Immunity-Boosting Tips to Stay Healthy : రోగనిరోధక శక్తి అనేది అందరికీ అవసరం. ఇమ్యూనిటీ బాగా ఉంటే సీజనల్ వ్యాధులు దరిచేరవు. ఇన్​ఫెక్షన్లు సోకవు. ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా త్వరగా దూరమవుతాయి. ఫాస్ట్​గా రికవరీ అవ్వగలుగుతారు. వర్షాకాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే కొన్ని వ్యాధులు, ఇన్​ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటున్నారు నిపుణులు. 

ఇమ్యూనిటీ పెంచుకోవడంలో భాగంగానే M E D S R X ఫార్మూలాను ఫాలో అవ్వమంటున్నారు నిపుణులు. అసలు ఈ ఫార్మూలా ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఇది ఎలా పని చేస్తుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

M- Meditation

మెంటల్ హెల్త్​ని తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు. మానసికంగా మీరు బాగుంటే ఒత్తిడి తగ్గి.. ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి వీలు దొరికనప్పుడు మెడిటేషన్ చేయాలని సూచిస్తున్నారు. ఇది మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా కూడా హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.

E - Exercise

వ్యాయామం కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో, మీ శరీరాన్ని స్ట్రాంగ్​గా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే మీరు ఎంచుకునే వ్యాయామం ఏ రూపంలో ఉండొచ్చు. యోగా, జిమ్, ప్రాణాయామం, వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, 10000 స్టెప్స్ ఇలా ఏమి చేసినా.. మీ నుంచి చెమట బయటకు పోవాలి. ఇది మిమ్మల్ని స్ట్రాంగ్​ చేస్తుంది. 

D - DIET

వీలైనంత వరకు వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. గట్ హెల్త్ కూడా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అన్​హెల్తీ ఫుడ్ జోలికి వెళ్లకుండా.. క్లీన్ ఫుడ్ తీసుకుంటే స్కిన్ హెల్త్​ కూడా మెరుగవుతుంది. నాన్​వెజ్​ తీసుకోవాలనుకుంటే చికెన్, చేపలు, వైట్ మీట్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. 

S - Sleep

నిద్ర అనేది అన్నింటికీ కీ-పాయింట్​గా చెప్పవచ్చు. నిద్ర సరిగ్గా ఉంటే సగానికి పైగా రోగాలు తగ్గుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజుకు 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలంటున్నారు. మీరు దానికంటే తక్కువ నిద్రపోయినా.. నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. 

R- Relationship

రిలేషన్​షిప్స్​ కూడా ఆరోగ్యం విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో మీకు నచ్చినవారితో ఎక్కువ సమయం గడిపేందుకు ట్రై చేయండి. వారు మీతో ఉంటే మీరు సంతోషంగా ఉంటారనుకుంటే కచ్చితంగా ఆ రిలేషన్​ని వదులుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోండి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. 

X-Factor

మీకు ఏదైనా పని సంతోషాన్ని ఇస్తుంటే దానిని కంటిన్యూ చేయండి. మీకు నచ్చిన హాబీని ఎవరికోసం వదులుకోకండి. ఎందుకంటే నచ్చినపనులు చేస్తున్నప్పుడు ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. 

ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుకోవడంలో హెల్ప్ చేస్తాయి. అందుకే ఈ ఫార్మూలాను ఫాలో అవ్వమని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని మీ అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేసుకుని కూడా ఫాలో అవ్వొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.