బకాయం, మధుమేహం ఉన్న వాళ్ళు ఏది తినాలన్నా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే అవి తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా అని అనుమానాలు ఉండటం వల్ల ఇష్టమైన ఆహార పదార్థాలు తీసుకునేందుకు జంకుతారు. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి వేళ భోజనం తినే వరకు తీసుకునే పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి.


మనం తీసుకునే అల్పాహార ప్రభావం రోజంతా కనిపిస్తుంది. అందుకే ఎలాంటివి తింటే చక్కెర లెవల్స్ పెరగకుండా ఉంటాయి అనే దాని మీద అవగాహన ఉండాలి. ఎప్పుడు తినే ఇడ్లీ, దోశ బోర్ కొడితే ఈ కొత్తరకం స్మూతి ట్రై చేయండి. ఇది తయారు చేసుకోవడానికి ఎక్కువ సేపు కూడా పట్టదు. ఈ మ్యాజిక్ స్మూతీ తీసుకున్నారంటే ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. ఈ క్లాసిక్ స్మూతీ అల్పాహారంగా తీసుకుంటే మధ్యాహ్నం వరకు ఆకలిగానే అనిపించదు.


రకరకాల కూరగాయ ముక్కలు, పండ్లు వేసి తయారు చేసుకునే ఈ స్మూతీ చాలా రుచికరంగా ఉంటుంది. లంచ్ చేసే వరకు ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. ఇది శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలతో కూడిన అద్భుతమైన పదార్థం అని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆయన యూట్యూబ్ చానెల్ లో ఈ స్మూతీ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపించారు. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫైబర్ మొదలైనవాటితో కూడిన ఆరోగ్యకరమైన పదార్థంగా ఆయన అభివర్ణించారు.


స్మూతీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు


ఊబకాయం, మధుమేహం, జీవక్రియ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు ఉత్తేజం అయ్యేలా చేస్తుంది. స్మూతీ కోసం బొప్పాయి, యాపిల్, అరటిపండ్లు, అవకాడో, ఆలోవెరా జెల్, బచ్చలి కూర ఆకులు, దానిమ్మ ఖర్జూరం వాడాలని ఆయన సూచించారు. రోజుకి 3-4 పండ్లను ఉపయోగించవచ్చు. ఆకుపచ్చ స్మూతీ కోసం, బచ్చలికూర, అవకాడో, కలబందను ఉపయోగించవచ్చు.


నట్స్, గింజలు కలిపి పొడి చేసి వారం పాటు నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. వేరుశెనగ, జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు మొదలైన వాటిలో ప్రోటీన్, కరిగే ఫైబర్ ఉంటుంది. మంచి కొవ్వు పొందటం కోసం కొబ్బరి పాలు లేదా కొబ్బరి నూనె ఉపయోగించుకోవచ్చు.


ఫ్రూట్ స్మూతీ కోసం


☀ మామిడి


☀ బొప్పాయి


☀ దానిమ్మ లేదా మీకు నచ్చిన ఏదైనా పండ్లు


☀ కొన్ని ఖర్జూరాలు


☀ ప్రోటీన్ పొడి- ఒక టీ స్పూన్


☀ వీట్ గ్రాస్ పౌడర్- 1 టీ స్పూన్


☀ నట్ మిక్స్ పొడి- 1 టీ స్పూన్


☀ దాల్చిన చెక్క- ఒకటి


☀ కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్


☀ తేనె కొద్దిగా


☀ కొద్దిగా కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు


తయారీ విధానం


ఈ పదార్థాలు అన్నింటినీ మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా అయిన తర్వాట తీసుకుని తాగడమే.


గ్రీన్ స్మూతీ కోసం  


☀ యాపిల్


☀ అవకాడో


☀ దానిమ్మ


☀ పాలకూర


☀ అరటిపండు


☀ అలోవెరా జెల్


☀ ఖర్జూరం  


☀ ప్రోటీన్ పొడి- ఒక టీ స్పూన్


☀ వీట్ గ్రాస్ పౌడర్- 1 టీ స్పూన్


☀ నట్ మిక్స్ పొడి- 1 టీ స్పూన్


☀ దాల్చిన చెక్క- ఒకటి


☀ కొబ్బరి నూనె- 1 టేబుల్ స్పూన్


☀ తేనె కొద్దిగా


☀ కొద్దిగా కొబ్బరి పాలు, కొంచెం నీళ్ళు


వీటిని కూడా మిక్సీలో వేసి, జ్యూస్‌లా తాగేయడమే. ఇలా చేయడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.


ఇవి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి


☀ తీపి, పుల్లని పండ్లు కలిపి తీసుకోకూడదు


☀ స్మూతీని తయారు చేసిన 10 నిమిషాల లోపే తీసుకోవాలి.


☀ నీళ్ళు ఎక్కువగా తాగాలి. ఎందుకంటే స్మూతీలో మలబద్ధకానికి దారితీసే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే హైడ్రేట్ గా ఉండటం కోసం వీలైనంత వరకు మంచి నీళ్ళు తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: మీ చేతి వేళ్లు ఇలా మారుతున్నాయా? అయితే, మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!