Tomato Omlette Dosa Recipe : కేవలం గంటన్నరలో దోశ బ్యాటర్ రెడీ చేసుకుని.. టేస్టీ టేస్టీ టమాటో ఆమ్లెట్ దోశ తినొచ్చు. పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఇంట్లో ఉండే పదార్థాలతో.. రొటీన్​ దోశలకు భిన్నంగా.. టమాటో ఆమ్లెట్ దోశను తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీ టేస్టీ దోశను ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

బియ్యం - కప్పున్నర

పచ్చిమిర్చి - 5

అల్లం - 1 ఇంచు

టమాటాలు - 5

జీలకర్ర - 1 స్పూన్

రవ్వ - కప్పు

గుడ్లు - 4

నూనె - దోశలకు సరిపడా

పచ్చిమిర్చి - 4

ఉల్లిపాయ - 1

తయారీ విధానం

మీరు దోశలు వేసుకోవాలనుకునే గంటన్నర ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈలోపు టోమాటోలను పెద్దముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి కోసుకోవాలి. అల్లం మీ రుచికి తగ్గట్లు వేసుకోవచ్చు. ఎక్కువ వద్దు అనుకుంటే ఓ అంగుళం అల్లంని పైన తొక్క తీసి.. ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత నీళ్లతో కడిగి.. నీరు లేకుండా.. మిక్సీజార్​లోకి వేసుకోవాలి. దానిలో టోమాటో ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రం వేయాలి. 

పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. టోమాటోల్లోని నీరు పిండిని రుబ్బుకునేందుకు సరిపోతుంది. లేదు అంటే ఇంకొంచె నీరు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఓ మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో రవ్వ వేసుకోవాలి. కప్పున్నర బియ్యం తీసుకుంటే కప్పు రవ్వ తీసుకోవాలి. రవ్వ వేసి కలిపిన తర్వాత ఓ పది నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలో గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. గుడ్లు కూడా కలపడం వల్ల పిండి కాస్త పలుచగానే ఉంటుంది.

స్టౌవ్ వెలిగించి పెనం పెట్టి.. ఈ మిశ్రమాన్ని రవ్వదోశ వేసుకున్నట్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని.. కాల్చుకోవాలి. దోశ పలుచగానే ఉంటుంది కాబట్టి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ టోమాటో ఆమ్లెట్ దోశ రెడీ. దీనిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. చట్నీ లేకున్నా వేడి వేడిగా తింటే మంచి రుచి ఉంటుంది. ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా అయినా.. రాత్రి డిన్నర్​గా అయినా ఈ టోమాటో ఆమ్లెట్ దోశ బెస్ట్ ఆప్షన్. 

అయితే మీరు పిండిని ఎగ్ వేసి స్టోర్ చేసుకోవడం కన్నా.. ఎగ్ వేసుకోకుండా ముందే పిండిని తీసి స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఈ దోశ తినాలనుకున్నప్పుడు ఎగ్ వేసుకుని ఆస్వాదించవచ్చు. ఎగ్ వేసి పిండిని నిల్వ ఉంచడం కంటే.. ఇలా పిండిని విడిగా ఉంచడమనేది బెస్ట్. 

Also Read : హీరో మాధవన్ ఫేవరెట్ కాంజీ రెసిపీ.. నైట్ ప్రిపేర్ చేసి, మార్నింగ్ తింటే బరువు తగ్గడం నుంచి ఎన్నో బెనిఫిట్స్