భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. కొన్ని రకాల పండుగులు కొన్ని ప్రాంతాల్లోనే జరుపుకుంటారు. ‘కాంతారా’ సినిమాలో చూపించిన భూతకోల పండుగ, జల్లికట్టు, అట్టుకల్ పొంగల్, మనదగ్గర చేసుకునే అట్లతద్దే వంటి పండుగలు అలాంటివే. ఒక ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా జరుపుకుంటారు ఇలాంటి ఉత్సవాలను. కొన్ని పండుగలకు ఎక్కడుండే వారైనా సరే తప్పనిసరిగా వారి సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడ పండగ ఎంజాయ్ చేస్తారు. కేరళలో జరుపుకునే చమయవిళక్కు పండుగ అలాంటిదే. ఈ పండుగ ప్రధానంగా కొల్లం జిల్లాలో జరుపుకుంటారు. ఈ ఉత్సవం చాలా ప్రత్యేకంగా, విభిన్నంగా జరిగే పండుగ. ఈ పండుగ కోసం పురుషులు స్త్రీల వలే తయారై అసలు పురుషులు అనే ఆనవాళ్లు కనిపించనంత సొగసుగా తయరవుతారు. ఏ కోణం నుంచి చూసినా స్త్రీలేనా అన్నట్టు కనిపిస్తారు.
ఈ మధ్యే భారతీయ రైల్వే అధికారి ఒకరు అనంత్ రూపనగుడి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చమయవిళక్కు పండుగ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అచ్చం స్త్రీ వలే అలంకరించుకొని ఉన్న ఒక పురుషుడి ఫోటోను పంచుకున్నారు. అత్యంత సమర్థవంతంగా స్త్రీగా కనిపించే పురుషుడు అని, ఇతడి మేకప్‌కు ప్రైజ్ కూడా వచ్చిందని అనంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
‘‘కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని కొట్టంకులంగరలోని దేవి ఆలయంలో చమయవిళక్కుఅనే పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకత ఏమిటంటే స్త్రీల వేషధారణలో పురుషులు జరుపుకుంటారు. పై చిత్రం మేకప్ పోటిలో మొదటి బహుమతి గెలుచుకున్న వ్యక్తిది’’ అని ట్వీట్ లో వివరించారు.
గ్రీన్ బార్డర్ ఉన్న మెరూన్ చీర కట్టుకున్న వ్యక్తి ఫోటో చాలా ఆకర్శణీయంగా ఉంది. అతడి మెకప్ లో లిప్ స్టిక్ నుంచి కోహ్ల్ రిమ్డ్ కళ్లు, ఐషాడో అన్నీ చాలా చిన్న చిన్న డీటైల్స్ లో తీసుకున్న మేకప్ జాగ్రత్తల వల్ల అతడు పురుషుడే అని అనేందుకు ఎక్కడా ఒక్క అవకాశం లేకుండాపోయింది. అతడు బంగారు అభరణాలు ధరించి నుదుటన బిందీ, ఓపెన్ పల్లుతో సంపూర్ణంగా స్త్రీలా కనిపిస్తున్నాడు.
ఈ పోస్ట్ చాలా వైరల్ అయ్యింది. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నమ్మలేమని కూడా కామెంట్స్ పెట్టారు. ఇదే ట్వీట్ కి సంబంధించిన కామెంట్లలో మరొకరు ఈ పండుగ గురించి మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. ‘‘చమయవిళక్కు పండుగ నాడు విళక్కు అనే దీపాలను వెలిగించి అక్కడి ప్రధాన దేవత అయిన భగవతీ దేవికి ప్రార్థనలు చేస్తారు. ఆ దేవి ఒక భక్తుడి కలలో కనిపించి స్వయంగా ఆమె తన కోసం అందరూ దీపాలు వెలిగించాల్సిందిగా కోరిందని చెబుతుంటారు’’ అని మరి కొన్ని వివరాలు కూడా పంచుకున్నారు.
మేకప్ పోటిలోమొదటి బహుమతి పొందిన అతడి ఫోటోను దాదాపు లక్షకు పైగా మంది చూశారు. కేరళ టూరజమ్ వారి వివరాల ప్రకారం చమయవిళక్కు దీపాల పండుగగా అభివర్ణించారు. మర్చి 10, 11 తేదిల్లో మళయాలం నెలల్లో ఒకటైన మీనమ్ రోజుల్లో ఈ పండుగ జరుపుకున్నారు.
Also Read: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?