మంకీపాక్స్ వ్యాధి ప్రస్తుతం 80 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17,000 కేసులు బయటపడ్డాయి. అందులో ఆరు నుంచి ఏడు వరకు మరణాలు కూడా నమోదయ్యాయి. ఆ మరణాలన్నీ ఆఫ్రికా దేశాల్లోనే సంభవించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాలను ఇప్పటి వరకు ప్రజలకు అవగాహన కల్పించింది. అయితే మంకీపాక్స్ గురించి పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనుగొంటూనే ఉన్నారు. ప్రస్తుతం మంకీపాక్స్ కు సంబంధించి రెండు కొత్త లక్షణాలను కనుగొన్నారు.
బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనాన్ని బట్టి మంకీపాక్స్‌కు సంబంధించి రెండు కొత్త లక్షణాలు కూడా ఉన్నాయి. యూకే పరిశోధకులు 197 మంది మంకీపాక్స్ రోగుల డేటాను పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న 71 మంది రోగుల్లో మలద్వారం భాగంలో విపరీతమైన నొప్పిని అనుభవించారు. 33 మంది గొంతునొప్పితో, 31 మంది పెనిల్ ఎడెమాతో, 27 మంది నోటి గాయాలతో బాధపడ్డారు. తొమ్మిది మంది టాన్సిల్స్ నొప్పిని అనుభవించారు.
కొత్త లక్షణాలు ఇవే
ఈ అధ్యయనంలో మంకీపాక్స్ సోకితే కలిగే కొత్త లక్సణాలను కనుగొన్నారు. అందులో ఒకటి నల్లటి పుండ్లు. అవి పులిపిర్లలా ఉంటాయి. నల్లటి మెలనోమా నిండిన గాయాల్లా ఉంటాయవి. అలాగే టాన్సిల్స్ నొప్పి పెట్టడం కూడా మంకీ పాక్స్ లక్షణాలలో ఒకటిగా గుర్తించారు. నల్లటి పులిపిర్లలాంటి పుండ్లతో పాటూ టాన్సిల్స్ కూడా వచ్చాయంటే మంకీపాక్సేమో అనుమానించాల్సిందే.
ఇతర లక్షణాలు...
మంకీపాక్స్ ప్రధానంగా స్వలింగ సంపర్కులు మధ్య, ద్విలింగ సంపర్కులు, అలాగే ఇతర పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. జ్వరం
2. తలనొప్పి
3. కండరాల నొప్పి
4. జాయింట్ పెయిన్
5. నడుము నొప్పి
6. లింఫ్ గ్రంథుల వాపు
7. దద్దుర్లు
8. విపరీతమైన అలసట
Also read: ఆరోగ్యకరమైన చిరుతిండి క్యాప్సికమ్ రింగ్స్, ఇలా చేస్తే కరకరలాడతాయి
Also read: నా పెళ్లికి రండి, విందుకు డబ్బులు చెల్లించండి, కాబోయే వధువు వెరైటీ అతిధి పిలుపు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.