Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనంద్‌ని ఫాలో అవుతారు. చాలా కార్లు ఉన్నాయ్.. డ్రైవర్లు ఉన్నారు అని బిల్డప్ ఇస్తారు కదా ఇలాంటి డొక్కు బండిలో వెళ్తున్నారేంటి అనుకుంటారు నర్మద, ప్రేమలు. మోసం చేసి చందు బావగారిని మోసం చేసి ఆ వల్లిని ఇచ్చిన పెళ్లి చేశారు. వీళ్లు గుట్టు రట్టు చేయాలి అనుకుంటారు. 

ఆనంద్‌రావు, భాగ్యం ఓ చోట వేరే బండి వాడితో గొడవ పడతారు. ఆ టైంలో భాగ్యం బండి అద్దంలో నర్మద, ప్రేమలు ఫాలో అవ్వడం చూస్తుంది. తర్వాత భర్తకి చెప్పి కాస్త దూరం వెళ్లి ఓ చోట బండి పడేసి ఇద్దరూ పరుగులు పెడతారు. ప్రేమ ఆ బండి చూసి మనం ఫాలో అవుతున్నట్లు తెలిసిపోయిందేమో అక్కడ అందుకే బండి ఇక్కడ పడేసి పారిపోయారని చెప్తుంది. దానికి నర్మద ఎంత దూరం పారిపోతారు ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటారు వెతుకుదాం పద అంటుంది. 

భాగ్యం, ఆనంద్రావు చెరో వైపు పరుగులు పెడితే నర్మద, ప్రేమలు చెరో వైపు వెతుకుతారు. పరుగెత్తి పరుగెత్తి భాగ్యం ఓ చోట కూర్చొని అమ్మ బాబోయే ఊపిరాడటం లేదు అనుకుంటే ఆనంద్ రావు ఇక నా వల్ల కాదురా దేవుడా అని ఓ వ్యాన్‌లో దాక్కుంటాడు. తర్వాత ప్రేమ, నర్మదలు తప్పించుకున్నారని అనుకొని ఎంత కాలం తప్పించుకుంటారో చూద్దాం అని అనుకుంటారు. ఇక ఆనంద్ రావు జస్ట్ మిస్ భార్యగారు ఆ నర్మద మనల్ని వదలదు అండీ అని అంటాడు. ఇక ఆ నర్మద కోరలు పీకేస్తా అని భాగ్యం శపథం చేస్తుంది. నర్మద, ప్రేమలు వెల్లిపోతారు. 

చందు పదిలక్షల గురించి ఆలోచిస్తూ ఓ షాప్ ముందు దిగులుగా కూర్చొని ఉంటాడు. ఆ డబ్బు విషయంలో నాన్న ముందు దోషిగా నిల్చొడం కంటే ప్రాణాలు తీసుకోవడమే నా ముందు ఉన్న పని అని అనుకుంటాడు. ఇంతలో ధీరజ్, సాగర్ అక్కడికి వస్తారు. ఏంట్రా అలా ఉన్నావ్ ఏమైంది అని అడుగుతారు. ఏం కాలేదని చందు అంటాడు. మాకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నీతో చెప్తామ్ కదా నువ్వు కూడా మాకు చెప్పరా అని అడుగుతారు. దాంతో చందు అలా ఏం లేదురా ఏమైనా ఉంటే మీకు చెప్పనా అని అనేసి వెళ్లిపోతాడు. 

సాగర్ ధీరజ్‌తో వీడు ఏదో దాస్తున్నాడురా అని అంటాడు. ఇక ధీరజ్  సాగర్‌తో పెద్దోడు సంగతి ఒకే కానీ నీ సంగతి చెప్పు..అంతా ఓకేనా.. వదినతో ఏం గొడవలు, కవ్వింపు  చర్యలు జరుగుతున్నాయా అని అడుగుతాడు. కవ్వింపు చర్యలు ఏంట్రా అని సాగర్ అడిగితే దానికి ధీరజ్ గతంలో నువ్వు చేసిన పనికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం కోపంలో వస్తువులు విసిరేయడం, కోపంతో మాటలు విసరడం ఇలాంటివి ఏం లేవు కదా అని అడుగుతాడు. సాగర్ మనసులో అన్నీ అవే జరుగుతున్నాయిరా కానీ నీతో చెప్పి పరువు పోగొట్టుకోలేను కదా అని అనుకుంటూ తమ్ముడితో మాత్రం నర్మదకు అంత లేదురా.. నేను అంటే నర్మదకు పిచ్చిరా.. మనం తిడతే పడటం, బతిమాలడం, భయపడటం తప్ప నాతో బతిమాలించుకునే అంత సీన్ నర్మదకు లేదురా అంటాడు. 

ధీరజ్ మనసులో వీడేందుకో బాగా సోది చెప్తున్నాడు. వదిన ఫుల్‌గా కోటింగ్ ఇస్తున్నట్లు ఉందని అనుకుంటాడు. ఇక సాగర్ ధీరజ్‌కి ప్రేమ గురించి అడిగితే మనసులో అది పెట్టే టార్చర్‌కి నిన్ను పట్టుకొని గట్టిగా ఏడ్వాలని ఉందిరా కానీ అలా చేయలేను. ఆ ప్రేమ టార్చర్‌లో పీహెచ్‌డీ చేసిందిరా అని అనుకొని బైటికి మాత్రం ఆ పిల్ల చిన్న పిల్లరా దానికి అంత సీన్ లేదు చాక్లెట్ కోసం ఏడ్చే టైపురా అది నాకు ఏం టార్చర్ పెడుతుంది అని అంటాడు. సాగర్ మనసులో నా కంటే ఎక్కువ టార్చర్ పడుతున్నట్లున్నాడు అని అనుకుంటాడు. ధీరజ్ ఎక్కువ లాగితే తెగిపోతుందని వెళ్లిపోదాం పదరా అంటాడు.

ధీరజ్ వెళ్తూ ప్రేమ నడుచుకుంటూ వెళ్లడం చూసి పాపం నడిచి వెళ్తుందని ధీరజ్ దగ్గరకు వెళ్తాడు. ప్రేమ వంకర టింకరగా మాట్లాడుతుంది. ధీరజ్‌ని పట్టించుకోకుండా వెటకారం చేస్తుంది. ధీరజ్ డ్రాప్ చేస్తానంటే అవసరం లేదు నడుచుకుంటూ వెళ్తానని అంటుంది. నువ్వు నడిచి వెళ్తే బాధగా అడిగితే ఇలా అంటావేంటే అని అడుగుతాడు. దానికి ప్రేమ ఇప్పుడు ఇలాగే అంటావ్ తర్వాత ఈ విషయాన్ని అవకాశంగా తీసుకొని నన్ను మాటలతో కుళ్లబొడుస్తావ్ అంటుంది. నీ మాటలు ఎవడు పడతారురా బాబు నీకు నీ సైకిల్కి ఓ దండంరా బాబు అని వెళ్లిపోతుంటే ధీరజ్ ఆపి నువ్వు నిజంగా అత్తవి అయితే నీ కోడలు పరిస్థితి ఏంటో అని అంటాడు. నువ్వు నడుస్తుంటే నాకు బాధగా ఉందే వచ్చి కూర్చొ అంటే ప్రేమ ధీరజ్‌తో నువ్వు సైకిల్ తొక్కొద్దు.. తోయ్ పొరపాటున నువ్వు నన్ను తాకితే నేను కావాలనే తాకాను అంటావ్ ఆ టార్చర్ నా వల్ల కాదు అని ప్రేమ అంటుంది. కావాలనే నన్ను టార్చర్ పెడుతున్నావే అని అంటాడు. ధీరజ్ ప్రేమని సైకిల్ మీద ఎక్కించుకొని సైకిల్ తోసుకొని వెళ్లడం సాగర్ చూసి ప్రేమకి నువ్వేంటే భయం అని నిన్ను చూసి వణికి పోతుంది అని చెప్పావ్ కదరా అని నవ్వుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.