WeightLoss: భారతీయ సుగంధ ద్రవ్యాలలో ధనియాలు ముఖ్యమైనవి. ఇవి ఆహారానికి రుచిని అందించేందుకు వాడతాము. ధనియాల పొడి ప్రతి ఇంట్లోనూ ఉండే మసాలా దినుసే. దీని వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ధనియాలు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తాయి. ప్రతిరోజూ ధనియాలు నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.


ఎలా తయారు చేయాలి?
ఒక స్పూను ధనియాల గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ మిశ్రమాన్ని వడకట్టి ధనియాలను తొలగించి, ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగాలి. తేనె వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే బరువు తగ్గే అవకాశం ఉంది.  ధనియాల నీళ్లు తాగడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పరగడుపున ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల శరీరం డీటాక్సిఫికేషన్‌కు గురవుతుంది. అంటే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి పోతాయి. ఈ డ్రింక్‌ను నిమ్మరసం కలిపి తాగుతాం. కాబట్టి బరువు కూడా తగ్గుతారు. ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఖనిజాలతో నిండి ఉంటాయి. యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కూడా అధికం. అందుకే ధనియాలు నీళ్లను రోజూ తాగితే రెండు వారాల్లోనే మీ చర్మం మెరవడం మొదలవుతుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా పోతాయి. ఈ నీళ్లలో యాంటీ ఫంగల్ లక్షణాలు అధికమని చెప్పుకున్నాం, కాబట్టి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంతో పాటు ఎలర్జీ కారకాలను కూడా తొలగిస్తాయి. 


మన శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత చాలా అవసరం. ఎలెక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడంలో ధనియాలు ముందుంటాయి. గోరువెచ్చగా ఉండే ధనియాల నీరు తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. పొట్ట ఉబ్బరం, పొట్ట అసౌకర్యం వంటివి తగ్గుతాయి. జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. 


ధనియాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నోట్ల పుండ్లు, పొక్కులను ఇవి అడ్డుకుంటాయి. నోటి అల్సర్లను తగ్గిస్తుంది. దీనిలో లినోలీయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నొప్పిని తగ్గిస్తుంది. ధనియాలను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో యాంటీ హైపర్ గ్లైసీమిక్ లక్షణాలు అధికం. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు ధనియాల పొడి, ధనియాలను వాడడం చాలా ముఖ్యం. హార్మోన్లు అసమతుల్యత సమస్యను ఇవి తగ్గిస్తుంది. ఒత్తిడిని అడ్డుకుంటుంది. 



Also read: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను



Also read: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి
























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.