నీళ్లు జీవాధారం. భోజనం లేకుండా ఒక రోజంతా ఉండగలం. కానీ నీళ్లు లేకుండా నాలుగు గంటలు ఉండడం కూడా కష్టం. తప్పనిసరిగా నీళ్లు తాగాల్సిందే. నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయిపోయి కళ్లు తిరుగుతాయి. మరి నాలుగు గంటలు నీళ్లు తాగకుండా ఉంటేనే శరీరం డీహైడ్రేట్ అవుతుంది కదా. రాత్రి దాదాపు 8 గంటల పాటు నిద్రలో ఉంటాము. మరి ఆ సమయంలో నీటి అవసరం ఉండదా? అనేగా మీ సందేహం? అందుకే నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగాలని చెబుతున్నారు నిపుణులు.


రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. శరీరంలో అన్నిరకాల జీవక్రియలు సజావుగా సాగడానికి నీళ్లు తప్పకుండా అవసరం. రోజు మొత్తంలో ఈ పరిమాణంలో నీళ్లు తప్పని సరిగా తాగాల్సి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ముందుగా తీసుకోవల్సిన పానీయం నీళ్లే. మరి, బ్రష్ చేయడానికి ముందు తాగాలా? తర్వాత తాగాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఛీ, పాచి ముఖంతో నీళ్లు తాగడమా? నోట్లో క్రిములు కడుపులోకి వెళ్లిపోవూ అని అనుకుంటారు. కానీ, అదే ఆరోగ్యకరమైన అలవాటు అట. ఉదయాన్నే టీ, కాఫీలు తాగే బదులు.. గ్లాసుడు నీళ్లు తాగండి అంటున్నారు.


రాత్రి నిద్ర సుదీర్ఘ విశ్రాంతి. ఈ సమయంలో పదే పదే నీళ్లు తాగడం సాధ్యం కాదు. ఫలితంగా డీహైడ్రేషన్ అవుతుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం వల్ల శరీరం రీహైడ్రేట్ అవుతుంది.


రాత్రి నిద్ర సమయంలో నొటిలో బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు రెట్టింపవుతాయి. బ్రష్షింగ్ కు ముందే నీళ్లు తాగడం వల్ల నీళ్ల వల్ల నోరు శుభ్రం అవుతుంది. తర్వాత చేసుకునే బ్రష్షింగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.



  • బ్రష్షింగ్ కు ముందు నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే ఇమ్యూనిటి బలోపేతం అవుతుంది. సాధారణంగా దగ్గు, జలుబు వంటివి త్వరగా దరి చేరవు.

  • బ్రష్షింగ్ ముందు నీళ్లు తాగడం వల్ల ఆశ్చర్యకరంగా బీపీ కూడా అదుపులో ఉంటుంది. రోజంతా కూడా షుగర్ అదుపులో ఉంటుంది.

  • ఒక గ్లాసు నీటితో రోజు ప్రారంభిస్తే కడుపులో అల్సర్లు, ఇతర జీర్ణసమస్యలు పెద్దగా బాధించవు.

  • రోజు ఉదయం మొదట నీళ్లు తాగడం మొదలుపెట్టిన తర్వాత నుంచి చర్మం, జట్టు కూడా మృదువుగా మెరుపు సంతరించుకుంటాయి.


బ్రష్ఫింగ్ తర్వాత నీళ్లు తాగితే?


బ్రష్ చేసుకున్న వెంటనే ఎలాంటి ద్రవ, ఘన ఆహారం తీసుకోకూడదు. బ్రష్షింగ్ తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల వచ్చే ప్రయోజనాలు రావు. రోజంతా దంతాల సంరక్షణకు టూత్ పేస్ట్  అవశేషాలు ఉపయోగపడాలంటే బ్రష్షింగ్ తర్వాత 15-20 నిమిషాల పాటు వేచి ఉండాలి. అందుకే నిద్ర లేవగానే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం అనేది తప్పనిసరి. ఉదయాన్నే తాగే నీళ్లు రోజంతా హుషారుగా ఉండేందుకు తోడ్పడుతాయి. బ్రష్ చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తినడం కానీ తాగడం కానీ చెయ్యాలి.


Also read: పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.