వంటకు రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, కొబ్బరి, నువ్వులు ఆలీవ్ నూనె ఇలా రకరకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కోనూనెలో ఒక్కోరకమైన రుచి, వాసనతో పాటు పోషకాలు కూడా డిఫెరెంట్ గా ఉంటాయి. భారతీయ వంటలకు బాగా సూటయ్యే నూనెల్లో నువ్వుల నూనె ఒకటి. ఈ నూనెలో విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాదు పాలీఅన్ సాచూరేటెడ్ (పీయూఎఫ్ఏ) కూడా పుష్కలం. నువ్వుల గింజల నుంచి 40 - 45 శాతం వరకు ఇడిబుల్ ఆయిల్ తీసుకోవచ్చు. అందుకే నువ్వులను క్వీన్ ఆఫ్ ద ఆయిల్ సీడ్స్ అంటారు. కేవలం వంటకు మాత్రమే కాదు, నువ్వుల నూనెతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అవేమిటో ఒకసారి తెలుసుకుందాం.


పోషక విలువలు


పాలీ అన్ సాచూరేటెడ్ కొవ్వు ఆమ్లాలు, సెసెమిన్, సిసామోలిన్ వంటి బయోయాక్టివ్ పోషకాలతో నువ్వుల నూనె మంచి పౌష్టికాహారం. అంతేకాదు నువ్వుల నూనోలో విటమిన్ k, ఒమెగా – 3 కొవ్వు ఆమ్లాలు లెసిథిన్ 2 వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి.


మంచి గుణాలు



  • ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

  • చర్మం మీద ఏర్పడే గాయాలకు మంచి మందు

  • నువ్వుల నూనె యాంటీ ఇన్ఫమ్లేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

  • రక్తనాళాల్లో ఏర్పడే బ్లడ్ క్లాట్స్ కరిగిస్తుంది.

  • యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది.

  • బీపీ అదుపులో ఉంటుంది.


నువ్వుల నూనె ఉపయోగాలు



  • వంటకు వాడొచ్చు.

  • నువ్వుల నూనెను సాస్లు, సలాడ్ల తయారీలో సీజనింగ్ కు కూడా ఉపయోగించవచ్చు.

  • నువ్వుల నూనె నేరుగా చిన్న మొత్తంలో తీసుకోవచ్చు. అయితే ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనే విషయంలో వైద్య నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.


దుష్ప్రభావాలు ఉన్నాయా?


మానవ శరీరం మీద ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతుందనే విషయంలో ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉంది. నువ్వుల నూనె తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఏదైనా తేలిక పాటి తేడా గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. నువ్వుల నూనె వాడడం మొదలు పెట్టడానికి ముందే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండే ఆస్కారం ఉంటుందో తెలుసుకోవడం మంచిది.


గర్భవతుల్లో, పాలిచ్చే తల్లుల్లో నువ్వుల నూనె ప్రభావం ఎలా ఉంటుందనే అంశం గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదు. సాధారణంగా గర్భవతులు నువ్వుల నూనె వాడకూడదని సలహా ఇస్తుంటారు. పాలిచ్చే తల్లులు కూడా ఈ విషయంలో నిపుణుల సలహా తర్వాతే వాడాలి.


వయసు పైబడిన వారు కూడా పరిమిత మోతాదుల్లో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉండొచ్చు. ఏదైనా ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనం ఆశించి నువ్వుల నూనె వాడాలని అనుకునే వారు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.


లాబ్ స్టడీస్ లో నువ్వుల నూనె మానవ శరీరంలోని ఒకరకమైన డ్రగ్ మెటబోలైజ్డ్ ఎంజైమ్ తో చర్య జరిపినట్టు గమనించారు. ఈ ఎంజైమ్ ను P450 అని పిలుస్తారు. దీనికి సంబంధించిన చాలా ప్రయోగాలు ఇంకా జరగాల్సి ఉంది. మందులు వాడుతున్న వారు ఈ నూనె వాడక పోవడమే మంచిది.


Also read: పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.