పండ్లు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పండ్లు తిన్నాక నీరు మాత్రం తాగకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అవి జీర్ణక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ ఇస్తున్నాం, తెలుసుకోండి. 


అజీర్ణానికి దారితీస్తుంది:  పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగితే జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వానికి (ఎసిడిటీ) దారి తీస్తుంది. అంతేకాకుండా, ఇది పండ్ల నుండి అవసరమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల పొట్టలో అసౌకర్యంగా అనిపిస్తుంది. కాబట్టి, మీరు పండ్లు తిన్నాక కనీసం గంటసేపు నీళ్లు తాగకూడదు.  ఆ తరువాత తాగవచ్చు. 


అసిడిటీ: ఏ రకమైన పండ్లను తీసుకున్నా కూడా నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. 


పొట్ట తిమ్మిరి: పండ్లలో అధిక మొత్తంలో ఫ్రక్టోజల్, ఈస్ట్ ఉంటాయి. పండ్లు తిన్నాక నీటిని తాగితే పొట్టలోని ఆమ్లాలు పలుచగా మారుతాయి. ఇది పొట్టలో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. అప్పుడు పొట్ట నొప్పి, అపానవాయువు అధికంగా రావడం వంటివి జరుగుతుంది. 


బ్లడ్ షుగర్ : పండ్లను తిన్నాక నీరు తాగడం వల్ల అవి సరిగా అరగవు. జీర్ణం కాని ఆహారాలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. దీనివల్ల అధిక ఇన్సులిన్ స్థాయిలు ఏర్పడతాయి. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది కూడా కారణమే. కాబట్టి ఇలా పండ్లు తిన్నాక నీళ్లు తాగడం వల్ల భవిష్యత్తులో మధుమేహం. ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. 


పలుచటి గ్యాస్ట్రిక్ రసాలు: మన పొట్టలో జీర్ణ రసాలు ఉంటాయి. ఇవే ఆహారాన్ని అరిగేలా చేస్తాయి. పండ్లను తిన్నాక నీళ్లు తాగితే... నీటి శాతం పెరిగిపోతుంది. దీనివల్ల ఆ జీర్ణ రసాలు పలుచగా మారతాయి. దీని వల్ల ఆహారం అరగదు. ఇది గుండెల్లో మంట, ఆమ్లతను పెంచుతుంది. అసౌకర్యంగా అనిపిస్తుంది. 


PH స్థాయి: పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి అధిక నీటి శాతం కలిగిన పండ్లు జీర్ణవ్యవస్థ pH స్థాయిని భంగపరుస్తాయి. పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల pH స్థాయిలకు చాలా  ఇబ్బంది కలుగుతుంది. తద్వారా మీ పొట్టలో ఆమ్లత్వం తగ్గుతుంది. ఇది నిజానికి పొట్ట ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేయదు.


Also read: వయాగ్రా వాడాల్సిన అవసరం లేదు, రోజూ వీటిని తింటే చాలు, లైంగిక జీవితం సూపర్ హ్యాపీ


Also read: కోడిమాంసాన్ని కడగకుండానే వండాలా? పచ్చి చికెన్‌ను చేతులతో తాకితే ప్రమాదమా?








































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.