కూరగాయలు లేదా పండ్లు ఏవైనా తినే ముందు, వండుకునే ముందు అందులోని విత్తనాలు తప్పనిసరిగా తీసేస్తారు. అవి వ్యర్థాలని భావించి పడేస్తారు. కానీ వాటిలో కూడా పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాల కంటే ఎక్కువగా ఉంటాయనే విషయంక హల తక్కువ మందికి తెలుసు. పోషకాలు సమృద్ధిగా ఉండే కొన్ని కూరగాయల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అవేంటంటే..


గుమ్మడికాయ గింజలు


పెపిటాస్ అని కూడ పిలుస్తారు. ఈ విత్తనాలు రుచికరమైన, పోషకాలు నిండిన చిరుతిండి. గింజలకు అంటిన గుజ్జును తొలగించుకోవడానికి వాటిని పూర్తిగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఓవెన్ ని 150 డిగ్రీల సెల్సియస్ కి ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి. బేకింగ్ షీట్  ఒక పొరలో కొద్దిగా ఆలివ్ నూనె, ఉప్పు చిలకరించి పెట్టుకోవాలి. వాటిని 20-30 నిమిషాల పాటు వేయించుకోవాలి. బంగారు గోధుమ రంగు వచ్చిన తర్వాత వాటిని తీసుకోవాలి. చిరుతిండిగా తినేందుకు చాలా రుచిగా ఉంటాయి.


సొరకాయ గింజలు


దీన్నే సీసా పొట్లకాయ అని కూడా పిలుస్తారు. కొంతమంది కూరతో పాటు గింజలు కూడా కలిపి వండుకుంటారు. కానీ అవి కాస్త ముదురుగా లేదంటే ఎండిపోయినట్టు అనిపిస్తే తీసేస్తారు. ఈ విత్తనాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తీసి శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఓవెన్ ని 175 డిగ్రీల సెల్సియస్ కి వేడి చేసి పెట్టుకుని గింజలు బేకింగ్ షీట్ లో వేసుకోవాలి. ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాలు, చిల్లీ పౌడర్ తో పాటు మసాలా దినుసులు వేసుకుని 15-20 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్పాహారం, సలాడ్ లో వీటిని చేర్చుకుని ఆస్వాదించవచ్చు.


జాక్ ఫ్రూట్ విత్తనాలు


పనస పండు తొనలు ఇష్టంగా ఆరగిస్తారు కానీ విత్తనాలు మాత్రం విసిరేస్తారు. వీటిని పారేయకుండా వాటి మీద ఉండే ప్లాస్టిక్ లాంటి పొర తొలగించుకోవాలి. వాటిని బాగా కడిగి 20 నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉడకబెట్టుకోండి. ఓవెన్ ని 190 డిగ్రీల సెల్సియస్ కి వేడి చేసి ఉడికించిన గింజలు బేకింగ్ షీట్ లో వేసుకుని ఆలివ్ ఆయిల్ లేదా బటర్ వేసుకోవాలి. బంగారు వర్ణం వచ్చే వరకు 20-25 నిమిషాల పాటు వేయించుకోవాలి. అల్పాహారంగా సలాడ్ లో జోడించుకుని తింటే రుచి సూపర్.


పర్వాల్ విత్తనాలు


పాయింటెడ్ పొట్లకాయ అని కూడ పిలుస్తారు. ఈ గింజలు చాలా సున్నితమైనవి. అందుకే పండిన కూరగాయల నుంచి జాగ్రత్తగా తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఓవెన్ ని 175 డిగ్రీల సెల్సియస్ కి వేడి చేసుకుని బేకింగ్ షీట్ లో కొద్దిగా ఆలివ్ నూనె మీకు నచ్చిన మసాలా వేసుకుని వేయించుకోవచ్చు. క్రంచీగయ మారే వరకు ఒక 20 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది.


కాకరకాయ విత్తనాలు


చేదు రుచి కలిగిన కాకరకాయ విత్తనాలు కాస్త గట్టిగా ఉంటాయని తీసేస్తారు. కానీ వీటిని చైనీస్ సంప్రదాయ వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. విత్తనాలు బాగా కడిగి పొడిగా ఆరబెట్టుకోవాలి. ఓవెన్ ని 175 డిగ్రీల సెల్సియస్ వేడి చేసుకుని బేకింగ్ షీట్ లో ఆలివ్ నూనె వేసుకుని 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ గింజలు రెడీ అయిపోయినట్టే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: నిరంతరం దగ్గు వస్తుందా? విస్మరించొద్దు, ఆ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది


Join Us on Telegram:https://t.me/abpdesamofficial