తెలుగు భోజనంలో మసాలా దినుసుల ప్రాధాన్యత ఎక్కువ. ప్రతి ఆహారంలో ఇవి లేకుండా మన పూట గడవదు. ఇవి కేవలం భోజనం రుచిని పెంచేందుకే కాదు, మీకు మంచి కాలాన్ని తెచ్చేందుకు కూడా ఉపయోగపడతాయి. మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. ఇది నమ్మశక్యంగా అనిపించకపోయినా కూడా ఇది నిజమే అని వాదించే వాళ్లు ఉన్నారు. ఈ సుగంధ ద్రవ్యాలతో నూతన సంవత్సరాన్ని స్వాగతించండి. విజయవంతమైన, ఆరోగ్యకరమైన, సంపన్నమైన సంవత్సరంగా కొత్త ఏడాదిని మార్చుకోండి. 


లవంగం
హిందూ విశ్వాసాల ప్రకారం లవంగం చాలా పవిత్రమైనది. దీన్ని మతపరమైన ఆచారాలలో కూడా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసు చెడు చూపును పడనివ్వకుండా అడ్డుకుంటుంది. మీ పర్సులో కొన్ని లవంగాలను ఉంచుకోవడం లేదా పూజ చేసేటప్పుడు దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించడం వల్ల శుభం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే, ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద బయటికి వెళుతున్నప్పుడు ఒక లవంగం మొగ్గ నమిలి వెళ్లినా లేక మీ బ్యాగులో ఉంచుకున్నా సానుకూల ఫలితాలు వస్తాయిట. 


పసుపు
ప్రకాశించే పసుపుకు ప్రతికూలతలను తొలగించి అదృష్టాన్ని తెచ్చే శక్తి ఉంది. ఎందుకంటే పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే విష్ణువు, లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైనదని కూడా అంటారు. దీనికి చెడు చూపును తొలగించే శక్తి ఉందని నమ్ముతారు.రోజువారీ ఆహారంలో లేదా స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యమైన పని కోసం బయలుదేరే ముందు పసుపు బొట్టుగా పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి రావచ్చు. 


యాలకులు
ఉద్యోగ మార్పు కోసం చూసే వారు యాలకులను రాత్రి దిండు కింద పెట్టుకోవాలి. ఉదయం లేచాక వాటిని ఇంట్లో వారికి కాకుండా, ఎవరైనా బయటి వ్యక్తికి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల  కెరీర్‌లో అదృష్టాన్ని పొందవచ్చని ఎంతో మంది నమ్మకం.యాలకులను నమలడం వల్ల జీవితంలో సానుకూలత, డబ్బు, శాంతిని పొందవచ్చట. 


దాల్చిన చెక్క
దాల్చిన చెక్కకు సంపదను ఆకర్షించే శక్తి ఉందని చెబుతారు. జీవితంలో డబ్బు, శ్రేయస్సును ఆకర్షించే శక్తి  దీనికుంది. ఇంట్లో దాల్చిన చెక్కను ఉంచడం లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వం వస్తుందని చెబుతారు ఆధ్యాత్మిక నిపుణులు. 


బిర్యానీ ఆకులు
పులావులో వేసే బిర్యానీ ఆకులు చాలా శక్తివంతమైనవని అంటారు. కోరికలను, కలలను నెరవేర్చే శక్తి దీనికుందని చెబుతారు. ఈ ఆకులపై ఏదైనా కలర్ పెన్నుతో మీ కోరికను రాసి, దాన్ని పూర్తిగా కాల్చివేస్తే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. హిందూ పురాణాలలో కూడా, ఈ ఆకు పవిత్రమైనదిగా పరిగణిస్తారు. 


Also read: మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర మత్తు వస్తుందా? దానికిదే కారణం

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.