Egg Recipes: కోడిగుడ్డుతో చేసే వంటకాలు ఎంతో మందికి ఫేవరేట్. గుడ్లు సంపూర్ణ ఆహారంగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి వారానికి రెండు మూడు సార్లయినా కోడి గుడ్లతో కూరలు వండుకుంటే మంచిది. వానాకాలంలో స్పైసీగా కోడిగుడ్డు కారం వండితే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. 


కావలసిన పదార్థాలు 
ఉల్లిపాయలు - నాలుగు 
గుడ్లు - ఆరు 
కరివేపాకులు - ఒక రెమ్మ 
నూనె - తగినంత 
కారం - అర స్పూను 
పసుపు - పావు స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా 
ఎండుమిర్చి - 15 
నువ్వులు - ఒక స్పూను 
ధనియాలు - ఒక స్పూను 
జీలకర్ర - ఒక స్పూను 
ఎండు కొబ్బరి పొడి - మూడు స్పూన్లు
ధనియాలు - ఒక స్పూను 
వెల్లుల్లి రెబ్బలు - 10 
పుట్నాల పప్పు - మూడు స్పూన్లు


తయారీ ఇలా
కోడిగుడ్డు కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కారంపొడిని తయారు చేసుకోవాలి. మిక్సీలో ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ పొడిలా కాకుండా కాస్త బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. వాటిలో కోడిగుడ్లను వేయించాలి. కోడిగుడ్ల పైన ఉన్న తొక్క రంగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలను సన్నగా తరిగి వేయించాలి. ఉల్లిపాయల రంగు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయిస్తే బాగుంటుంది. వాటిలోనే కరివేపాకులు, వేయించిన కోడిగుడ్లు కూడా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పుని కాస్త తగ్గించి వేసుకుంటే మంచిది. ఎందుకంటే మిక్సీ పట్టుకున్న కారప్పొడిలో కూడా ఉప్పు వేసాము, కాబట్టి ఆ రెండింటిని చూసుకొని ఉప్పు వేసుకుంటే మంచిది. ఇప్పుడు స్టమ్ మంటను తగ్గించి ఈ కారం పొడిని వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అలా వేయించాలి. అంతే కోడిగుడ్డు కారం రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు కారాన్ని వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా కోడి గుడ్డు కారం వండుకుంటే ఎంత అన్నాన్ని అయినా ఇట్టే తినేస్తారు.  కోడి గుడ్లు తినడం వల్ల ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి. పిల్లలకు రోజూ ఒక గుడ్డు కచ్చితంగా తినిపించాలి. 


Also read: వర్షాకాలం వచ్చిందంటే ఆస్తమా తీవ్రంగా మారే అవకాశం, రాకుండా ఇలా జాగ్రత్త పడండి


Also read: డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ కంటి సమస్య, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే



































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.