ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యాల మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి క్యాన్సర్. 2020 లో దాదాపు 10 మిలియన్ల మంది క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి రోగనిర్ధారణ ఆలస్యం కావడం కణితి పెరుగుదలని గుర్తించడం ఆలస్యంగా జరగడం వల్ల మరణాల రేటు పెరుగుతుంది. పురుషులు, స్త్రీలలో క్యాన్సర్ లక్షణాలు కనిపించిన కూడా నిర్లక్ష్యం చేసే సంకేతాలు ఇవి..


అలసట


అలసట అనేది చాలా మందిలో కనిపించే క్యాన్సర్ సంకేతం. క్యాన్సర్ సమయంలో చాలా బలహీనంగా, నీరసంగా, శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. కనీసం మంచం మీద నుంచి లేవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. చిన్న పని చేసినా కూడా అలిసిపోతారు. ఈ రకమైన అలసట నొప్పి కంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది. వికారం, వాంతులు, నిరాశ వంటివి ఎక్కువగా కనిపిస్తాయని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడిస్తుంది.


బరువు తగ్గడం


బరువు తగ్గడం అనేది క్యాన్సర్ మొదటి సంకేతాలలో ఒకటి. దురదృష్టవశాత్తు చాలా మంది వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తించలేరు. ఇతర కారణాలు ఏమి లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గితే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.


బాడీ రాష్


లుకేమియా ఉన్న వారిలో చర్మ సంబంధిత సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. ఈ దద్దుర్లు చర్మం కింద చిన్న రక్తనాళాలు విచ్చిన్నం కావడం వల్ల సంభవిస్తాయి. రక్త కణాలలో అసమతుల్యత వల్ల చర్మంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.


కళ్ళలో నొప్పి


కళ్ళలో కత్తి పెట్టి పొడిచినట్టుగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి తరచుగా వస్తుంటే వెంటనే వైద్యులని సంప్రదించడం చాలా ముఖ్యం.


తరచూ తలనొప్పి


తలనొప్పి క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులలో కనిపించే మరొక లక్ష్యం. మెదడు కణితి నొప్పి వల్ల తరచూ తలనొప్పి వస్తుంది. అది క్రమంగా పెరుగుతుంది.


బాధకరమైన పీరియడ్స్


మహిళల్లో మాత్రమే కనిపించే లక్షణం ఇది. పీరియడ్స్ సమయంలో బాధకారంగా భరించలేనంత నొప్పి వస్తే వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇది సాధారణంగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న వారిలో కనిపిస్తుంది.


రొమ్ములో మార్పు


మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ పురోగతిని నివారించడానికి స్వీయ పరీక్ష అవసరం. ఈ క్యాన్సర్ వచ్చేతప్పుడు రొమ్ములో మార్పులు చోటుచేసుకుంటాయి. చనుమొన లేదా రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. బ్రెస్ట్ షేప్ కూడా మారిపోతుంది. నొప్పిగా అనిపించి గడ్డలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది.


ఇతర సంకేతాలు


⦿ వృషణాల వాపు


⦿ ఆహారం తినడం లేదా మింగడంలో ఇబ్బంది


⦿ పేగు ఆరోగ్యం చెడిపోవడం


⦿ గురక


⦿ ఉబ్బరం సమస్య దీర్ఘకాలికంగా ఉండటం


⦿ పేగు కదలికలో మార్పులు


⦿ అంగస్తంభన సమస్యలు


⦿ మూత్రవిసర్జనలో ఇబ్బంది


⦿ జ్వరం


⦿ వేలి గోర్లలో మార్పులు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే!