Testosterone Test For Men : టెస్టోస్టెరాన్ అనేది రిప్రొడెక్టివ్ హెల్త్‌కి అత్యంత అవసరమైన, ముఖ్యమైన హార్మోన్. ఇది మగవారిలోనే కాదు ఆడవారిలో కూడా ఉంటుంది. ఇప్పుడు దీని గురించిన డిస్కషన్ ఎందుకంటే.. సోషల్ మీడియాలో మగవాళ్లు అందరూ పెళ్లికి ముందే టెస్టోస్టెరాన్ టెస్ట్ చేయించుకోవాలంటూ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అసలు టెస్టోస్టెరాన్ టెస్ట్ అంటే ఏంటి? ఈ హార్మోన్ వల్ల కలిగే లాభాలు ఏంటి? మగవారిలో ఇది ఎంత ఉండాలి? తక్కువగా ఉంటే కలిగే నష్టాలు, ఎక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
టెస్టోస్టెరాన్ టెస్ట్ ఎలా చేస్తారు?
టెస్టోస్టెరాన్ టెస్ట్‌ను చాలామంది స్పెర్మ్ టెస్ట్ అనుకుంటారు కానీ.. దీనిని బ్లడ్ టెస్ట్ ద్వారా నిర్థారిస్తారు. చేతి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టోస్టెరాన్ స్థాయిలు సాధారణంగా ఉదయం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టెస్ట్‌ని ఉదయం 7 నుంచి 20 గంటల మధ్య ఎక్కువగా చేస్తారు.
టెస్టోస్టెరాన్ ఎంత ఉండాలంటే..
టెస్టోస్టెరాన్ అనేది మగవారిలో వృషణాలలో ఎక్కువగా.. స్త్రీలలో అండాశయాలలో తక్కువ మోతాదులో ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్ హార్మోన్. అయితే ఇది మగవారిలో ఎంత ఉండాలంటే.. 300-1,000 ng/dL ఉండాలి. ఆడవారిలో ఇది 15-70 ng/dL ఉంటుంది.
టెస్టోస్టెరాన్ టెస్ట్ ఎందుకు చేస్తారు?
లైంగిక సామర్థ్యం, ఫెర్టిలిటీ సమస్యలు, ఇతర సమస్యలను గుర్తించడానికి ఈ టెస్ట్ చేస్తారు. ఆ రిజల్ట్‌లో టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే దానిని హైపోగోనాడిజం(Low Testosterone-Hypogonadism)గా గుర్తిస్తారు. తక్కువ టెస్టోస్టెరాన్.. హైపోగోనాడిజం, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, ఇతర వైద్య సమస్యలను సూచిస్తుంది. దీనివల్ల మగవారిలో సెక్స్ డ్రైవ్‌ని తగ్గుతుంది. అలసట, అంగస్తంభన వంటి లక్షణాలను ఎక్కువగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీని సూచిస్తుంది.
టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్లు రిజల్ట్ వస్తే దానిని హైపర్గోనాడిజం (High Testosterone-Hypergonadism) అంటారు. వృషణ కణితులు లేదా ఇతర వైద్య సమస్యలను ఇది ఇండికేట్ చేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మానసికంగా కోపాన్ని, ఫెర్టిలిటీ సమస్యలను నిర్ధారిస్తుంది. వంధ్యత్వం సమస్యలను గుర్తించడానికి, ఆ సమస్యను అంచనా వేయడానికి ఈ టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా బట్టతలకు కూడా కారణమవుతుంది.
టెస్టోస్టెరాన్ టెస్ట్‌లో రకాలు, స్థాయిలు
ఈ టెస్టోస్టెరాన్ను మూడు రకాలుగా పరీక్షిస్తారు. దానిలో Total Testosterone ఒకటి. దీనిలో భాగంగా రక్తంలో మొత్తం టెస్టోస్టెరాన్ని లెక్కిస్తారు. ఈ టెస్ట్‌లో రిజల్ట్ 300-1,000 ng/dL ఉండాలి. రెండోది ఫ్రీ టెస్టోస్టెరాన్(Free Testosterone). రక్తంలోని ప్రోటీన్ల వల్ల కోల్పోతున్న టెస్టోస్టెరాన్ మొత్తాన్ని గుర్తిస్తారు. ఇది 5-20 ng/dL ఉండాలి. మూడోది బయో అవైలబుల్ టెస్టోస్టెరాన్ (Bioavailable Testosterone). శరీరం ఉపయోగించడానికి అందుబాటులో ఉన్న టెస్టోస్టెరాన్ని ఇది సూచిస్తుంది. ఇది 150-500 ng/dL స్థాయిలు ఉండాలి.
మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు అసాధారణంగా ఉంటే వైద్యులు ఇతర టెస్ట్‌లు చేస్తారు. తక్కువ టెస్టోస్టెరాన్ ఉంటే దానికోసం టెస్టోస్టెరాన్ రిప్లెస్మెంట్ ట్రీట్మెంట్ (Testosterone Replacement Therapy) చేస్తారు. దీనిలో భాగంగా రెగ్యులర్‌గా టెస్టోస్టెరాన్ ఇంజక్షన్లు చేస్తారు. టాపికల్ జెల్స్ని శరీరానికి అప్లై చేస్తారు. కొన్ని రకాల ప్యాచ్‌లు కూడా టెస్టోస్టెరాన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.