ర్మాన్ని సంరక్షించుకోవడం అంత ఈజీ కాదు. అందంగా కనిపించేందుకు, చర్మాన్ని సంరక్షించేందుకు ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి స్కిన్‌కు సరిపోతే బాగానే ఉంటుంది.. కానీ, రియాక్షన్ ఇస్తేనే సమస్య. మీరు ఎంచుకున్న స్కిన్ క్రీములు సరిగ్గా పనిచేయకపోతే ముఖం మీద దద్దర్లు, స్కిన్ అలర్జీ, మొటిమలు వచ్చేస్తాయి. మార్కెట్లో దొరికే వాటితో కాకుండా సహజమైన పద్ధతుల్లో అందాన్ని పొందాలంటే తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ మంచిగానే తింటున్నాం కదా అని అనుకుంటున్నారేమో, అది సరిపోదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం అన్ని పోషకాలు అందె మంచి ఆహారాన్ని డైట్లో భాగం చేసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని పుష్కలంగా లభించే కూరగాయలు, పండ్లని ఎంచుకుని తినడం ఉత్తమం. వీటిని తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటమే కాదు, మీ చర్మం కూడా మెరుస్తూ మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు. అలా అని ప్రతి కూరగాయ, పండ్లు స్కిన్ కేర్‌కి ఉపయోగపడతాయని అనుకుంటే పొరపాటే. చర్మ సంరక్షణకు ఉపయోగపడే కొన్ని ఆహారాలివిగో...


బ్రకోలి


చాలా మంది నారింజ పండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అందుకే విటమిన్-సి పొందటం కోసం ఎక్కువగా నారింజ లేదా నిమ్మకాయ వంటి సిట్రస్ ఫుడ్ మీద ఆధారపడతారు. కేవలం వాటిలోనే కాదు.. బ్రకోలిలో కూడా విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఒక అరకప్పు బ్రకోలిలో సిట్రస్ ఫుడ్లో కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇందులో ఉండే జింక్ చర్మానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకుంటుంది.


టొమాటో


చర్మాన్ని ఆరోగ్యకరంగా చేసే విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. టొమాటోలోని లైకోపిన్ చర్మం దెబ్బతినకుండా రక్షణగా ఉంటుంది. స్కిన్ డ్యామేజ్‌ని ఇది నివారిస్తుంది.


బెల్ పెప్పర్


క్యాప్సికమ్ జాతికి చెందిన ఇవి. చూసేందుకు క్యాప్సికమ్ మాదిరిగానే ఉంటాయి కాకపోతే రకరకాల రంగుల్లో ఇవి లభిస్తాయి. ఇందులో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఇక ఇందులో లభించే విటమిన్ ఎ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. చర్మం ఎండ వేడికి నిర్జీవంగా కనిపించకుండా సహాయపడుతుంది.


పాలకూర


ఆకుపచ్చని ఈ ఆకుకూరలో బీటా కెరొటీన్ తో పాటు వివిధ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్ సమస్య నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ


Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్