతారు.అసలు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు.. దానిలోని పోషకాలు ఏంటి? దానిలో కేలరీలు ఎన్ని ఉంటాయి.. ఆరోగ్యానికి అందించే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఉగాది పచ్చడి.. 

తీపి, పులుపు, ఉప్పు, కారం, మసాలా, చేదు వంటి విభిన్న రుచులను కలిగి ఉంటుంది. ఇది జీవితంలోని పలు ఎమోషన్స్​ని ఇండికేట్ చేస్తుంది. ఆనందం, విచారం, కోపం, అసహ్యం, భయం, ఆశ్చర్యాలను ఇది సూచిస్తుంది. సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్​ని తెలుపుతుంది. ఉగాది పచ్చడిని వేప పువ్వులు, పచ్చి మామిడికాయ, బెల్లం, మిరియాల పొడి, కొబ్బరి, ఉప్పుతో తయారు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి దీనిలో స్వల్ప వైవిద్యాలు ఉంటాయి. కొందరు రుచిగా ఉండేందుకు ఈ ఉగాది పచ్చడిలో పుట్నాలు, జీడిపప్పు, ద్రాక్షలు, చెరుకు ముక్కలు, అరటిని కూడా వేసుకుంటారు. 

  • బెల్లం - తీపి రుచిని ఇస్తుంది. ఇది ఆనందాన్ని సూచిస్తుంది. 
  • వేప పువ్వు - వేప పువ్వును చేదు రుచిని కలిగి ఉంటుంది. ఇది విచారాన్ని సూచిస్తుంది. 
  • చింతపండు - పుల్లని రుచిని సూచిస్తుంది. ఇది అసహ్యాన్ని సూచిస్తుంది. 
  • మామిడి కాయ - ఘాటైన రుచితో ఉండి ఆశ్చర్యాన్ని ఇండికేట్ చేస్తుంది. 
  • ఉప్పు - ఉప్పు భయాన్ని సూచిస్తుంది. 
  • మిరియాల పొడి - ఇది కారం రుచిని ఇస్తుంది. కోపాన్ని ఇండికేట్ చేస్తుంది. 

మరి ఈ టేస్టీ ఉగాది పచ్చడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

నీరు - 1 ½ కప్పు 

పచ్చి మామిడికాయ - 2 టేబుల్ స్పూన్లు

వేప పువ్వులు - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - చిటికెడు 

బెల్లం - 3 టేబుల్ స్పూన్లు 

మిరియాల పొడి - చిటికెడు

చింతపండు - 1 స్పూన్ 

ఆప్షనల్ 

అరటిపండు ముక్కలు, పుట్నాలు, జీడిపప్పు తురుము, ద్రాక్షలు కూడా తీసుకోవచ్చు. 

Also Read : ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది

తయారీ విధానం 

చింతపండును కడిగి అరకప్పు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. వేప పువ్వును కూడా సిద్ధం చేసుకోవాలి. కాడలను వేసుకోకూడదు. అలాగే పువ్వు రెక్కలను మాత్రమే తీసుకుంటే మంచిది. మరో కప్పులో నీటిలో తురిమిన బెల్లం వేసి కరిగిపోయే వరకు కలపండి. దీనిని ఫిల్టర్ చేసి పెట్టుకుంటే మంచిది. బెల్లంలోని మలినాలు రాకుండా ఉంటాయి. తరువాత మిక్సింగ్ బౌల్ తీసుకుని.. దానిలో ఈ పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. మీ రుచికి తగ్గట్లు పచ్చడిలోని రుచులను అడ్జెస్ట్ చేసుకోవాలి. అనంతరం దేవునికి నైవేద్యం పెట్టి.. అనంతరం మీరు ఆస్వాదించవచ్చు. 

ఉగాది పచ్చడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. మీరు తీసుకున్న కొలతలకు ఒక చిన్న కప్పులో తీసుకుంటే 44 కేలరీలు ఉంటాయి. దీనిలో సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, చక్కెర, విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఉంటాయి. మీరు తీసుకునే ఫుడ్, ఇతర పదార్థాలకు అనుగుణంగా ఇవి మారుతూ ఉంటాయి.