వంట చేయడం కూడా ఒక కళ అని అంటారు. రుచిగా వండటం అందరికీ చేతకాదు. నోరూరించే వంటలు తయారు చేయడం అంత తేలికైన పని ఏమి కాదు. వాటిని తయారు చేయడం వెనుక చాలా ఎక్కువ పని ఉంటుంది. కూరగాయలు తాజాగా ఉంచడటం దగ్గర నుంచి వాటిని కత్తిరించి వండటం వరకు సరిగా చేయాలి. ఇదే కాదు వంట పూర్తయిన తర్వాత వంట గది శుభ్రం చేయడం చాలా పెద్ద పని. మీ వంట చేసే సమయం ఆదా కావాలంటే ఈ చిట్కాలు పాటించండి.


ఉల్లిపాయలు త్వరగా వేయించడం ఎలా?


ప్రతి ఒక్క కూరకి తాలింపులో ఉల్లిపాయ వేయనిదే రుచి రాదు. ఇక బిర్యానీ సంగతి అయితే చెప్పే అవసరమే లేదు. వేయించిన ఉల్లిపాయ వేస్తేనే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. అటువంటి ఉల్లిపాయ త్వరగా నూనెలో వేగదు. ఈ సింపుల్ చిట్కా పాటించారంటే ఉల్లిపాయ త్వరగా వేయించుకోవచ్చు. ఉల్లిపాయ వేసిన తర్వాత అందులో చిటికెడు ఉప్పు లేదా పంచదార వేసి వేయించారంటే అవి త్వరగా గోధుమ రంగులోకి వచ్చేస్తాయి.


పాలు పొంగిపోకుండా ఇలా చెయ్యండి?


ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. పాలు స్టవ్ మీద పెట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. ఇంకేముంది అవి కాస్త బుస్సుమని పొగిపోతాయి. స్టవ్ అంతా పాడైపోతుంది. అది శుభ్రం చేసుకోవడం మరొక తలనొప్పి. అలా పాలు పొంగకుండా ఉండాలంటే ఈ ట్రిక్ పాటించి చూడమని చెప్తున్నారు పంకజ్. పాలు పెట్టిన గిన్నె మీద చెక్క స్పూన్ ఒకటి పెట్టి చూడండి. అవి మారిగినా కూడా పొంగిపోకుండా ఉంటాయట. మహిళలు ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రిక్ ఏదో ట్రై చేసి చూడండి.  


ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చోలే తయారీ ఎలా?


రెస్టారెంట్ లో లభించే చోలే అంటే చాలా మంది ఇష్టపడతారు. అలా ఇంట్లోనే తయారు చేయాలని అనుకుంటారు కానీ ఆ రుచి మాత్రం రాదు. ఈ చిన్న చిట్కా పాటించారంటే ఇంట్లోనే సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్ చోలే రుచి, రంగు పొందొచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా టీ బ్యాగ్ లేదా కొన్ని టీ ఆకులను ఒక క్లాత్ లో ఉంచి చోలే ఉడకబెట్టేటప్పుడు ఉంచండి. సూపర్ గా ఉంటుంది రుచి.


డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ఎలా?


డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత బయట పెట్టేస్తారు. దాని వల్ల అవి మెత్తగా అయిపోతాయి. తినడానికి బాగోవు. అలా కాకుండా అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండాలంటే కంటైనర్ బాక్స్ లేదా జిప్ లాక్ బ్యాగ్ లో నిల్వ చేస్తే నెలల తరబడి తాజాగా ఉంటాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.