కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలను సృష్టించడానికి శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమే. కానీ అతిగా ఉంటే మాత్రం గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. స్ట్రోక్, గుండె పోటు, ఛాతీలో అసౌకరం వంటివి అధిక కొలెస్ట్రాల్ వాలల వచ్చే ప్రమాదాలే. పోషకాహారం, తరచుగా వ్యాయామం చేయడం ద్వారా కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముందుగా ఈ సమస్య నుంచి బయట పడాలని అనుకుంటే ధూమపానం, మద్యపానం అలవాట్లు పరిమితం చేసుకోవాలి. అలాగే బరువుని అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ ని కరిగించి ఆరోగ్యానికి మేలు చేసే ఈ పది సూపర్ ఫుడ్స్ మీ మెనూలో ఉండేలా చూసుకోండి.


ఆలివ్ ఆయిల్: కూరగాయల నూనె లేదా నెయ్యితో వండటం కంటే ఆలివ్ నూనెలో వండటం మంచిది. పచ్చి ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, కె వంటి పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లలో కొన్ని రక్తనాళాల వాపును తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ కణాల ఆక్సీకరణతో పోరాడతాయి. రక్తపోటుని మెరుగుపరుస్తుంది. అందుకే కూరగాయల నూనె కంటే ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె మంచిది.


కొబ్బరినూనె: కొబ్బరి నూనె సంతృప్త కొవ్వుల గొప్ప మూలం. దీని కొవ్వు ఆమ్లాలలో 90 శాతం సంతృప్తికరమైనవి. ఆకలిని తగ్గిస్తుంది. తక్కువ తినెల చేస్తుంది. ఈ నూనె రోజుకి 120 కేలరీలు సరఫరా చేయడం ద్వారా జీవక్రియని పెంచుతుంది. పోషకాలు నిండినది.


చీజ్: చీజ్ అనగానే అనారోగ్యకరమైనది అని అనుకుంటారు. జంక్ ఫుడ్స్ రుచిని మరింత పెంచడంలో దోహదపడుతుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా ఇది చెడు ఆహారం కాదు. అత్యంత పోషకమైంది. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, ఫాస్పరస్, సెలీనియంతో సహా పాలలోని అన్ని మంచిగుణాలు దీనిలో ఉంటాయి. ప్రోటీన్ గొప్ప మూలం. ఒక స్లైస్ చీజ్ శరీరానికి 6.7 గ్రాముల ప్రోటీన్ ని అందిస్తుంది. అంటే ఒక గ్లాసు పాలతో సమానం.


డార్క్ చాక్లెట్: కొలెస్ట్రాల్ ని కరిగించే మరొక రుచికరమైన ఆహారం డార్క్ చాక్లెట్. దీన్ని తినే వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డార్క్ చాక్లెట్ చర్మాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది. వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.


రెడ్ వైన్: రోజుకొక గ్లాసు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందట. ఇది రక్తప్రవాహానికి మంచి కొలెస్ట్రాల్ ని అందించడమే కారణం. అయితే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే మాత్రం రెడ్ వైన్ తాగకపోవడమే మంచిది. దీన్ని తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.


నట్స్: వేరుశెనగ, వాల్ నట్స్, పిస్తా పప్పు వంటి గింజలు గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులని అందిస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శోషణని నిరోధించే ప్లాంట్ స్టెరాయల్స్ ని ఇస్తాయి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం ఎక్కువ. స్మూతీస్, బ్రేక్ ఫాస్ట్, ఫ్రూట్ సలాడ్ లో నట్స్ జోడించుకుని తినొచ్చు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మితంగా తీసుకోవాలి.


కొవ్వు చేపలు: సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ ని పెంచుకునేందుకు వారానికి కనీసం రెండు సేర్విన్గ్స్ కొవ్వు చేపలు తినాలి. సరైన చేపలు తీసుకోలేకపోతే బదులుగా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవచ్చు.


గుడ్లు: చాలా మంది గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తింటారు. కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పచ్చ సొన వదిలేస్తారు. కానీ ఈ అలవాటు అనారోగ్యకరమైనది. మీడియం సైజు గుడ్డులో 168mg కొలెస్ట్రాల్ ఉంటుంది.


పెరుగు: ఆరోగ్యకరమైన ప్రొబయోటిక్ ని అందించే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా గుండె జబ్బులు, ఊబకాయంతో పోరాడేందుకు సహాయపడుతుంది.


అవకాడో: అవకాడో ఇతర పండ్లు మాదిరిగా కాకుండా కార్బోహైడ్రేట్ లకు బదులుగా కొవ్వులతో నిండి ఉంటాయి. ఈ పండులో 77 శాతం కొవ్వుని కలిగి ఉంటుంది. రక్తనాళాల్లో మంటని తగ్గించడంలో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఫైబర్ కి గొప్ప మూలం. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: గుడ్లు వండేటప్పుడు ఈ తప్పులు చేయకండి- అవి మీ వంట రుచి మార్చేస్తాయ్


Join Us on Telegram:https://t.me/abpdesamofficial