మనం పీల్చేగాలి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లోని వస్తువుల మీద పేరుకునే దుమ్ము మన ఊపిరితిత్తుల్లో రక్తంలో చేరి అలెర్జిక్ రియాక్షన్స్ కూడా రావచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద బయటి గాలి కాలుష్యంతో పాటు ఇంటిలోపలి కాలుష్యం కూడా  కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఇంట్లో ఉండే కాలుష్యాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారని, బయట వాహనాల మాదిరిగానే మన ఇళ్లలోని రోజువారీ వస్తువుల నుంచి వచ్చే వాయువులు ఆస్తమాకు కారణమయ్యే రకరకాల అలెర్జిక్ రియాక్షన్స్ ప్రేరేపిస్తాయనే ఆధారాలు చాలా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.


ఇలా అలెర్జీ వస్తే దగ్గు తగ్గకుండా వస్తుంది. రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపోవడం ఇబ్బందిగా మారుతుంది. గురకగా ఉండడం శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంటి వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం, మౌల్డ్స్, గ్యాస్ కుక్కర్లు ఆస్తమా ప్రేరేపించే అతి పెద్ద అలెర్జీ ట్రిగర్స్. వీటి వల్ల ఊపిరితిత్తుల మీద ప్రాణాంతకమైన ప్రభావం ఉంటుంది.


ఈ సిగరెట్లు, వుడ్ బర్నర్ల వంటివి కూడా ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అందుకే ఇంట్లో ధూమపానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌడ్స్ అలెర్జీ కారకాలు. వీటి గురించి అవగాహన కలిగి ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


క్లీనింగ్ ప్రొడక్ట్స్, స్ప్రే డియోడరెంట్స్ లేదా సెన్టెడ్ క్యాండిల్స్ వంటి వాటి ద్వారా చాలా కాలుష్యాలు ఇంట్లో వ్యాపిస్తాయి. కొన్ని ఎయిర్ మానిటర్లు వీవోసిలను గుర్తిస్తాయి. మరి కొన్ని వీవోసీల గురించి ఆయా ప్యాకింగ్ మీద క్లియర్ గా లెబుల్ చేసి ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఇవి అన్నీ కూడా అన్ని వయసుల వారికీ అనారోగ్యం కలిగిస్తాయి. కానీ  ఊపిరితిత్తులు చిన్నవిగా ఉండే పసి పిల్లలకు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇంట్లోని ప్రతి గదిలో ఎన్ని కాలుష్య కారకాలు ఉన్నాయో గుర్తించాలి. గోడల మీద ఉపయోగించిన పెయింట్లో కూడా అస్థిర కర్బన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అలెర్జీని ప్రేరేపిస్తాయి. కళ్లు లేదా చర్మం మీద దురద కూడా రావచ్చు. లేదా వాయుమార్గాలను కుదిస్తాయి. ఇంటి గోడలకు పేయింటును ఎంపిక చేసుకునే సమయంలో తక్కువ వీవోసీ కలిగిన వాటర్ బేస్డ్ పేయింట్ ను ఎంచుకోవాలి. పేయింటింగ్ పని జరుగుతున్నంత సేపు కిటికీలు తెరచి పెట్టుకోవాలి.


డస్ట్ అలర్జీ లేకపోవయినా.. సాఫ్ట్ టాయ్స్, పరుపులు, దిండ్లలో చేరే డస్ట్ మైట్స్ వల్ల అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. కనుక పై వస్తువలన్నీంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలు ఉన్నపుడు ఈ జాగ్రత్త చాలా అవసరం. బాడీస్ప్రేలు, నెయిల్ పాలీష్ ల వంటి బ్యూటి ప్రాడక్ట్స్ కూడా వీఓసీ లను కలిగి ఉంటాయి. కనుక వీటికి పిల్లలను దూరంగా ఉంచాలి.


సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించినపుడు వాటి నుంచి వచ్చే ఆవిరిలో కారకాలు ఉంటాయి. ఇవి ఆస్తమాతో సహా అలెర్జీ లను కూడా కలిగించవచ్చు. కుర్చీలు , టెబుల్స్ వంటి ఫర్నిచర్ కు ఉపయోగించే పేయింట్ లో కూడా ఫార్మాల్డిహైడ్ లేని వాటిని ఎంపికచేసుకోవడం మంచిది.


కిచెన్ లో ఉపయోగించే క్లీనింగ్ ఏజెంట్లు, స్ప్రేప్రొపెల్లెంట్ బాటిళ్లలో ఉండే గ్యాస్ వల్ల కూడా ఎయిర్ వేస్ లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఫలితంగా శ్లేష్మం పెరిగిపోతుంది. అలర్జీలు అస్తమాను తీవ్రతరం చేస్తాయి. ఎప్పుడైనా క్లీనింగ్ సమయంలో తప్పకుండా కిటికీలు తెరచి ఉంచాలి.


గ్యాస్ ఉపయోగించి చేసే వంట నుంచి విడుదలయ్యే పార్టికల్స్ నుంచి అలర్జీని ట్రిగర్ చేయవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ ల కోటింగ్ లో ఖూడా వీఓసీ ల వాడారా ఒక సారి చూసి కొనడం మంచిది.


Also read : వర్షంలో తడుస్తున్నారా? ఈ ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయ్, ఈ జాగ్రత్తలు పాటించండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial