పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించిన విషయంగానే ఇప్పటికీ చూసేవాళ్లు ఎంతోమంది.కానీ చేసుకున్న మనుషులకు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోతే వారి జీవితమంతా కష్టాలమయమే. అందుకే పెద్దలకు నచ్చి పెళ్లి చేసే కన్నా, పిల్లలకు నచ్చిందో లేదో తెలుసుకుని పెళ్లి చేయమని చెబుతారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. కానీ ఇప్పటికీ చాలా చోట్ల బలవంతపు పెళ్లిళ్లు, ఇష్టంలేని పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లికి ముందు లేని ఇష్టం పెళ్లి తరువాత ప్రేమగా మారుతుందనుకోవడం భ్రమే, అది కోపంగా మారే అవకాశం కూడా ఎక్కువే. అందుకు ఈ వధూవరులే ఉదాహరణ. పెళ్లి రోజే వేదికపైనే ఫైటింగ్ కు దిగింది ఈ జంట. వారిద్దరికీ అది ఇష్టంలేని పెళ్లి అని స్పష్టంగా తెలిసిపోతోంది. వారిద్దరి పెళ్లి ఫైటింగ్ వీడియో వైరల్ గామ మారింది.
వీడియోలో ఉన్న ప్రకారం వధూవరులిద్దరూ స్టేజిపై ఉన్నారు. పెళ్లితంతు జరుగుతోంది. వారి పేర్లు, ఊర్లు తెలియదు కానీ ఉత్తర భారతదేశానికి చెందిన వారని పెళ్లి తంతును బట్టి అర్థమవుతోంది. వేదికపై వధులు స్వీట్ తినిపించేందుకు ప్రయత్నిస్తుంటే, వరుడు ఆ విషయాన్ని గమనించకుండా వేరే వారిపై సీరియస్ అవుతున్నాడు. విసుగొచ్చిన వధువు ఆ స్వీట్‌ను కోపంగా వరుడు ముఖానికి రాసేసింది. కోపం వచ్చిన వరుడు, వధువు చెంప పగులగొట్టాడు. ఆమె ఊరుకుంటుందా ఆమె అతనిపై విరుచుకుపడింది. వధూవరులు అలా కొట్టుకోవడం చూసి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇలాగే ఉంటదంటూ కామెంట్లు వెల్లువలా వచ్చాయి.
Also read: మెన్స్ట్రువల్ కప్ చూసి భయపడకండి, దాన్ని వాడడం చాలా సులువు