Top 10 Budget Friendly International Trips : మీరు ఇయర్​ ఎండ్​లోపు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్​లో ఇతర దేశాలకు వెళ్లి ఎక్స్​ప్లోర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని దేశాలు తక్కువ బడ్జెట్​లో వెళ్లొచ్చు. మరికొన్ని వీసా ఫ్రీ సౌలభ్యంతో వెళ్లొచ్చు.  ఏయే దేశాలకు ఎంత ఖర్చులో వెళ్లొచ్చు.. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏంటి? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

భూటాన్

భారత్ పౌరులకు భూటాన్ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఆరురోజుల ట్రిప్‌కు సుమారుగా 40,000 ఖర్చు అవుతుంది. రోజుకి 1500 నుంచి 2000 వరకు ఖర్చవుతుంది. చూడదగ్గ ప్రదేశాల్లో పారో, టైగర్‌స్ నెస్ట్, థింపు వంటివి ఉన్నాయి.

మలేషియా

రౌండ్ ట్రిప్ కోసం విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు 16,000. తినడానికి, తిరగడానికి 1500 నుంచి 2500 ఖర్చు ఉంటుంది. ఈ-వీసా ఉండాలి. కోలాలంపూర్, ల్యాంగ్​కవీ, పీనాన్గ్ చూడొచ్చు. 

జార్జియా

రౌడ్ ట్రిప్ కోసం ఫ్లైట్ ఛార్జ్ 30 వేలు అవుతుంది. రోజూవారీ ఖర్చు 1.5 వేల నుంచి 2.5 వేల ఖర్చు అవుతుంది. ఈ-వీసా ఉండాలి. టిబిల్సి, కావ్​కాసస్ పర్వతాలు, యూరోపియన్ ఆర్కిటెక్చర్ బాగా ఆకట్టుకుంటుంది. 

కంబోడియా 

రౌండ్ ట్రిప్​కోసం 26 వేల ఫ్లైట్ ఛార్జ్ అవుతుంది. రోజూవారీ ఖర్చులు 1.5 నుంచి 2వేలు ఖర్చు అవుతాయి. వీసా ఆన్ అరైవల్​తో వెళ్లొచ్చు. ఆంగ్​కోర వాట్ టెంపుల్స్, ఫ్నోమ్ పెన్హ్, సిహాన్కవిల్లే చూడొచ్చు. 

లావోస్

ఇండియా నుంచి లావోస్ వెళ్లేందుకు రౌండ్ ట్రిప్ కోసం ఫ్లైట్ ఛార్జ్ 25 వేలు అవుతుంది. తినడానికి, తిరగడానికి 1.5 నుంచి 2 వేలు అవుతుంది. వీసా ఆన్ అరైవల్​తో వెళ్లొచ్చు. లాంగ్ పారాబాంగ్, వాంగ్ వియాంగ్స్ అడ్వెంచర్, వాటర్ ఫాల్స్ ఆకట్టుకుంటాయి. 

నేపాల్ 

ఇక్కడికి వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఢిల్లీ నుంచి వెళ్తే 12 వేల నుంచి 18 వేల ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఖర్చులు 1500 నుంచి రెండు వేలు వేసుకోవచ్చు. కాట్మాండు, పోఖరా, హిమాలయన్ ట్రెక్స్ చేయొచ్చు. 

ఒమన్ 

ఒమన్ వీసా కోసం 2100 అవుతుంది. ఈ-వీసా ఇస్తారు. విమాన ప్రయాణం కోసం పది వేల నుంచి 13 వేలు టికెట్​ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. 2500 నుంచి 3500 వరకు రోజూవారి ఖర్చులు ఉంటాయి. అంటే తినడానికి, తిరగడానికి. మస్కట్, నిజ్వా, వాది షాబ్, వాది టివి వంటివి అక్కడ ఫేమస్, చూడదగ్గ ప్రదేశాలు. 

శ్రీలంక

ఇండియానుంచి చాలామంది శ్రీలంకను చూసేందుకు వెళ్తారు. అక్కడికి వెళ్లేందుకు విమాన టికెట్ 14 నుంచి 15 వేలు ఉంటుంది. రోజూవారీ ఖర్చు 2 వేల నుంచి 3 వేలు ఉంటుంది. బీచెస్ ఆఫ్ బెనటోటా, మిర్రిస్సా, నువారా ఎలియా చూడదగ్గ ప్రదేశాలు. 

థాయిలాండ్

థాయిలాండ్ వెళ్లేందుకు వీసా ఉండాలి. రౌండ్ ట్రిప్​కోసం 20 వేలు ఫ్లైట్ ఛార్జ్ అవుతుంది. రోజుకు 2 నుంచి 3 వేల ఖర్చు అవుతుంది. బ్యాంగ్​కాక్, చియాన్ మై టెంపుల్స్, ఫకెట్​కి వెళ్లొచ్చు. 

వియాత్నం 

వియాత్నం వెళ్లాలనుకుంటే ఈ-వీసా ఉండాల్సిందే. దీనికి రౌండ్ ట్రింప్ ఫ్లైట్ ఛార్జ్ 25 వేలు అవుతుంది. తినడానికి తిరగడానికి 1 నుంచి 2 వేలు అవుతుంది. హానోయి, హో చి మిన్ సిటీ, హోయి ఆన్ చూడదగ్గ ప్రదేశాలు.

మీరు కూడా ఈ ఏడాది చివర్లో ఓ ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ మీకు ఉపయోగపడతాయి. వెళ్లే ముందు అక్కడికి వెళ్లి వచ్చినవారి అనుభవాలు తెలుసుకోండి. అలాగే ఆ దేశంలోని భాష, కరెన్సీ, చట్టాలు గురించి ముందుగా తెలుసుకుని వెళ్తే మీ ట్రిప్ ఇంకా సురక్షితంగా, ఇంట్రెస్టింగ్​గా ఉంటుంది.