Settings to Help You Recover Your Stolen Mobile : ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేవరకు దాదాపు అందరూ ఉపయోగించే ఏకైక వస్తువు మొబైల్. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అవసరాలకోసం, అవసరం లేకపోయినా దీనిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ మొబైల్ కాసేపు కనపడకపోయిందంటే ఏమైనా ఉందా? కొంపలు మునిగిపోయినట్టే వెతికేస్తారు. అదే దానిని ఎవరైనా కొట్టేశారు అంటే దానిలో డేటా, ఫోన్​ గురించి ఏడుస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్​లో ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 


స్విచ్ ఆఫ్​ చేయకుండా ఉండాలంటే.. 


మీ ఫోన్​ని ఎవరైనా కొట్టేస్తే దానిని ముందు స్విచ్​ఆఫ్ చేయడానికి చూస్తారు కాబట్టి.. అలా కాకుండా ఉండాలంటే మీ మొబైల్​లో ఈ సెట్టింగ్ మార్చుకోవాలి. అప్పుడు ఫోన్ తీసుకున్నవాళ్లు స్విచ్​ ఆఫ్ చేయలేరు. పాస్​ వర్డ్ ఉంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఈ సెట్టింగ్​ కోసం.. మీ మొబైల్​లో సెట్టింగ్స్​కి(Settings) వెళ్లాలి. దానిలో మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీని (More Security and Praivacy) క్లిక్ చేసి.. రిక్వైర్డ్ పాస్​వర్డ్​ టూ పవర్​ ఆఫ్ (Required Password to Power Off)​ క్లిక్ చేయాలి. అక్కడ పవర్ ఆఫ్ బటన్ (Power Off Button)​ ఆన్​ చేయాలి. ఇలా చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేముందు కచ్చితంగా పాస్​వర్డ్ అడుగుతుంది.


ఫ్లైట్ మోడ్​ చేయకుండా.. 


ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు కాబట్టి ఫ్లైట్​ మోడ్​లో పెట్టేస్తే ప్రాబ్లమేగా అనుకుంటున్నారా? అలా దొంగ మన మొబైల్​ని ఫ్లైట్​ మోడ్ (Flight Mode)​లో పెట్టకుండా ఉండాలనుకుంటే.. కంట్రోల్ సెంటర్ లాక్ (Control Center Lock)చేయాలి. దీనిని ఎలా లాక్ చేయాలంటే సెట్టింగ్స్​ (Settings)లోకి వెళ్లాలి. దానిలో నోటిఫికేషన్, స్టేటస్​ బార్​ని(Notification Status Bar) క్లిక్ చేయాలి. అక్కడ స్టేటస్​ బార్​లోకి వెళ్లి లాక్​ స్క్రీన్ నోటిఫికేషన్​(Lock Screen Notification)ను క్లిక్ చేయాలి. స్వైప్ డౌన్​ ఆన్​ లాక్ స్క్రీన్ టూ వ్యూ నోటిఫికేషన్ డ్రాయర్​(Swipe Down Unlock Screen to View Notification Bar)ను బటన్​ను ఆఫ్ చేయాలి. 


ఫోన్​ను ఎలా దొరికించుకోవాంటే.. 


ఫోన్​ను ఎవరైనా కొట్టేసినా లేదా ఎక్కడైనా పెట్టి మరిచిపోయినా మళ్లీ దానిని దొరికించుకోవాలంటే మొబైల్​లో ఈ సెట్టింగ్ కచ్చితంగా ఆన్​లో ఉంచాలి. దానికోసం మొబైల్​లో ఫైండ్​ మై డివైస్​(Find My Device)ను ఆన్ చేసుకోవాలి. మొబైల్​లో ఫైండ్​ మై డివైస్​ ఆన్ చేసి.. దానిలో ఫైండ్ యువర్ ఆఫ్​లైన్ డివైస్​(Find Your Offline Device)ను క్లిక్ చేయాలి. దానిలో విత్​ అవుట్ నెట్​వర్క్​(Withoit Network)ని క్లిక్ చేసి ఫీచర్​ని ఆన్​ చేసుకోవాలి. దీనివల్ల సిమ్ తీసేసినా.. ఫోన్​ లొకేషన్​ని ట్రాక్ చేయవచ్చు. 


ఈ మూడు సెట్టింగ్స్​ని వెంటనే మీ మొబైల్​లో చేయడం వల్ల ఫోన్ పోయినా.. కనిపించకుండా పోయినా కంగారు లేకుండా ఈజీగా దానిని దొరికించుకునే అవకాశముంది. ఎలాగో అన్ని సెట్టింగ్స్ పెట్టాము కదా అని ఫోన్​ని నెగ్లెక్ట్​గా కాకుండా.. సేఫ్టిగా ఉంచుకోవడం మంచిది. లేదంటే ఫోన్​ స్విచ్ ఆఫ్ అవ్వట్లేదని, ఫ్లైట్​ మోడ్​లోకి వెళ్లట్లేదని దొంగ ఫోన్​ని పగలగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.