రైన ఆహారం లేకపోతే శరీరం ఎలా నీరసించిపోతుందో అలాగే జుట్టు కూడా పోషకాలు అందకపోతే నిర్జీవంగా పేలవంగా కనిపిస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, నీరు తగినంతగా తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టుని కోల్పోవాల్సి వస్తుంది. అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అందరూ జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులతో జుట్టు రాలడం నిరోధించాలని చూస్తుంటారు. కానీ ఒక్కోసారి ప్రయోజనాలు కంటే అనార్థాలే ఎక్కువగా జరుగుతుంటాయి.


జుట్టు రాలడం ఆపి కొత్త జుట్టు పొందాలని అనుకుంటున్నారా? అయితే మీరు చేయాలసిందల్లా ఒక్కటే. కేశాల సంరక్షణకి ఉపయోగపడే ఈ ఐదు నూనెలు సరైన మోతాదులో కలిపి వారానికి రెండు సార్లు తలకి పట్టించాలి. అప్పుడు మీరు ఊహించని విధంగా జుట్టు పెరుగుతుంది. పొడవాటి జడ మీ సొంతం అవుతుంది. ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టు పెంచుకోవచ్చు.


కొబ్బరి నూనె: తరతరాలుగా యుగయుగాలుగా వస్తున్న కొబ్బరి నూనె జుట్టుకు చాలా మంచిది. కొబ్బరి నూనె జుట్టులో ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం, పొడి బారిపోవడం, పెళుసుగా మారిపోవడం నిరోధిస్తుంది. జుట్టుని లోతుగా హైడ్రేట్ చేస్తాయి.


ఆముదం: ఇతర నూనెలు మాదిరిగా కాకుండా ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆవనూనె తలకి మంచి పోషణ ఇస్తుంది. జుట్టు మృదువుగా ఉండేందుకు సహాయపడుతుంది. జుట్టుని బలపరిచి రాలదాన్ని నివారిస్తుంది.


బాదం నూనె: జుట్టు పొడిబారిపోవడం వల్ల చివర్ల చిట్లినట్లు కనిపిస్తుంది. దాన్నుంచి బయట పడాలంటే బాదం నూనె ఉత్తమ ఎంపిక. ఇది రాసుకోవడం వల్ల జుట్టు చివర్ల చిలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. బాదం నూనెలో పెద్ద మొత్తంలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. జుట్టుకి ఏదైనా నష్టం కలిగిస్తే దాన్ని రిపేర్ చేస్తుంది. జుట్టు పెరుగుదలకి దోహదపడుతుంది.


ఆలివ్ నూనె: ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడానికి దారితీసే డైహైడ్రోటెస్టోస్టిరాన్ లేదా DHT అనే హార్మోన్‌ ను నిరోధిస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. జుట్టు పెరిగేందుకు సహాయపడుతూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. ఇందులోని  యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుని క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్ లోని మాయిశ్చరైజర్ గుణాలు జుట్టు ఉత్పత్తిని ప్రోత్సాహిస్తాయి.


రోజ్మెరి ఆయిల్: రోజ్మేరీ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మినాక్సిడిల్ వలె ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనం వెల్లడించింది. మగవారి బట్టతల చికిత్సకు ఇది ఒక ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. పై నాలుగు నూనెలు సమాన మోతాదులో తీసుకుని దానికి 10 చుక్కల రోజ్మెరి ఎసెన్సియల్ ఆయిల్ జోడించాలి. ఈ ఐదు నూనెల మిశ్రమం వారానికి రెండు సార్లు తలకి రాసుకోవాలి. అప్పుడు కుదుళ్లు గట్టి పడి జుట్టు రాలే సమస్యని నివారిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మహిళలకి శక్తినిచ్చే సూపర్ ఫుడ్స్- శీతాకాలంలో వీటిని తినడం అత్యవసరం