Nindu Noorella Saavasam Serial Today Episode: బిజినెస్‌ కోసం మీ అన్నయ్యను డబ్బులు నువ్వు అడుగుతావా..? నన్నే  అడగమంటావా అంటూ చిత్ర కోపంగా వినోద్ మీద అరుస్తుంది. అప్పుడే బయటకు వెళ్లిన అమర్‌, భాగీ వస్తుంటే వాళ్లను చూసి కొంచెంసేపు సైలెంట్‌గా ఉండు తర్వాత మాట్లాడుకుందాం అంటాడు.

చిత్ర: మీ అన్నయ్యేమో వచ్చిన డబ్బులు వచ్చినట్టే అనాథ ఆశ్రమాలు ఇస్తున్నారు. నువ్వేమో ఏమీ  చేయకుండా ఇంట్లో కూర్చున్నావు. చూడు వినోద్‌ నిన్ను ఎప్పుడూ మీ అన్నయ్య కన్నా టాప్‌ లో చూడాలనేది నా కోరిక. (అమర్‌ వాళ్లు లోపలికి వస్తారు.) బావగారు… మీతో కాస్త మాట్లాడాలి.

అమర్‌:  దేని గురించి

చిత్ర:  వినోద్‌ను నువ్వు అడుగుతావా..? నన్ను అడగమంటావా..?

వినోద్‌:  వద్దు నేను అడుగుతాను.. అదే అన్నయ్య బిజినెస్‌ పెట్టాలి. దానికి నువ్వు మనీ అరెంజ్‌ చేస్తా అన్నావు కదా ఎప్పుడా..?

అమర్‌: మీరు అడిగింది చిన్న అమౌంట్‌ కాదురా కొంచెం టైం పడుతుంది. వెయిట్‌ చేయండి

చిత్ర:  ఇంకెన్నాళ్లు వెయిట్‌ చేయాలి బావగారు. వచ్చిన డబ్బంతా మీరు దానధర్మాలు చేస్తుంటే ఇంక మాకేం మిగులుతుంది. ఈ ఆస్థి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయేలా ఉంది.

భాగీ: చూడు చిత్ర ఈ రోజు మేము అనాథ ఆశ్రమానికి డొనేట్‌ చేసింది. ఈ ఆస్థిలో ఉన్న  డబ్బు కాదు. బెస్ట్‌ కపుల్‌ కాంటెస్ట్‌లో మేము గెలుసుకున్న మనీ

చిత్ర: ఆ మనీ మాకు రాకుండా మీరు పోటీకి వచ్చారు కదా..? అదే మాకు వచ్చి ఉంటే ఇలా మీ దగ్గర చేయి చాచి అడుక్కనే వాళ్లం కాదు కదా..

భాగీ: అనాథ పిల్లలను ఆదుకోవాలని మేము ఆ కాంటెస్ట్‌ లో పాల్గొన్నాం.

చిత్ర: అవును మాకంటే మీకు వాళ్లే ఎక్కువ అయిపోయారు కదా..? మాకంటే మీకు చేతులు రావు.. వేరే వాళ్లకు ఇవ్వడానికి మీ చేతులకు ఎముకే ఉండదు

వినోద్‌: చిత్ర ఇంక ఆపుతావా..?

చిత్ర: ఏంటండి ఆపేది మనల్ని ఒకలా బయటి వాళ్లను ఒకలా చూస్తుంటే.. నాకు బాధగా ఉంది

భాగీ: ఇక్కడ మేము ఎవ్వరినీ వేరుగా చూడటం లేదు చిత్ర

చిత్ర: ఎందుకు చూడటం లేదు. అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్‌ ఎలా ఉంటుందో..? ఆస్థిలో మా వాటా పంచేస్తే మేము వేరుగా ఉంటాము కదా..?

భాగీ: ఏం మాట్లాడుతున్నావు చిత్ర. ఇంత చిన్న విషయానికి ఆస్థి పంపకాల వరకు వెళ్తావు ఏంటి..?

మనోహరి: ఏంటి భాగీ అమరేంద్ర ముందే గొడవ పడుతున్నావు నువ్వు తనకు ఏం మర్యాద ఇస్తున్నట్టు

భాగీ: ఆ మాట చిత్రకు చెప్పు

అమర్‌: భాగీ.. నువ్వు లోపలికి వెళ్లు..( భాగీ వెళ్లిపోతుంది.) మీకు కావాల్సిన డబ్బు సాయంత్రం వరకు అరేంజ్‌ చేస్తాను

అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు. మనోహరి నవ్వుతూ కంగ్రాట్స్‌ చిత్ర అనుకున్నది సాధించావు అంటుంది. ఏక్కడ అను.. నేను వేరు కాపురం పెట్టాలనుకున్నా అది తీరడం లేదు అంటుంది చిత్ర. ఒక్కోక్కటి మెల్లగా చేయాలి చిత్ర అంటుంది మను. రూంలో అమర్ మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంది భాగీ. ఇంతలో అక్కడకు అమర్‌ వెళ్తాడు.

అమర్‌: భాగీ ఇందాక నేను అన్న మాటలకు ఫీల్‌ అయ్యావా..?

భాగీ: అదేం లేదండి మీరు ఎవ్వరినీ ఏమన్నా వాళ్ల మంచికోసమే చెప్తారు. కానీ చిత్ర అవి అర్థం చేసుకోవడం లేదు. వినోద్‌కు బిజినెస్‌ ఎక్సీరియెన్స్‌ లేదు. చిత్రకు కూడా లేదు. ఏం తెలియకుండా వ్యాపారం చేస్తే నష్టపోకుండా ఎలా ఉంటారు చెప్పండి

అమర్‌: ఏదైనా పని చేసినప్పుడే కదా ఎక్సీరియెన్స్‌ వస్తుంది. ఏ పని చేయకపోతే ఏమీ రాదు..

భాగీ: అప్పుడు తను చేయబోయే బిజినెస్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవడమో.. స్టడీ చేయడమో.. లేదా కొన్నాళ్ల పాటు అదే బిజినెస్‌ చేస్తున్న వాళ్లతో కలిసి పని చేయడమో చేయాలి. ఆ తర్వాత కదా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలి

అమర్‌: వాళ్లకు ఇప్పుడు అంత టైం లేదు భాగీ

భాగీ: ఇప్పుడు మన దగ్గర కూడా అంత మనీ లేదు కదండి

అమర్‌: నేనే ఎలాగోలా అరైంజ్‌ చేస్తాను

అంటూ వాళ్లకు డబ్బులు అరైంజ్‌ చేయకపోతే చిత్ర వేరు కాపురం పెట్టడానికి రెడీగా ఉంది అంటూ అమర్‌ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!