Parenting: మీ పిల్లలు ప్రశ్నలతో విసిగిస్తున్నారా ? ఈ పుస్తకం మీరు ఓసారి చదవండి

Good Book For Parenting: పేరెంటింగ్ అంటే ఆనందాలతో పాటు అనేక సవాళ్లతో కూడి ఉన్న ఒక జర్నీ. మీ పిల్లల ఎదుగుదలకు సహాయపడుతూ మంచి పేరెంట్స్ గా సపోర్ట్ ఇవ్వాలంటే ఈ పుస్తకంలోని స్ట్రాటజీలు పాటించండి.

Continues below advertisement

What is a good parenting:పిల్లల పెంపకం చాలా సవాళ్లతో కూడుకున్నది. వారి స్థాయికి దిగి ఆ స్టేజ్‌లో ఉంటే మనం ఏం చేస్తామో తెలుసుకొని ప్రమాదకరమైనవి వారికి నచ్చజెప్పి మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. కొందరు హైపర్ యాక్టివ్ ఉంటే... మరికొందరు చాలా ఇంట్రావర్ట్‌గా ఉంటారు. వాళ్లను మిగతా వాళ్లతో బ్యాలెన్స్ చేయించి ఆటపాటల్లో చదువులో రాణించేలా ప్రోత్సహించాలి. 

Continues below advertisement

పేరెంటింగ్ అంటే ఆనందాలతో పాటు అనేక సవాళ్లతో కూడి ఉన్న ఒక జర్నీ. చైల్డ్ పుట్టినప్పటి నుంచి వారి ఎదుగుదల కోసం అనేక విధాలుగా పేరెంట్ గైడెన్స్, సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మాడ్రన్ ప్రపంచంలో పేరెంటింగ్ కాస్త కష్టతరంగా మారింది. కానీ, కాస్త నాలెడ్జ్ సంపాదించి, పేషెన్స్ అలవరచుకుంటే ఆహ్లాదకరమైన పేరెంటింగ్ తో మీ పిల్లలను ఎదగనివ్వొచ్చు. 

పేరెంటింగ్ స్టైల్స్ ఒక్కొకరికి ఒక్కో పద్ధతిలో ఉంటుంది. కాంప్లెక్స్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకొని, పిల్లల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ ఇంటెల్లిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు పేరెంట్స్ కు "ది హోల్ బ్రెయిన్ చైల్డ్" అనే పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. 

లేటెస్ట్ న్యూరోసైన్స్, సైకాలజీలో జరిగిన పరిశోధనల ఆధారంగా, చైల్డ్ బ్రెయిన్ ని పూర్తిగా అర్థం చేసుకొని, వారి డెవలప్మెంట్ కోసం పేరెంట్స్ ఏ విధంగా సహాయపడొచ్చో రచయితలు డేనియల్ జె.సీగల్, టీనా బ్రైసన్ ఈ పుస్తకంలో చెప్పారు. వీళ్లు ముఖ్యంగా మంచి పేరెంటింగ్ కోసం 12 స్ట్రాటజీలను వివరించారు. అవేంటో చూద్దాం.

1. పిల్లలు సరిగ్గా కమ్యూనికేట్ చేయాటానికి, ఎమోషనల్ డెవెలప్మెంట్ కోసం..పేరెంట్స్ పిల్లలతో ఆరోగ్యకరమైన, దృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి. 

2. పిల్లలు వారి ఎమోషన్స్ ని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేసి, వారి ఎమోషన్స్ ని బయటకు సరిగా కమ్యూనికేట్ చేసేందుకు పేరెంట్స్ సహాయపడాలి.

3. పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినపుడు విసుగు తెచ్చుకోకుండా, వారికి సమాధానాలు చెప్పటం వల్ల వారికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. వాళ్లు ఎన్నో విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ వారిలో సెల్ఫ్ కాంఫిడెన్స్ పెరుగుతుంది. ఏమైనా అడిగినపుడు తిట్టి, కొట్టి నిశ్శబ్దంగా కూర్చోబెట్టడం వల్ల పిల్లలు భయానికే అలవాటు పడిపోతారు. 

4. పిల్లల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒకే పనిని మళ్లీ మళ్లీ ప్రాక్టీస్ చేసే అవకాశాలు కల్పించాలి. ఇందువల్ల బలమైన న్యూరల్ కనెక్షన్స్ ఏర్పడి, ఏ స్కిల్ అయినా సులభంగా నేర్చుకోగలుగుతారు. 

5. పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పటం, ఆటల్లో, ఇంకా ఏవైనా ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా చేయటం వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్ సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. ఎమోషనల్ గా కూడా ఎదుగుదల జరుగుతుంది.

6. ఏకాగ్రతతో పనులు చేయటానికి పిల్లలకు చిన్న చిన్న టిప్స్ నేర్పిస్తే, వారి ఆలోచనలను, ఎమోషన్స్ ను సరైన విధంగా ఉపయోగించగలుగుతారు.

7. గత అనుభవాలను గుర్తు చేస్తూ వాటిని కథలుగా చెప్పటం వల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే కష్టాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం అలవడుతుంది.

8. పిల్లల ఎమోషన్స్ ను వారు ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా అంగీకరించుకునేందుకు పేరెంట్స్ సహాయపడాలి. అపుడు వారు ఎమోషనల్ గా స్థిరమైన వ్యక్తిత్వాన్ని అలవరచుకోగలుగుతారు. 

9. సెన్సేషన్స్, ఇమేజెస్, ఆలోచనల ద్వారా అనుభవాలను అర్థం చేసుకోవటంలో పిల్లలకు సహాయపడాలి. దీని వల్ల పిల్లల్లో ఎమోషనల్ ఇంటల్లిజెన్స్ పెరుగుతుంది.

10. ఇబ్బందులను కొత్త అవకాశాలుగా చూడటం నేర్పితే, పిల్లల్లో సమస్య వచ్చినపుడు వాటిని సొంతగా పరిష్కరించుకోవటం అలవడుతుంది.

11. ఇతరులను అర్థం చేసుకొని మెలగటంలో చిన్నపాటి సూచనలు ఇస్తూ ఉంటే, బంధాలను ఏర్పరచుకోవటం, ఎంపథీ తో మెలగటం అలవాటు అవుతుంది.

12. ఏదైనా నేర్చుకోవాలనే ఇష్టాన్ని ఎంకరేజ్ చేస్తే పిల్లల్లో గ్రోత్ మైండ్ సెట్ అలవడుతుంది. జీవితంలో సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. 

Continues below advertisement